Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం భారీ వర్షాలు, వరదలకు అతలాకుతలం అవుతోంది. రుతుపవనాలు విస్తరించడంతో ఆ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆకస్మిక వరదుల, కొండచరియలు విరిగిపడటంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కనీసం 51 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 22 మంది గల్లంతయ్యారు. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ప్రైవేట్ ఆస్తులు, పశువులను నష్టపోయారు. ప్రజా మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి.
Read Also: Rekha Gupta: 5 టీవీలు, 14 ఏసీలు.. ఢిల్లీ సీఎం బంగ్లాకు ఎంత ఖర్చు చేస్తున్నారంటే..!
వర్షాలకు సంబంధించిన ఘటనల్లో 103 మంది గాయపడినట్లు రాష్ట్ర నివేదిక వెల్లడించింది. రాష్ట్రంలో 204 ఇళ్లు దెబ్బతిన్నట్లు నివేదించింది. ప్రజా మౌలిక సదుపాయాలకు జరిగిన నష్టం ఎక్కువగా ఉంది. ఇది రూ. 283.39 కోట్లుగా అంచనా వేశారు. జిల్లా వారీగా పరిశీలిస్తే కాంగ్రాలో అత్యధికంగా 13 మంది మరణించారు, చంబాలో ఆరుగురు, కలులో నలుగురు చనిపోయారు. కిన్నౌర్, సిమ్లా ,ఉనా జిల్లాల్లో 2 నుండి 4 మరణాలు నమోదయ్యాయి. సిర్మౌర్, సోలన్ జిల్లాల్లో తక్కువ మరణాలు నమోదయ్యాయి.