ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ గా క్యాప్ బెల్ విల్సన్ ను నియమిస్తూ టాటా సన్స్ గురువారం అధికారికంగా ప్రకటించింది. ఎయిర్ ఇండియాను ప్రభుత్వం పూర్తి స్థాయిలో అమ్మివేసిన సంగతి తెలిసిందే. టాటా గ్రూప్ రూ. 18,000 కోట్లతో కొనుగోలు చేసింది. గతేడాది అక్టోబర్ లో టాటా గ్రూప్ ఎయిర్ ఇండియాను చేజిక్కించుకోగా… ఈ ఏడాది జనవరి నుంచి టాటా గ్రూప్ ఎయిర్ ఇండియాను పూర్తిస్థాయిలో ఆధీనంలోకి తీసుకుంది. ఇదిలా ఉంటే ముందుగా ఎయిర్ […]
దేశంలో ప్రముఖంగా ప్రస్తుతం జ్ఞానవాపి మసీదు వివాదం చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈరోజు జ్ఞానవాపి మసీదు వివాదంపై వారణాసి హైకోర్ట్ లో విచారణ జరిగింది. జ్ఞానవాపి మసీదు సర్వేపై కోర్ట్ విచారణ జరిపింది. సర్వే చేయాలని కోర్ట్ కమిషనర్ అజయ్ మిశ్రాతో పాటు మరో ఇద్దరు న్యాయవాదులను కమిషనర్లుగా నియమించింది. కమిషన్ మే 17 లోగా నివేదిక ఇవ్వాలని కోర్ట్ ఆదేశించింది. అయితే ఈ వివాదంపై ఇటు హిందువులు, అటు ముస్లింల తరుపున న్యాయవాదులు వారి వాదనలు వినిపించారు. […]
రాజద్రోహం చట్టంపై సుప్రీం కీలక ఆదేశాలు జారీ చేసింది. రాజద్రోహం చట్టంపై సుప్రీం కోర్ట్ స్టే విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. రాజద్రోహ చట్టం నిబంధనలను కేంద్ర హోం శాఖ పున: సమీక్షించే వరకు రాజద్రోహం కింద కేసులు నమోదు చేయవద్దని కేంద్ర , రాష్ట్రాలను ఆదేశించింది. రాజద్రోహ చట్టం 124ఏ కింద ఎలాంటి కేసులు నమోదు చేయవద్దని ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పటికే ఈ కేసు కింద శిక్ష అనుభవిస్తున్న వారు బెయిల్ […]
వరుస పరాజయాలతో ఢీలా పడ్డ కాంగ్రెస్ పార్టీకి విజయం అనేది ప్రస్తుత పరిస్థితుల్లో చాలా అవసరం. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చాలా దారుణ పరాజయాలను మూటకట్టుకుంది. చివరకు తాము అధికారంలో ఉన్న పంజాబ్ రాష్ట్రాన్ని కూడా అంతర్గత కలహాలతో ఆమ్ ఆద్మీ పార్టీకి అప్పచెప్పింది. ఇక ఉత్తర్ ప్రదేశ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ లో కాంగ్రెస్ పెర్ఫామెన్స్ గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. అంత ఘోరంగా పార్టీ అపజయాలను […]
జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370, 35ఏ ఎత్తేసిన తర్వాత ఉగ్రవాద కార్యకలాపాలు చాలా వరకు తగ్గాయి. ఎప్పటికప్పుడు లష్కరే తోయిబా, జైష్ ఏ మహమ్మద్, ది రెసిస్టెంట్ ఫోర్స్ వంటి ఉగ్రవాద సంస్థలు తమ ఉనికిని చాటేందుకు ప్రయత్నిస్తున్నా… భద్రతా బలగాలు వరసగా ఎన్ కౌంటర్లు చేసి ఉగ్రవాదులను మట్టుపెడుతున్నాయి. సరిహద్దుల వెంబడి పాక్ నుంచి వచ్చే ఉగ్రవాదుల సంఖ్య చాలా వరకు తగ్గింది. భద్రతా బలగాలు సరిహద్దుల వెంబడి నిఘా పెంచడంతో చాలా వరకు […]
