4 Indian-Origin People Kidnapped In US: అమెరికాలో 8 ఏళ్ల పాపతో పాటు నలుగురు వ్యక్తులను కిడ్నాప్ చేశారు దుండగులు. కాలిఫోర్నియాలోని మెర్సిడ్ కౌంటీలో సోమవారం ఈ ఘటన జరిగింది. కిడ్నాప్ అయిన వారిలో ఎనిమిది నెలల పాపతో పాటు ఆమె తల్లిదండ్రులు ఉన్నారు. 36 ఏళ్ల జస్దీప్ సింగ్, 27 ఏళ్ల జస్లీన్ కౌర్ తో పాటు వారి ఎనిమిది నెలల పాప అరూహి ధేరితో పాటు 39 ఏళ్ల అమన్ దీప్ సింగ్ ను దుండగులు కిడ్నాప్ చేశారు. ఆయుధాలు చూపించి కిడ్నాప్ చేసినట్లు మెర్సిడ్ కౌంటీ షెరీఫ్ వెల్లడించారు. నిందితులు ఆయుధాలు కలిగి ఉన్న ప్రమాదకరమైన వారని పోలీసులు తెలిపారు.
Read Also: Uttar Pradesh: నగ్నంగా బాలిక మృతదేహం.. అత్యాచారం చేసి చంపినట్లు అనుమానం
ఈ కిడ్నాప్ పై పోలీసులు విచారణ ప్రారంభించారు. అయితే ఈ సంఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సౌత్ హైవే 59లోని 800 బ్లాక్ లోని వారి వ్యాపార స్థలం నుంచి కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. వీరిని అపహరించిన స్థలం రెస్టారెంట్లు, ఇతర వ్యాపారాలు ఉండే ప్రాంతం అని పోలీసులు తెలిపారు. అసలు వీరిని ఎందుకు కిడ్నాప్ చేశారనేది ఇంకా తెలియరాలేదని.. కిడ్నాపర్ల నుంచి ఎంటి ప్రతిపాదన కూడా అందనట్లు తెలుస్తోంది. ప్రజలుకు అనుమానితులు, బాధితులకు సంబంధించిన వివరాలు తెలిస్తే 911కి కాల్ చేయాలని పోలీస్ అధికారులు సూచించారు.
ఇంతకుముందు 2019లో యూఎస్ లోని డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ యజమానిని కాలిఫోర్నియాలోని ఇంటి నుంచి కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసిన కొన్ని గంటల తర్వాత తుషార్ అత్రే.. ఆయన స్నేహితురాలు కారులో చనిపోయి ఉన్నారు.