మధ్యప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. వేటగాళ్ల కాల్పుల్లో ముగ్గురు పోలీసులు మరణించిన విషాదకర సంఘటన చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ గుణ జిల్లాలోని సాగా బర్ఖెగా గ్రామంలో అటవీ ప్రాంతంలో ఘటన జరిగింది. శుక్రవారం రాత్రి కృష్ణజింకలను వేటాడుతున్నారనే పక్కా సమాచారంతో వేటగాళ్లను పట్టుకునేందుకు వెళ్లారు. ఈ సమయంలో వేటగాళ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సబ్ ఇన్ స్పక్టర్ రాజ్ కుమార్ జాతవ్, హెడ్ కానిస్టెబుల్ సంత్ రామ్ మీనా, కానిస్టేబుల్ నీరజ్ భార్గవ మరణించారు. […]
ఆర్థిక సంక్షోభంతో శ్రీలంక అల్లాడిపోతోంది. ప్రజలు నిరసనలు హింసాత్మకంగా మారుతున్నాయి. హింసాత్మక ఘటనల నేపథ్యంలో మహిందా రాజపక్సే తన ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. భద్రతా కారణాల కారణంగా ఆర్మీ ఆయన్ను రహస్య ప్రాంతానికి తరలించింది. ఇదిలా ఉంటే గురువారం కొత్త ప్రధానిగా రణిల్ విక్రమసింఘే పదవీ బాధ్యతలు చేపట్టారు. ఐదు సార్లు ప్రధానిగా చేసిన అనుభవం ఉండటంతో ఈ సంక్షోభం నుంచి శ్రీలంకను బయటపడేస్తారని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే మాజీ ప్రధాని మహిందా రాజపక్సేకు కోర్ట్ […]
కరోనా మహమ్మారి ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు. పేద, ధనవంతులు, అధికారం, హోదాలు అడ్డుకాదని నిరూపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే పలువురు ప్రముఖులకు కరోనా సోకింది. తాజాగా న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ కు కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ లో తెలిపింది. ప్రధానితో పాటు కుటుంబ సభ్యులు కూడా కరోనా బారిన పడ్డారు. ముందుగా ప్రధాని జెసిండాకు కాబోయే భర్త క్లార్క్ గేఫోర్డ్ కు కరోనా […]
దేశంలో ప్రస్తుతం జ్ఞానవాపి మసీదు వివాదంపై చర్చ జరుగుతోంది. వారణాసి కోర్ట్ దేశాలతో ఈ రోజు కోర్ట్ కమిషనర్ టీం జ్ఞానవాపి మసీదును వీడియోగ్రఫీ చేయనున్నారు. దీంతో వారణాసి వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. మసీదు పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. మసీదుకు చుట్టూ 500 మీటర్ల వరకు ఉన్న అన్ని దుకాణాలను మూసివేయబడ్డాయి. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పటిష్ట భద్రతా […]
చైనాలో పుట్టిన కరోనా ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు ఈ మహమ్మారి గుప్పిట చిక్కి చాలా నష్టపోయాయి. ఆరోగ్య పరంగా, ఆర్థికంగా పలు దేశాలు కుదేలయ్యాయి. ఇదిలా ఉంటే ఎప్పటికప్పుడు తన రూపాలను మార్చుకుంటూ వస్తోంది కరోనా. ఆల్ఫా, బీటా, డెల్టా, డెల్టా ప్లస్, ఒమిక్రాన్ ఇలా కొత్త వేరియంట్ల రూపంలో దాడి చేస్తూనే ఉంది. అమెరికా, యూరప్ వంటి డెవలప్ దేశాలు కూడా కరోనా ధాటికి విలవిల్లాడాయి. ఏకంగా అమెరికాలో కరోనా […]
ఆర్సీపీపై పంజాబ్ సూపర్ విక్టరీ నమోదు చేసింది. పంజాబ్ చేతిలో చిత్తుగా ఓడింది ఆర్సీబీ. ఏ దశలో కూడా పోటీ ఇవ్వలేక చతికిలపడింది. శుక్రవారం ముంబై బ్రెబౌర్న్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో పంజాబ్ బ్యాటర్లు రెచ్చిపోయి ఆడారు. నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ 210 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆర్సీబీ ముందు ఉంచింది. కాగా భారీ లక్ష్యంలో బరిలోకి దిగిన ఆర్సీబీ ఎక్కడా పోటీ ఇవ్వలేదు. ఒక్కరంటే ఒక్క ప్లేయర్ కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ […]
ఢిల్లీలో శుక్రవారం రాత్రి ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఢిల్లీ ముండ్కా ఫైర్ ఆక్సిడెంట్ లో ఇప్పటి వరకు 27 మరణించగా… 30 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోెంది. పశ్చిమ ఢిల్లీ ముడ్కా మెట్రోస్టేషన్ సమీపంలోని ఓ భవనంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో భారీగా ప్రాణ నష్టం సంభవించింది. నిన్న ఘటన జరిగిన వెంటనే 24 ఫైర్ ఇంజిన్ల ద్వరా మంటలు ఆర్పే ప్రయత్నం […]
భారత వ్యవసాయ రంగానికి గుడ్ న్యూస్ చెప్పింది భారత వాతావరణ శాఖ ( ఐఎండీ). భారత్ లో వర్షాలకు అత్యంత కీలకంగా భావించే నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది ముందుగానే రానున్నాయి. భారత వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు జీవనాధారంగా భావించే నైరుతి రుతుపవనాలు మే 27న కేరళను తాకనున్నట్లు ఐఎండీ వెల్లడించింది. ఈ ఏడాది దేశంలో ముందస్తు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కేరళలో సాధారణంగా జూన్ 1న రుతుపవనాలు ప్రారంభం అయినా.. మొదటి, […]
అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా… ఏదో విధంగా విదేశాాల నుంచి అక్రమ బంగారం దేశానికి చేరుతూనే ఉంది. అక్రమ బంగార రవాణాలకు ఎయిర్ పోర్టులు వేదిక అవుతున్నాయి. ఇటీవల కాలంలో ఇండియాలోని పలు విమానాశ్రయాల్లో వరసగా బంగారం పట్టుబడుతోంది. తాజాగా కర్ణాటక బెంగళూర్, తమిళనాడు చెన్నై, ట్రిచి ఎయిర్ పోర్టుల్లో అక్రమ బంగారం పట్టుబడింది. బెంగళూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారాన్ని పట్టుకున్నారు అధికారులు. దుబాయ్ నుంచి వస్తున్న ప్రయాణికుల వద్ద రూ. 1.44 కోట్ల విలువ […]
దేశ రాజధాని ఢిల్లీ వ్యాప్తంగా అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్. బుల్డోజర్లలో ఆక్రమణలను కూల్చివేస్తున్నారు. ఈ బుల్డోజర్ కూల్చివేతల వివాదం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కొన్ని ఢిల్లీలోని కొన్ని ఏరియాల్లో కూల్చివేతలకు వ్యతిరేఖంగా స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు తీవ్ర ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. అధికార ఆప్, కాంగ్రెస్, వామపక్షాల నాయకులు ఎంతగా వ్యతిరేఖించినా ఢిల్లీ మున్సిపల్ అధికారులు తగ్గడం లేదు. పోలీసులు, సీఆర్ఫీఎఫ్ భద్రత నడుమ ఆక్రమణలను కూల్చివేస్తున్నారు. ఇటీవల ఢిల్లీలోని […]