మదర్సాల్లో జాతీయ గీతం, జ్ఞానవాపి మసీదు సర్వే అంశాలపై ఎంఐఎం పార్టీ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అయ్యాడు. యూపీలోని యోగీ ఆదిత్యనాథ్ సర్కార్ మసీదుల్లో జాతీయగీతం జనగణమనను తప్పనిసరి చేసింది. గురువారం నుంచే యూపీలోని అన్ని మసీదుల్లో జాతీయగీతాన్ని ఆలపించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు జ్ఞానవాపి మసీదు సర్వేకు అనుకూలంగా వారణాసి కోర్ట్ ఇచ్చిన తీర్పుపై అసదుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యోగీ ఆదిత్యనాథ్, బీజేపీ నాకు దేశభక్తి సర్టిఫికేట్ […]
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2వ గ్లోబర్ కోవిడ్ సమ్మిట్ లో ప్రసంగించారు. కోవిడ్ నివారణకు భారత్ తీసుకుంటున్న చర్యలను, వ్యాక్సినేషన్ గురించి మాట్లాడారు. ముఖ్యంగా సాంప్రదాయ వైద్యానికి ప్రాధాన్యత ఇస్తామని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. బారతదేశ జెనోమిక్స్ కన్సార్టియం ప్రపంచ వైరస్ డేటా బేస్ కు ఉపయోగపడిందని ఆయన అన్నారు. ఈ నెట్ వర్క్ ను పొరుగు దేశాలకు కూడా విస్తరిస్తామని వెల్లడించారు. కోవిడ్ పై మా పోరాటానికి, రోగనిరోధక శక్తి పెంచుకునేందుకు సాంప్రదాయ జౌషధాలు […]
వరస పరాజయాలతో ఢీలా పడ్డ కాంగ్రెస్ మళ్లీ గత వైభవాన్ని తిరిగి సంపాదించుకోవాలని అనుకుంటోంది. అందుకు ఉదయ్ పూర్ లో జరిగే ‘ శింతన్ శిబిర్’ వేదిగా మారబోతున్న సంకేతాలు ఇస్తోంది. శుక్రవారం నుంచి రాజస్థాన్ ఉదయ్ పూర్ లో మూడు రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ శింతన్ శిబిర్ పేరుతో పెద్ద ఎత్తున సమావేశాలను నిర్వహిస్తోంది. ఈ కాంగ్రెస్ పార్టీ సమావేశానికి దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి కీలక నేతలు రాజస్థాన్ […]
శ్రీలంక కొత్త ప్రధానిగా రణిల్ విక్రమసింఘే బాధ్యతలు చేపట్టారు. అధ్యక్షుడు గోటబయ రాజపక్సే రణిల్ విక్రమసింఘే చేత ప్రమాణ స్వీకారం చేయించి బాధ్యతలు అప్పగించారు. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంకను విషమ పరిస్థితుల నుంచి బయటపడేసే బాధ్యత ప్రస్తుతం రణిల్ విక్రమసింఘేపై ఉంది. ఇటీవల శ్రీలంకలో నిరసనలు తీవ్రమై హింసాత్మకంగా మారాయి. దీంతో ప్రధాని పదవిలో ఉన్న మహిందా రాజపక్సే తన పదవికి రాజీనామా చేశారు. దీంతో కొత్త ప్రధాని ఏర్పాటు అనివార్యమైంది. బుధవారం దేశప్రజలను […]
జమ్మూ కాశ్మీర్ లో దారుణం చోటు చేసుకుంది. ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బుద్గాం జిల్లాలో గురువారం కాశ్మీర్ పండిట్ ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. చదూరా ప్రాంతంలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్న రాహుల్ భట్ పై కార్యాలయంలోనే దాడి చేసి హతమార్చారు. ఉగ్రవాదులు చాదూరా పట్టణంలోని తహసీల్ కార్యాలయంలోకి ప్రవేశించి అక్కడ క్లర్క్ గా పనిచేస్తున్న రాహుల్ భట్ పై కాల్పులు జరిపారు. ఘటన అనంతరం రాహుల్ భట్ ను శ్రీనగర్ లోని శ్రీ మహారాజా హరిసింగ్ […]
