Swiggy: ఆ సేవలకు స్వస్తి పలకనున్న స్విగ్గీ… 5 నగరాల్లో నిలిపివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘స్విగ్గీ’ గురించి ప్రత్యేకం పరిచయం చేయాల్సిన పని లేదు. దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో ఫుడ్ డెలవరీలతో చాలా ఫేమస్ అయింది. ప్రస్తుతం మెట్రోసిటీల్లో బిజీ లైఫ్ కారణంగా హోటళ్లు వెళ్లి తినే అలవాటును తగ్గించుకుంటున్నారు. దీంతో స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలవరీ ప్లాట్ ఫారాలను ఆశ్రయిస్తున్నారు వినియోగదారులు. ఆర్డర్లు చేసిన తక్కువ సమయంలో నేరుగా ఫుడ్ ను ఇళ్లు తీసుకువస్తున్నారు. దీంతో స్విగ్గీ సంస్థకు ఆదాయం బాగానే వస్తోంది.
ఇదిలా ఉంటే స్విగ్గీ ఇన్నాళ్లుగా నిర్వహిస్తున్న ‘సూపర్ డైలీ’ కార్యక్రమాలను నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించింది. వినియోగదారులకు గ్రాసరీస్, పాలు, కిరాణా సామాగ్రి ఇతరత్రా నిత్యావసరాలను వినియోగదారులకు అందించేందుకు స్విగ్గీ సూపర్ డైలీని తీసుకువచ్చింది. ప్రస్తుతం దేశంలోని 5 మహానగరాల్లో ఈ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ జాబితాలో ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, పూణే, చెన్నై నగరాలు ఉన్నాయి.
Also Read
- CM Vijay: తమిళనాడు సీఎం విజయ్ పథకం.. ఒక్క పైసకే గ్రాము బంగారం.. పథకంలో షాకింగ్ ట్విస్ట్..
- H1N1: ఢిల్లీలో స్వైన్ ఫ్లూ టెన్షన్.. గతేడాదితో పోల్చితే 8 రెట్లు పెరిగిన కేసులు..
- Mu*rder: భార్య కోసం నరబలి.? వ్యక్తిని హత్య చేసి తలను పూజా గదిలో దాచిన హంతకుడు.!
- Vande Mataram Row: 150 ఏళ్ల చరిత్ర...వందేమాతరంపై కాంగ్రెస్ అభ్యంతరమేంటి?
అయితే బెంగళూర్ లో మాత్రం తమ సేవలను రెట్టింపు చేస్తామని స్విగ్గీ సహవ్యవస్థాపకుడు, స్విగ్గీ సూపర్ డైలీ సీఈఓ ఫణి కిషన్ అద్దెపల్లి తెలిపారు. ఇతర సంస్థల నుంచి వస్తున్న పోటీని తట్టుకునేందుకు స్విగ్గీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మే 12, 2022 నుంచి ఈ ఐదు నగరాల్లో స్విగ్గి సూపర్ డైలీ సేవలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం స్విగ్గీ తన పిక్ ఆప్ డ్రాప్ సేవలైన స్విగ్గీ జినీని కూడా చాలా నగరాల్లో తగ్గించుకుంది. దేశవ్యాప్తంగా ఫుడ్ డెలవరీ ఆర్డర్లకు వస్తున్న డిమాండ్ తో…డెలవరీ పార్ట్ నర్ల కొరత కారణంగా స్విగ్గీ తన అనుబంధసేవలను నిలిపివేస్తున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
Meerpet Aya Murder: రూ.10 వేల కోసం ఘోరం.. మీర్పేట్ ఆయా హత్యలో షాకింగ్ ట్విస్ట్.!
-
CM Chandrababu: అనకాపల్లి అభివృద్ధిపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. గూగుల్ డేటా సెంటర్, గోదావరి జలాలపై స్పష్టత..
-
Hema Slams Anasuya: ‘జై శ్రీరామ్’ ఒక పవిత్ర మంత్రం.. కర్మ ఎవరినీ వదిలిపెట్టదు… అనసూయ వ్యాఖ్యలపై హేమ ఫైర్
-
Volkswagen Tukan Pickup: వోక్స్వ్యాగన్ టుకాన్ పికప్ ఆవిష్కరణ.. రగ్డ్ డిజైన్, 1.5 TSI హైబ్రిడ్ ఇంజిన్
ట్రెండింగ్
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!