Venu Goapl Reddy
Author- NTV Telugu-
Karnataka: హిందూ-ముస్లిం జంటపై భజరంగ్ దళ్ కార్యకర్త దాడి.
Bajrang Dal men heckle inter-faith couple: కర్ణాటకలో ఇటీవల కాలంలో మతపరంగా సున్నిత అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఆ రాష్ట్రంలో ‘హిజాబ్’ వివాదం, హలాల్ వివాదాలు గతంలో జరిగాయి. తాజాగా బస్సులో ప్రయాణిస్తున్న మతాంతర జంటపై హిందూ సంస్థ భజరంగ్ దళ్ దాడి చేసింది. హిందు యువతి, ముస్లిం యువకుడు ఇద్దరు వివాహం చేసుకున్నారు. అయితే వీరిద్దరు దక్షిణ కన్నడ జిల్లాలో ఓ బస్సులో ప్రయాణిస్తున్న క్రమంలో భజరంగ్ దళ్ కార్యకర్తలు ఈ జంటపై దాడి చేశారు. -
PM Narendra Modi: ప్రధాని మోదీకి పుతిన్ ఫోన్.. యుద్ధంపై సంభాషణ
PM Modi, Russian President Vladimir Putin speak on phone: భారత్, రష్యా మధ్య కీలక పరిణామం చోటు చేసుకుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు. ఇరు నేతలు రెండు దేశాల దౌత్య సంబంధాలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై సంభాషించినట్లు పీఎంఓ తెలిపింది. ఉక్రెయిన్ తో యుద్ధంలో దౌత్యమే ఏకైక మార్గమని ప్రధాని మోదీ పుతిన్ కు పునరుద్ఘాటించారని వెల్లడించింది. పుతిన్, మోదీతో మాట్లాడినట్లు క్రెమ్లిన్ వర్గాలు కూడా ధృవీకరించాయి. -
Jamia Masjid: స్త్రీ-పురుషులు కలిసి కూర్చోవడం, ఫోటోగ్రఫీపై జామియా మసీద్ నిషేధం
Photography, Men And Women Sitting Together Banned In Jamia Masjid Srinagar: ప్రసిద్ద శ్రీనగర్ జామియా మసీదు నిర్వాహకులు కీలక ఉత్తర్వులు జారీ చేశారు. మసీదులో ఫోటోగ్రఫీతో పాటు స్త్రీ-పురుషులు కలిసి కూర్చోవడంపై నిషేధం విధించింది. దీనిపై నోటిఫికేషన్ జారీ చేసింది. అంజుమన్ ఆక్వాఫ్ సెంట్రల్ జామియా మీసీదు పేరుతో ఈ ఆదేశాలు జారీ చేసింది. స్త్రీ-పురుషులు మసీదు బయట లాన్ లో పచ్చిక బయళ్లలో కూర్చోవడాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఫోటోగ్రాఫర్లు, కెమెరా పర్సన్లు మసీదు లోపల ఎలాంటి ఫోటోలు తీయకూడదని… -
Pathaan: హిందుత్వాన్ని అవమానిస్తే సినిమాను అడ్డుకుంటాం.. “పఠాన్” మూవీకి బీజేపీ లీడర్ వార్నింగ్
BJP leader warning on Pathaan movie: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కొత్త సినిమా ‘పఠాన్’ వివాదాస్పదం అవుతోంది. సినిమాలోని ‘బేషరమ్ రంగ్’ సాంగ్ మొదత్తం రచ్చకు కారణం అయింది. సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న దీపికా పదుకొణె ఈ పాటలో కాషాయం రంగులో ఉన్న బికినీ ధరించడం ప్రస్తుతం మొత్తం వివాదానికి కారణం అయింది. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా పాట ఉందని బీజేపీతో సహా పలు హిందూ గ్రూపులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. -
S Jaishankar: పెరట్లో పాములు పెంచితే పొరుగువారినే కాదు.. వారిని కూడా కాటేస్తాయి..
Pakistan as the "epicentre" of terrorism says jai shankar: ప్రపంచం ముందు భారతదేశాన్ని దోషిగా నిలబెట్టాలని దాయాది దేశం పాకిస్తాన్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే భారత విదేశాంగ శాక మంత్రి ఎస్ జైశంకర్ మాత్రం ఎప్పటికప్పుడు పాకిస్తాన్ ప్రయత్నాలను తిప్పికొడుతున్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశాలకు హాజరైన జైశంకర్ ఉగ్రవాదం గురించి మాట్లాడుతూ.. పాకిస్తాన్ తీరును ఎండగట్టారు. ఇటీవల పాకిస్తాన్ విదేశాంగ సహాయమంత్రి హీనారబ్బానీ ఖర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. ‘‘ ఉగ్రవాదాన్ని భారత్ కన్నా మెరుగ్గా ఏ దేశం… -
Karnataka: స్కూల్ హెడ్మాస్టర్ని చితక్కొట్టిన అమ్మాయిలు..