భారత రక్షణ వ్యవస్థ మరింత పటిష్టం అయ్యేందుకు ఇటీవల డీఆర్డీఓ, సైన్యం వరసగా క్షిపణి ప్రయోగాలు చేస్తున్నాయి. ఇటీవల నిర్వహించిన బ్రహ్మోస్, పినాక వంటి క్షిపణులు అనుకున్నట్లుగానే లక్ష్యాలను ఛేదించాయి. తాజాగా మరోసారి భారత రక్షణ వ్యవస్థకు కీలక విజయం లభించింది. ‘బ్రహ్మోస్’ ఎయిర్ లాంచ్ క్షిపణి ఎక్స్ టెండెడ్ రేంజ్ వర్షెన్ ను భారత్ విజయవంతంగా పరీక్షించింది. సుఖోయ్ ఎస్యూ -30 ఎంకేఐ యుద్ధ విమానం నుంచి బ్రహ్మోస్ క్షిపణిని లాంచ్ చేయగా… బంగాళాఖాతంలోని లక్ష్యాన్ని […]
ఉత్తర్ ప్రదేశ్ లోని యోగీ ఆదిత్యనాథ్ సర్కార్ మదర్సాల్లో జాతీయగీతం ‘ జన గణ మన’ను తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని గురువారం నుంచి యూపీలోని అన్ని మదర్సాల్లో అమలు చేస్తోంది. అయితే ఉత్తర్ ప్రదేశ్ మదర్సా ఎడ్యుకేషన్ బోర్డ్ మార్చి 24న జరిగిన సమావేశంలో అన్ని మదర్సాల్లో జాతీయ గీతం తప్పనిసరిగా పాడాలని నిర్ణయం తీసుకుంది. తాజాగా ఈరోజు నుంచి అన్ని మదర్సాల్లో జాతీయ గీతాన్ని ఆలపించడం తప్పని సరి చేసింది. విద్యార్థులు […]
కర్ణాటక ప్రభుత్వం వివాదాస్పద మతమార్పిడి నిరోధక బిల్లుపై ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. మత మార్పిడి నిరోధక బిల్లుపై ఈ రోజు సీఎం బస్వరాజ్ బొమ్మై కేబినెట్ సమావేశం అయ్యింది. ఈ బిల్లుపై ఆర్డినెన్స్ తెస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ, మండలి ప్రొరోగ్ కావడంతో బొమ్మై సర్కార్ ఈ ఆర్డినెన్స్ నిర్ణయం తీసుకుంది. కర్ణాటక మత స్వేచ్ఛ హక్కు బిల్లును 2021 డిసెంబర్ లో కర్ణాటక శాసనసభ ఆమోదించింది. ప్రభుత్వంలో బీజేపీ ఉండటంతో పాటు మెజారిటీ ఎమ్మెల్యేలు ఉండటంతో […]
తీవ్ర ఆర్థిక సంక్షోభంతో శ్రీలంక తీవ్ర ఇబ్బందులను ఎదర్కొంటోంది. ఇన్నాళ్లు శాంతియుతంగా సాగిన నిరసన, ఆందోళన కార్యక్రమాలు ఒక్కసారిగా హింసాత్మకంగా మారాయి. ప్రజలు అధ్యక్షడు గోటబయ రాజపక్సేతో పాటు ప్రధాని పదవిలో ఉన్న మహిందా రాజపక్సేలపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ప్రధాని పదవికి రాజీనామా చేశారు మహిందా రాజపక్సే. భద్రతా కారణాల వల్ల ఆర్మీ ఆయన్ను సేఫ్ ప్లేస్ కు తరలించింది. తాజాగా దేశం విడిచి వెళ్లకుండా శ్రీలంక కోర్ట్ నిషేధం విధించింది. […]
శ్రీలంక దేశం రావణకాష్టంగా మారింది. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో ద్వీప దేశం అల్లాడుతోంది. తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. నిత్యావసరాల ధరలు ఘోరంగా పెరిగాయి. దీంతో ప్రజల్లో అసహనం కట్టలు తెంచుకుంది. దీంతో గత కొన్ని నెలలుగా ఆ దేశంలో ప్రజలు రోడ్డెక్కి నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. అయితే తాజాగా ఈ ఘటనలు హింసాత్మకంగా మారాయి. పలువురు మరణించడంతో పాటు 200 మందికి పైగా ప్రజలు గాయపడ్డారు. పరిస్థితి చేయిదాటిపోతున్న తరుణంలో ప్రధాని […]