Viral Video: అమ్మ పెళ్లి చేస్తోందని గుండు చేయించుకున్న అమ్మాయి? వైరల్ వీడియో వెనుక అసలు నిజం ఇదేనట!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral Video: సోషల్ మీడియాలో ఇటీవల వైరల్ అయిన ఓ వీడియో నెటిజన్లలో పెద్ద చర్చకు దారితీసింది. ఆ వీడియోలో ఓ యువతి పూర్తిగా గుండు చేయించుకుని కనిపించడంతో, తల్లి కుదిర్చిన పెళ్లిని తప్పించుకోవడానికే ఆమె ఈ నిర్ణయం తీసుకుందనే ప్రచారం జోరుగా సాగింది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చాలామంది ఇది నిజమని నమ్మారు. ఈ వైరల్ వీడియోను కంటెంట్ క్రియేటర్ కీర్తన్ మీనన్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. వీడియోకు “మా అమ్మ పెళ్లికి సిద్ధమవుతోంది” అనే క్యాప్షన్ ఇవ్వడంతో, పెళ్లి నుంచి తప్పించుకోవడానికే ఆమె గుండు చేయించుకుందనే ప్రచారం మరింత బలపడింది. అయితే అనంతరం కీర్తన్ మీనన్ ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు.
తన యూట్యూబ్ ఛానెల్లో రిలీజ్ చేసిన వీడియోలో ఆమె మాట్లాడుతూ.. గుండు చేయించుకోవడం వెనుక పెళ్లి ఒత్తిడి లేదా కుటుంబ సభ్యుల బలవంతం ఏమాత్రం లేదని వెల్లడించారు. చాలా కాలంగా జుట్టు దానం చేయాలనే కోరిక తనకు ఉందని, ఒకరోజు తన కజిన్ ఇంట్లో ఉన్న సమయంలో అకస్మాత్తుగా ఆ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని తల్లికి చెప్పినప్పుడు మొదట సరదాగా భావించినప్పటికీ, తర్వాత తన నిర్ణయం నిజమని అర్థం చేసుకుని పూర్తి మద్దతు ఇచ్చిందని కీర్తన్ తెలిపారు. అనంతరం తల్లీకూతుళ్లు కలిసి ఆలయానికి వెళ్లి ఆమె తన జుట్టును దానం చేసినట్లు వెల్లడించారు. దీంతో సోషల్ మీడియాలో వైరల్ అయిన “పెళ్లి తప్పించుకోవడానికి గుండు” అనే ప్రచారానికి కీర్తన్ మీనన్ స్వయంగా ఫుల్స్టాప్ పెట్టారు. సోషల్ మీడియాలో కనిపించే ప్రతి వైరల్ స్టోరిని నమ్మే ముందు వాస్తవాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఈ ఘటన మరోసారి నిరూపించింది. నిజం బయటపడిన తర్వాత, సోషల్ మీడియాలో చాలా మంది కీర్తన్ నిర్ణయాన్ని ప్రశంసించారు. ఒక యూజర్, “ఈ లుక్లో మీరు చాలా ఆత్మవిశ్వాసంతో, అద్భుతంగా కనిపిస్తున్నారు” అని కామెంట్ చేయగా, మరో యూజర్ “మీకు మరింత శక్తి లభించుగాక” అని రాసుకొచ్చారు. చాలా మంది హార్ట్ ఎమోజీలతో ఆమెకు మద్దతును తెలియజేశారు.
Also Read
- Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
- National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్గా మార్చే సింపుల్ టిప్స్.!
- Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
- Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
తాజావార్తలు
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
-
OTR: నారాయణ్ ఖేడ్లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
-
OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!