Report: భారతదేశంలో 2019-21 జనాభా ఆరోగ్య సర్వే ప్రకారం, 13 శాతం మంది పిల్లలు నెలలు నిండకముందే జన్మించారని, 17 శాతం మంది పుట్టిన సమయంలో తక్కువ బరువు ఉన్నారని తేలింది. వాయు కాలుష్యం పిల్లల జననాలను ప్రభావితం చేస్తుందని వెల్లడించింది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఢిల్లీ, ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్-ముంబై , UK- ఐర్లాండ్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ల పరిశోధకులు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-5, రిమోట్ సెన్సింగ్ డేటాను పరిశీలించి గర్భధారణ సమయంలో వాయు కాలుష్యానికి గురికావడం ప్రతికూల ప్రసవాలకు కారణం అవుతుందని విశ్లేషించాయి.
గర్భధారణ సమయంలో PM2.5 వాయు కాలుష్యానికి గురికావడం వల్ల తక్కువ బరువుతో శిశువు జననలు 40 శాతం, అకాల ప్రసవానికి 70 శాతం అవకాశం ఉందని పరిశోధన టీం కనుగొంది. వర్షపాతం, ఉష్ణోగ్రత వంటి వాతావరణ పరిస్థితులు ప్రతికూల బర్త్ రిజల్ట్స్‌తో సంబంధాన్ని కలిగి ఉన్నట్లు తేలింది. PLoS గ్లోబల్ పబ్లిక్ హెల్త్ జర్నల్‌లో ప్రచురించబడిన ఈ అధ్యయనం ప్రకారం.. భారతదేశ ఉత్తర ప్రాంతాల్లో నివసించే పిల్లలు, వాయు కాలుష్యానికి ఎక్కువగా గురయ్యే అవకాశం ఉందని చెప్పింది.
Read Also: Disha Salian Case: దిశా సాలియన్‌ది ఆత్మహత్య.. హత్యకు ఆధారాలు లేవు..
2.5 మైక్రాన్ల కంటే తక్కువ వ్యాసం కలిగిన, 2.5 (PM2.5) సూక్ష్మ కణాలు అత్యంత హానికరమైన వాయు కాలుష్య కారకాల్లో ఒకటిగe పరిగణిస్తారు. వీటిలో శిలాజ ఇంధన, బయోమాస్ వ్యర్థాలు ఉంటాయి. ఉత్తరప్రదేశ్, బీహార్, ఢిల్లీ, పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాలలో ఉన్న ఎగువ గంగా ప్రాంతంలో PM2.5 కాలుష్య కారకాలు అధిక స్థాయిలో ఉన్నాయని పరిశోధన చెప్పింది. దక్షిణ, ఈశాన్య ప్రాంతాల్లో తక్కువ స్థాయిలో ఉన్నట్లు కనుగొన్నారు.
హిమాచల్ ప్రదేశ్‌లో 39 శాతం, ఉత్తరాఖండ్‌లో 27 శాతం, రాజస్థాన్‌లో 18 శాతం, ఢిల్లీలో 17 శాతం అకాల జననాలు కనిపిస్తున్నట్లు చెప్పింది. మిజోరాం, మణిపూర్, త్రిపుర రాష్ట్రాల్లో ఇది తక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. పంజాబ్‌లో 22 శాతం తక్కువ బరువుతో శిశువులు పుడుతునున్నట్లు పరిశోధన తెలిపింది. పంజాబ్ తర్వాత ఢిల్లీ, దాద్రా అండ్ నాగర్ హవేలి, మధ్యప్రదేశ్, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్ ఉన్నాయి.