ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పోఖ్రాన్ అణు పరీక్షపై ట్వీట్ చేశారు. నేషనల్ టెక్నాలజీ డే సందర్భంగా పోఖ్రాన్ అణు పరీక్షలను గుర్తు చేశారు. 1998లో నిర్వహించిన పోఖ్రాన్ అణు పరీక్ష విజయవంతానికి కారణం అయిన శాస్త్రవేత్తలకు, వారి కృషికి థాంక్స్ చెప్పారు ప్రధాని మోదీ. శాస్త్రవేత్తల కృషి వల్లే 1998 అణు పరీక్షలు విజయవంతం అయ్యాయని ఆయన ట్వీట్ చేశారు. అప్పటి ప్రధాని అటల్ బీహారీ వాజ్ పేయి ధైర్యం చూపారంటూ.. అటల్ జీ నాయకత్వానికి […]
కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పండిత్ సుఖ్ రామ్(95) కన్నుమూశారు. బ్రెయిన్ స్ట్రోక్ తో బాధపడుతున్న సుక్ రామ్ న్యూఢిల్లీలో ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఈ రోజు కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు అనిల్ శర్మ తెలియజేశారు. మే 4న బ్రెయన్ స్ట్రోక్ కు గురయిన మాజీ కేంద్రమంత్రి ఆరోగ్య క్షీణిస్తూ వచ్చింది. గత శనివారం ఢిల్లీలోని ఎయిమ్స్ హస్పిటల్ లో చేర్చారు కుటుంబ సభ్యులు. చికిత్స […]
అక్రమ రవాణాకు ఎయిర్ పోర్టులు , సీ పోర్టులు వేదికలు అవతున్నాయి. ఇటీవల కాలంలో దేశంలోని పలు విమానాశ్రాయాల్లో డ్రగ్స్, బంగారం పట్టుబడుతున్నాయి. విదేశాల నుంచి దేశానికి అక్రమంగా వీటిని రవాణా చేస్తున్న సమయంలో అధికారులు పట్టుకుంటున్నారు. దీనికి తోడు సముద్రమార్గాల ద్వారా అక్రమార్కులు డ్రగ్స్ ను దేశంలోకి తీసుకువస్తున్నారు. తాజా దేశంలో బంగారం, డ్రగ్స్ రవాణా చేస్తున్న వారిని పట్టుకున్నారు. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి బంగారం పట్టుబడగా… తమిళనాడు కోయంబత్తూర్ ఎయిర్ పోర్టులో భారీ […]
దేశవ్యాప్తంగా లౌడ్ స్పీకర్ల వివాదం చర్చనీయాంశంగా మారింది. దీనిపై రాజకీయంగా రచ్చ జరుగుతోంది. మసీదుల్లో, ఇతర ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లపై నిషేధం విధించాలని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే మహారాష్ట్ర సర్కార్ కు అల్టిమేటం జారీ చేశారు. ప్రస్తుతం ఈ వివాదం యూపీ, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా రాజకీయంగా చర్చనీయాంశం అయింది. తాజాగా లౌడ్ స్పీకర్ల వినియోగంపై కర్ణాటక సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 […]
తీవ్ర ఆర్థిక, ఆహారం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో పరిస్థితులు రోజురోజుకు విషమిస్తున్నాయి. ఆందోళనకారుల నిరసనలు హింసాత్మకంగా మారాయి. శ్రీలంకలో నిన్నటి నుంచి జరుగుతున్న హింసాత్మక ఘటనల్లో ఇప్పటి వరకు 7 మంది మరణించారు. 11 మంది పరిస్థితి విషమంగా ఉంది. 260 మందికి తీవ్రగాయాలు కాగా… ఐసీయూలో 60 మంది చికిత్స పొందుతున్నారు. గాయపడ్డ వారిలో ముగ్గురు టూరిస్టులు కూడా ఉన్నారు. ఇప్పటికే మహిందా రాజపక్సే తన ప్రధానికి రాజీనామా చేశారు. భద్రతా కారణాల వల్ల మహిందా […]