‘స్విగ్గీ’ గురించి ప్రత్యేకం పరిచయం చేయాల్సిన పని లేదు. దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో ఫుడ్ డెలవరీలతో చాలా ఫేమస్ అయింది. ప్రస్తుతం మెట్రోసిటీల్లో బిజీ లైఫ్ కారణంగా హోటళ్లు వెళ్లి తినే అలవాటును తగ్గించుకుంటున్నారు. దీంతో స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలవరీ ప్లాట్ ఫారాలను ఆశ్రయిస్తున్నారు వినియోగదారులు. ఆర్డర్లు చేసిన తక్కువ సమయంలో నేరుగా ఫుడ్ ను ఇళ్లు తీసుకువస్తున్నారు. దీంతో స్విగ్గీ సంస్థకు ఆదాయం బాగానే వస్తోంది. ఇదిలా ఉంటే స్విగ్గీ ఇన్నాళ్లుగా నిర్వహిస్తున్న […]
దేశంలో మళ్లీ ఖలిస్తానీ ఉగ్రవాదం మొదలవుతుందా… ? అంటే జరుగుతున్న పరిణామాలను చూస్తే మాత్రం ఈ అనుమానం రాక మానదు. ఇటీవల కాలంలో పలు సంఘటనలు జరిగిన తీరును గమనిస్తే మరోసారి సిక్కు వేర్పాటువాద ఖలిస్తానీ ఉగ్రవాదులు యాక్టివ్ అవుతున్నట్లు తెలుస్తోంది. సిక్ ఫర్ జస్టిస్ (ఎసఎఫ్ జే) సంస్థ విదేశాల నుంచి భారత్ లో తన కార్యకలాపాలను మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. తాజాగా ఇటీవల పంజాబ్ మోహాలీలో ఇంటిజెన్స్ హెడ్ క్వార్టర్ పై రాకెట్ ప్రొపెల్లెడ్ గ్రానెడ్( […]
ఆఫ్ఘనిస్తాన్ దుర్భర పరిస్థితులను అనుభవిస్తోంది. తాలిబాన్ పాలనలో అక్కడి ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. గతేడాది ఆగస్టు 15న ప్రధాని ఆష్రఫ్ ఘనీ పౌరప్రభుత్వాన్ని కూల్చి తాలిబన్లు వారి పాలనను తీసుకువచ్చారు. అమెరికా సైన్యం ఆఫ్ఘన్ ను వదిలిన తర్వాత అక్కడ ప్రజలకు తాలిబన్లు చుక్కలు చూపిస్తున్నారు. తలతిక్క నిర్ణయాలతో ఆడవారిని ఇంటికే పరిమితం చేయడం, స్త్రీలను విద్యకు, ఉద్యోగానికి దూరం చేశారు. కఠినంగా షరియా చట్టాన్ని అమలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా యునైటెడ్ నేషన్స్ వరల్డ్ […]
ద్వీప దేశం శ్రీలంక రగులుతోంది. మొత్తం దేశం రావణకాష్టంలా మారుతోంది. తీవ్రమైన ఆర్థిక, ఆహారం సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. పూర్తిగా చెప్పాలంటే రాజపక్సే ప్రభుత్వం శ్రీలంకను అప్పుల ఊబిలోకి నెట్టేసింది. దీంతో పాటు అక్కడ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు తీవ్ర ఆహార కొరతకు కారణం అయ్యాయి. మరోవైపు ఆర్థిక పరిస్థితికి మించి విదేశాల నుంచి ముఖ్యంగా చైనా నుంచి అప్పులు తీసుకుంది. అప్పులు చెల్లించలేక హంబన్ టోటా రేవును చైనాకు లీజుకు ఇచ్చింది. అధ్యక్షుడు గొటబయ రాజపక్సే, ప్రధాని […]
దేశవ్యాప్తంగా సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవరిస్తున్న స్వచ్ఛంద సంస్థలపై రైడ్స్ నిర్వహిస్తోంది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం నిబంధనలను ఉల్లంఘించి పలు స్వచ్ఛంద సంస్థలకు అనుమతులు ఇచ్చినందుకు సీబీఐ ఈ దాడులు నిర్వహిస్తోంది. ఎన్జీఓ సంస్థలు, వాటికి సంబంధించిన వ్యక్తులపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వేస్టిగేషన్ టీమ్ దాడులు చేస్తోంది. దేశ వ్యాప్తంగా 40 ప్రాంతాల్లో.. హైదరాబాద్, ఢిల్లీ, కోయంబత్తూర్, మైసూర్, రాజస్థాన్ ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం(ఎఫ్సీఆర్ఏ) నిబంధనలు […]