దేశవ్యాప్తంగా సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవరిస్తున్న స్వచ్ఛంద సంస్థలపై రైడ్స్ నిర్వహిస్తోంది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం నిబంధనలను ఉల్లంఘించి పలు స్వచ్ఛంద సంస్థలకు అనుమతులు ఇచ్చినందుకు సీబీఐ ఈ దాడులు నిర్వహిస్తోంది. ఎన్జీఓ సంస్థలు, వాటికి సంబంధించిన వ్యక్తులపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వేస్టిగేషన్ టీమ్ దాడులు చేస్తోంది. దేశ వ్యాప్తంగా 40 ప్రాంతాల్లో.. హైదరాబాద్, ఢిల్లీ, కోయంబత్తూర్, మైసూర్, రాజస్థాన్ ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది.
విదేశీ విరాళాల నియంత్రణ చట్టం(ఎఫ్సీఆర్ఏ) నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని, అక్రమంగా విదేశాల నుంచి డబ్బు, హవాలా చేస్తున్నారనే ఆరోపణలపై సీబీఐ రంగంలోకి దిగింది. ప్రస్తుతం ఐదుగురు అధికారులతో పాటు మొత్తం 10 మందిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రూ.2 కోట్ల హవాలా లావాదేవీలను బయటపెట్టింది. అదుపులోకి తీసుకున్న అధికారులను సీబీఐ ప్రశ్నిస్తోంది.
విదేశీ విరాళాల విషయంలో కొంత మంది అధికారులు చట్టవిరుద్ధంగా క్లియరెన్స్ ఇచ్చారని ఎన్జీవో ప్రతినిధులు, మధ్యవర్తులు, హోం శాఖ మంత్రిత్వ అధికారుల ప్రమేయం ఉందనే అనుమానాలు వస్తున్న నేపథ్యంలో సీబీఐ దాడులు చేస్తోంది. హోం మంత్రిత్వ శాఖ ఇచ్చిన ఆదేశాలతో రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు ఈ దాడులను నిర్వహిస్తోంది. ఇదిలా ఉంటే మనీలాండరింగ్ కోణం కూడా ఉందని సీబీఐ నిర్థారించింది. ఇటీవల ఈడీ, సీబీఐ సంస్థలు మనీలాండరింగ్, హవాలా పై వరసగా దాడులు చేస్తోంది. ఇటీవల ముంబైలో దావూద్ ఇబ్రహీం అనుచరుల ఇళ్లలో సోదాలు చేసింది. పలువురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించింది. గతంలో మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ను మనీ లాండరింగ్, అక్రమ లావాదేవీల విషయంలో ఈడీ అరెస్ట్ చేసి జైలుకు తరలించింది.