PM Modi: గత 8 ఏళ్లుగా ప్రపంచం అనేక అస్థిరతను చూసిందని, మానవత్వం సవాళ్లను చూసిందని, కానీ భారత్ రస్యా సంబంధాలు స్థిరంగా ఉన్నాయని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. భారత్, రష్యా సంయుక్త మీడియా సమావేశంలో మోడీ, పుతిన్ నాయకత్వంపై ప్రశంసలు కురిపించారు. రెండు దేశాల సంబంధాలకు కృషి చేస్తున్న స్నేహితుడు పుతిన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. గత 8 దశాబ్ధాలుగా భారత్-రష్యా స్నేహం ధ్రువ నక్షత్రంలా స్థిరంగా ఉందని ప్రధాని మోడీ కొనియాడారు. రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు అనేక చారిత్రాత్మక మైలురాళ్లు దాటుతున్న సమయంలో పుతిన్ భారత పర్యటనకు వచ్చారని మోడీ అన్నారు.
ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ‘‘15 ఏళ్ల క్రితం 2010లో భారత దేశానికి ప్రత్యే ప్రివిలేజ్డ్ స్టాటజిక్ పార్ట్‌నర్ షిఫ్ హోదా లభించింది. గత రెండున్నర దశాబ్దాలుగా పుతిన్ నాయతక్వం, దార్శనికతతో ఈ సంబంధాలు పెరిగాయి. ఆయన నాయకత్వం, అన్ని పరిస్థితుల్లోనూ మా సంబంధాలను కొత్త శిఖరాలకు చేర్చింది. భారతదేశం పట్ల ఈ లోతైన స్నేహం, అచంచలమైన నిబద్ధతకు నా స్నేహితుడు, అధ్యక్షుడు పుతిన్‌కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.’’ అని అన్నారు.
Read Also: Virtual Reception: ఇండిగో విమానం రద్ధు.. ఆన్ లైన్ లో రిసెప్షన్
ఓడల నిర్మాణంలో ఇరు దేశాల సహకారం మేక్ ఇన్ ఇండియాను బలోపేతం చేస్తుందని, ఇది మా విన్-విన్ సహకారానికి మరో ఉదాహరణ అని మోడీ అన్నారు. దీని ద్వారా ఉద్యోగాలు, నైపుణ్యాలు, ప్రాంతీయ కనెక్టివిటీ పెరుగుతుందని చెప్పారు. భారత్-రష్యా భాగస్వామ్యానికి ఇంధన భద్రత బలమైన మూలస్తంభంగా ఉందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా సురక్షితమైన, వైవిధ్యభరితమైన సప్లై చైన్ నిర్ధారించడంలో కీలకమైన ఖనిజాలలో రెండు దేశాల సహకారం చాలా ముఖ్యమైందని అన్నారు.
ఆర్థిక సహకారాన్ని పెంచడానికి, రెండు దేశాలు విజన్ 2030 డాక్యుమెంట్‌పై సంతకాలు చేసినట్లు వెల్లడించారు. త్వరలోనే యూరేషియన్ ఎకనామిక్ యూనియన్‌తో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఉక్రెయిన్ సమస్యపై భారత్ శాంతిని సమర్థించిందని, భారత్ ఎల్లప్పుడూ తన పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. ఉగ్రవాదంపై కలిసికట్టుగా పోరాడాలని ప్రధాని మోడీ అన్నారు.