యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కన్నుమూశారు. ఈ విషయాన్ని యూఏఈ అధ్యక్ష వ్యవహారాల మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. షేక్ ఖలీఫా అబుదాబి పాలకుడిగా కూడా వ్యవహరిస్తున్నారు. షేక్ ఖలీఫా మరణం పట్ల ప్రపంచ దేశాలు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నాయి. భారత ప్రధాని మోదీ కూడా తన సంతాపాన్ని ప్రకటించారు. యూఏఈ రాజ్యాంగం ప్రకారం వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ ముక్తూమ్, […]
రష్యా- ఉక్రెయిన్ యుద్ధ పరిణామాల మధ్య రాజధాని కీవ్ లో మూతపడిన భారత రాయబార కార్యాలయం తిరిగి ప్రారంభం కానుంది. రష్యా దాడి తీవ్రమవుతున్న సమయంలో భారత రాయబార కార్యాలయాన్ని మార్చి 13 పోలాండ్ లోని వార్సాకు తరలించారు. తాజాగా మే 17 నుంచి కీవ్ లో ఎంబసీని తెరవనున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఉక్రెయిన్ నుంచి పనిచేసేందుకు వివిధ పాశ్చాత్య దేశాలు సమాయత్తం అవుతున్న వేళ భారత్ కూడా తన ఎంబసీని ఉక్రెయిన్ […]
జమ్మూలో ఘోర ప్రమాదం జరిగింది. కట్రా నుంచి జమ్మూకు వెల్లే బస్సులో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులు మృతి చెందారు. మరో 22 మంది గాయపడ్డారు. బస్సులో మంటలు చెలరేగిన వెంటనే ఇద్దరు ప్రయాణికులు సజీవ దహనం కాగా… మరో ఇద్దరిని ఆస్పత్రికి తరలించగా.. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మరణించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఇంజిన్ నుంచి మంటలు రావడంతోనే ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. మంటలు చెలరేగిన కొద్ది సమయంలోనే […]
కాశ్మీరీ పండిట్ రాహుల్ భట్ హత్యకు ప్రతీకారం తీర్చుకున్నాయి భద్రతా బలగాలు. గురువారం రాహుల్ భట్ ను తన కార్యాలయంలో కాల్చి చంపిన ఉగ్రవాదులను భద్రతా బలగాలు శుక్రవారం జరిగిని ఎన్ కౌంటర్ లో లేపేశాయి. ఒక రోజు వ్యవధిలోనే ఉగ్రవాదులను ట్రాక్ చేసి ఎన్ కౌంటర్ లో మట్టుబెట్టారు. గురువారం బుద్గాం జిల్లా చదూరా తాహసీల్ కార్యాలయంలో రాహుల్ భట్ క్లర్క్ గా పని చేస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరు టెర్రరిస్టులు కార్యాలయానికి వచ్చి రాహుల్ […]
ఉక్రెయిన్ – రష్యా యుద్ధ పరిణామాలు భారత్ నే కాదు ప్రపంచ దేశాలను కలవరపెడుతున్నాయి. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం వల్ల ఇప్పటికే భారత్ లో వంట నూనెల ధరలు విపరీతంగా పెరిగాయి. ఇదిలా ఉంటే మిడిల్ ఈస్ట్ కంట్రీ ఇరాన్ కు కూడా ఉక్రెయిన్ సెగ తగిలింది. ఆ దేశంలో పలు నిత్యావసరాల ధరలు 300 శాతం పెరిగాయి. ఇరాన్ ప్రభుత్వం గురువారం నాడు చికెన్, పాలు, గుడ్ల వంటి ప్రధాన నిత్యావసరాల ధరలను […]
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రపంచ కుబేరుల జాబితాలో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థ అధినేతగా ఉన్న మస్క్ ఇటీవల ట్విట్టర్ ను కూడా సొంతం చేసుకున్నాడు. ఇదిలా ఉంటే ట్విట్టర్ డీల్ ను కొంతకాలం నిలివేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నాడు మస్క్. ఫేక్ అకౌంట్లపై విచారణ ముగిసే దాకా ట్విట్టర్ డీల్ కు బ్రేక్ ఇవ్వాలని ఆయన భావిస్తున్నారు. దీంతో ప్రీ మార్కెట్ లో […]
మహారాష్ట్రలో ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్ధీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర ఔరంగాబాద్ లో జరిగిన సమావేశంలో తాజా రాజకీయాలపై విమర్శలు గుప్పించారు. ఇటీవల కాలంలో మహారాష్ట్రలో లౌడ్ స్పీకర్ల వివాదం చెలరేగుతోంది. మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన( ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే, శివసేన సర్కార్ కు అల్టిమేటం జారీ చేశారు. మసీదుల్లో లౌడ్ స్పీకర్లు తీయకుంటే… వాటి ముందే మేం హనుమాన్ చాలీసా పఠిస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. ఈ వివాదం […]
కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసి గత వైభవాన్ని తీసుకురావాలని ఆ పార్టీ యోచిస్తోంది. పార్టీలో సంస్కరణలకు వేదికగా ‘ శింతన్ శిబిర్’ నిలువనుంది. రాజస్తాన్ ఉదయ్ పూర్ వేదికగా నేటి నుంచి మూడు రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇటీవల ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ అధిష్టానంతో పలుమార్లు చర్చించారు. పార్టీలో తీసుకోవాల్సిన చర్యలు, పార్టీ బలోపేతానికి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలని సోనియాగాంధీ, రాహుల్ […]
జమ్మూ కాశ్మీర్ లో గురువారం ఉగ్రవాదులు పెట్రేగిపోయారు. ప్రభుత్వం ఉద్యోగి అయిన కాశ్మీరీ పండిట్ రాహుల్ భట్ ను కార్యాలయంలోనే హత్య చేశారు. బుద్గాంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చాదూరా పట్టణంలోని తహసీల్ కార్యాలయంలో అక్కడ క్లర్క్ గా పనిచేస్తున్న రాహుల్ భట్ ను దగ్గర నుంచి షూట్ చేశారు. ఉగ్రవాదాలు రాహుల్ భట్ ఎవరని ఆరా తీస్తూ… కాల్పులు జరిపారు. తాజాగా శుక్రవారం రాహుల్ భట్ అంత్యక్రియలు జరిగాయి. కాశ్మీర్ లోని పండిట్లు పెద్ద […]
కాంగ్రెస్ పార్టీ రాజస్తాన్ ఉదయ్ పూర్ వేదికగా ‘ చింతన్ శిబిర్’ నిర్వహిస్తోంది. నేటి నుంచి మూడు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఇప్పటికే దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని కాంగ్రెస్ కీలక నేతలు ఉదయ్ పూర్ తరలివెళ్లారు. వరస పరాజయాలతో ఢీలా పడిన కాంగ్రెస్ పార్టీ బలపడేందుకు చింతన్ శిబిర్ ఉపయోగపడుతుందని ఆ పార్టీ భావిస్తోంది. ఇప్పటికే ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో పాటు రాహుల్ […]