Karnataka Headmaster Brutally Thrashed By Schoolgirls For Harassing Minor: విద్యార్థులతో దురుసుగా ప్రవర్తిస్తున్న ఓ స్కూల్ ప్రధానోపాధ్యాయుడికి బుద్ధి చెప్పారు విద్యార్థినులు. కర్ణాటకలోని శ్రీరంగపట్నంలోని కట్టేరి గ్రామంలో చోటు చేసుకుంది. స్కూల్ హెడ్ మాస్టర్ గత కొంత కాలంగా మైనర్ విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. -
Shraddha Walkar: శ్రద్ధా వాకర్ హత్యలో కీలక పరిణామం.. డీఎన్ఏ ఫలితాలు చెప్తున్నది ఇదే..
DNA of Shraddha's father matches with bones recovered from Mehrauli forest: శ్రద్ధా వాకర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మోహ్రౌలి సమీపంలోని అటవీ ప్రాంతంలో పోలీసులకు దొరికన ఎముకలు శ్రద్ధా వాకర్వే అని తేలింది. పలు ప్రాంతాల్లో పోలీసులు స్వాధీనం చేసుకున్న ఎముకలను సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి విశ్లేషణకు పంపారు. తాజాగా శ్రద్ధా తండ్రి వికాస్ వాకర్ డీఎన్ఏతో ఎముకల డీఎన్ఏ మ్యాచ్ అయింది. -
Delhi Acid Attack: ఫ్లిప్‌కార్ట్‌లో యాసిడ్ కొన్న నిందితుడు.. అమెజాన్, ఫ్లిప్‌కార్టుకి DCW నోటీసులు
Delhi Acid Attack: ఢిల్లీ ద్వారకా ప్రాంతంలో 17 ఏళ్ల అమ్మాయిపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు నిందితుడు. బుధవారం ఉదయం రోడ్డుపై చెల్లితో నడుచుకుంటూ వెళ్తున్న అమ్మాయిపై ఇద్దరు నిందితులు బైక్ పై వచ్చి ముఖంపై యాసిడ్ తో దాడి చేశారు. ఈ కేసులో బాధితురాలుకు తెలిసిన ఇద్దరు వ్యక్తులే ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. బాధితురాలు ఇచ్చిన వివరాలతో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో నిందితుడు సంచలన విషయాలు వెల్లడించాడు. దాడికి ఉపయోగించిన యాసిడ్ ను ఫ్లిప్‌కార్ట్ నుంచి కొనుగోలు… -
Live In Relation: కేరళ శ్రద్ధా వాకర్‌గా సింధు.. యువతిని నరికి చంపిన లవర్
Woman hacked to death in public by partner in Kerala: లివ్ ఇన్ రిలేషన్ షిప్ మహిళల ప్రాణాలను తీస్తోంది. నమ్ముకున్నవారే నరికి చంపుతున్నారు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఇటీవల ఢిల్లీలో జరిగిన శ్రద్ధా వాకర్ ఉదంతమే. తాజాగా కేరళలో కూడా శ్రద్ధావాకర్ తరహాలోనే లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్న యువతిని ఆమె లవర్ అత్యంత దారుణంగా నరికి చంపాడు. ఈ ఘటన కేరళ రాజధాని తిరువనంతపురంలో జరిగింది. తిరువనంతపురం శివార్లలోని వజ్హయిల సమీపంలో ఈ ఘటన జరిగింది. -
Bollywood: చిచ్చు రాజేసిన కాంతారా, పుష్ప కామెంట్స్.. స్టార్ డైరెక్టర్ల మధ్య ట్వీట్ వార్
Tweet war between Anurag Kashyap and Vivek Agnihotri: ఇటీవల బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ఓ ఇంటర్వ్యూలో కాంతారా, పుష్ప సినిమాలు బాలీవుడ్ ను నాశనం చేస్తున్నాయని అన్నారు. ఈ వ్యాఖ్యలపై మాటల మంటలు చెలరేగుతున్నాయి. కాశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి, అనురాగ్ కశ్యప్ మధ్య ట్వీట్ వార్ కొనసాగుతోంది. అనురాగ్ కశ్యప్ ఇంటర్వ్యూ స్క్రీన్ షాట్స్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేసి..‘‘ బాలీవుడ్ వన్ అండ్ ఓన్లీ మిలార్డ్ అభిప్రాయాలతో నేను పూర్తిగా ఏకీభవించను.. మీరు అంగీకరిస్తారా..?’’…
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!