‘అసని’ తీవ్ర తుఫాన్ తీరం వైపు దూసుకొస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ క్రమంగా తీరాన్ని సమీపిస్తోంది. కాకినాడ తీరం వద్ద తుఫాన్ తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. యానాం-కాకినాడ తీరాన్ని తాకిన తర్వాత మళ్లీ తుఫాన్ సముద్రంలోకి వెళ్లనుంది అసని తుఫాన్. దీంతో ఏపీలో రెడ్ అలెర్ట్ జారీ చేసింది ఐఎండీ. ప్రస్తుతం కాకినాడకు 180 కిలోమీటర్ల దూరంలో ఉంది. ముందుగా అసని తుఫాన్ గమనాన్ని బట్టి ముందుగా అది ఏపీ తీరాన్ని […]
ప్రపంచం కరోనా వల్ల గత రెండేళ్ల నుంచి ప్రపంచం కరోనా బారిన పడి ఇబ్బందులు పడుతోంది. వరసగా కరోనా కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. కరోనా ధాటికి ప్రపంచ దేశాల ఆరోగ్య వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ఇదిలా ఉంటే కొత్తకొత్త వైరస్ జాడలు, వ్యాధులు ప్రపంచంలో ఎక్కడో చోట బయటపడుతూనే ఉన్నాయి. కరోనాకు ముందు జీకా, స్వైన్ ఫ్లూ, నిఫా ఇలా ఏదో రకమైన వైరస్ లు ప్రజలపై దాడులు చేస్తూనే ఉన్నాయి. ఈ వ్యాధులు ఎక్కడో […]
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో సంబంధాలు ఉండీ అనుచరులుగా చలామణీ అవుతున్న వ్యక్తుల ఇళ్లలో నేషనల్ ఇన్వేస్టిగేషన్ ఎజెన్సీ (ఎన్ఐఏ) సోదాలు నిర్వహిస్తోంది. నిన్న ముంబై వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. మొత్తంగా 29 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ముంబైలోని నాగ్ పాడ, గోరేగావ్, బోరివళి, శాంటాక్రూజ్, ముంబ్రాలోని పలువురు దావూద్ ఇబ్రహీం అనుచరుల ఇళ్లలో సోదాలు చేశారు. హవాలా ఆపరేటర్స్, రియల్ ఎస్టేట్, డ్రగ్ ట్రాఫికర్స్ నేరాలకు పాల్పడుతూ… దావూద్ […]
ఢిల్లీలో మరోసారి టెన్షన్ నెలకొంది. మరోసారి నార్త్, సౌత్ ఢిల్లీ మున్సిపాలిటీల అధికారులు ఆక్రమణలపై ఉక్కుపాదం మోపారు. బుల్డోజర్లతో ఆక్రమణలను తొలగిస్తున్నారు. నిన్న ఢిల్లీలోని షాహీన్ బాగ్ లో కూల్చివేతలు ఉద్రిక్తతలకు దారి తీసింది. పెద్ద ఎత్తున స్థానికులు, ప్రజాప్రతినిధులు యాంటీ ఎన్ క్రోచ్మెంట్ డ్రైవ్ కు వ్యతిరేఖంగా ఆందోళనలు చేశారు. షాహీన్ బాగ్ లో ఆక్రమణల కూల్చివేతపై సీపీఐ సుప్రీం కోర్ట్ లో పిల్ దాఖలు చేసింది. అయితే ఈ పిల్ పై సుప్రీం ఆగ్రహం […]
బంగాళాఖాతంలో అసని తుఫాన్ అలజడి రేపుతోంది. తీరం వైపు పయణిస్తోంది. తీరం వైపు గంటలకు 6 కిలోమీటర్ల వేగంతో పయణిస్తోందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం తుఫాన్ కాకినాడకు 330 కిలోమీటర్ల దూరంలో, విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 350 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ కేంద్రీకృతమై ఉంది. అసని తుఫాన్ కారణంగా విశాఖలో వాతావరణం మారిపోయింది. సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా ఉంది. తీరం వెంబడి గంటకు 60-80 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. ఇప్పటికే విశాఖ వ్యాప్తంగా […]