ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రపంచ కుబేరుల జాబితాలో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థ అధినేతగా ఉన్న మస్క్ ఇటీవల ట్విట్టర్ ను కూడా సొంతం చేసుకున్నాడు. ఇదిలా ఉంటే ట్విట్టర్ డీల్ ను కొంతకాలం నిలివేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నాడు మస్క్. ఫేక్ అకౌంట్లపై విచారణ ముగిసే దాకా ట్విట్టర్ డీల్ కు బ్రేక్ ఇవ్వాలని ఆయన భావిస్తున్నారు. దీంతో ప్రీ మార్కెట్ లో ట్విట్టర్ షేర్లు 20 శాతం పడిపోయాయి.
ఇటీవల 44 బిలియన్ డాలర్ల వెచ్చించి ట్విట్టర్ ను కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఎలాన్ మస్క్ నిధుల సమీకరణలో ఉన్నారు. ట్విట్టర్ మస్క్ చేతికి వెళ్లిపోతున్న క్రమంలో తాత్కాలికంగా డీల్ కు బ్రేక్ పడింది. ప్రస్తుతం ట్విట్టర్ మొత్తం ఖాతాల్లో 5 శాతం వరకు ఫేక్ అకౌంట్లు ఉన్నాయని తెలుస్తోంది.
టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థలతో ప్రపంచంలోనే బిలియనీర్ల జాబితాలో మొదటిస్థానంలో ఉన్నారు ఎలాన్ మస్క్. ఎలక్ట్రిక్ కార్ల తయారీలో టెస్లా ప్రపంచ దిగ్గజంగా ఉంది. టెస్లా ఎలక్ట్రిక్ కార్లు వరల్డ్ వైడ్ గా సూపర్ గా క్లిక్ అయ్యాయి. దీంతో పాటు స్పెస్ ఎక్స్ తో అంతరిక్ష రంగంలోకి అడుగుపెట్టారు మస్క్. అంతరిక్షంలోకి భారీగా పేలోడ్ తీసుకువెళ్లేలా ఫాల్కన్, ఫాల్కన్ హెవీ రాకెట్లతో హిస్టరీ క్రియేట్ చేశారు. పూర్తి రియూజబుల్ రాకెట్ బూస్టర్లను తయారు చేశారు. దీంతో పాటు ఐఎస్ఎస్ నుంచి వ్యోమగాములు తిరిగిరావడానికి డ్రాగన్ క్రూ అనే స్పెస్ క్రాఫ్ట్ ను విజయవంతంగా ప్రయోగించారు. భవిష్యత్తులో మార్క్ యాత్రకు అవసమయ్యే విధంగా స్టార్ షిప్ ను తయారు చేస్తున్నారు.