Pakistan: భారత్ దెబ్బకు పాకిస్తాన్ చైనా ఆయుధాలు, పరికరాలను నమ్మలేకపోతోంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను భారత్ స్వదేశీ తయారీ ‘‘ఆకాష్ ఎయిర్ డిఫెన్స్’’ సిస్టమ్‌తో పాటు డ్రోన్ల అడ్డుకునే ఆయుధాలు సమర్థవంతంగా, 100 శాతం ఖచ్చితత్వంతో పనిచేశాయి. ఇక రష్యన్ తయారీ ఎస్-400 సిస్టమ్ దెబ్బకు భారత్‌పై వైమానిక దాడులకు పాకిస్తాన్ భయపడింది. చైనా నుంచి పాక్ కొనుగోలు చేసిన రాడార్లు, HQ-9P , HQ-16 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌తో పాటు పీఎల్-15 వంటి చైనా తయారీ క్షిపణులను భారత్ ముందు పనిచేయలేకపోయాయి.
ఈ నేపథ్యంలోనే చైనా ఆయుధాలపై అపనమ్మకంతో ఇప్పుడు, పాకిస్తాన్ అమెరికా పంచన చేరుతోంది. పాకిస్తాన్ వైమానిక దళం (PAF) చీఫ్ జహీర్ అహ్మద్ బాబర్ సిద్ధూ అమెరికాతో తగ్గిన రక్షణ సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి వాషింగ్టన్ వెళ్లారు. దశాబ్ధం తర్వాత పాక్ ఎయిర్‌ఫోర్స్ చీఫ్ అమెరికా వెళల్డం ఇదే తొలిసారి. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశమైన తర్వాత జహీర్ అహ్మద్ బాబర్ పర్యటన జరుగుతోంది. రక్షణ సహకారం, సాంకేతికతపై పాకిస్తాన్, అమెరికా దృష్టి సారించాయి.
సమాచారం ప్రకారం, పాకిస్తాన్ తన వైమానిక దళాన్ని అప్‌గ్రేడ్ చేయడానికి ఎఫ్-16 బ్లాక్ కు చెందిన 70 ఫైటర్ జెట్లను, వైమానిక రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేయాలని భావిస్తోంది. చైనా పరికరాల విశ్వసనీయతపై ఆందోళన చెందుతున్న పాక్, అమెరికాతో రక్షణ సంబంధాలు మెరుగుపరుచుకోవాలని భావిస్తోంది. పాకిస్తాన్ అమెరికా తయారీ AIM-7 స్పారో ఎయిర్-టు-ఎయిర్ క్షిపణులను, US-నిర్మిత హై మొబిలిటీ ఆర్టిలరీ రాకెట్ సిస్టమ్ (HIMARS)లను పొందాలని చూస్తోంది.