CM Chandrababu: వర్మ తీరుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసహనం..
- సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్..
- ప్రోటోకాల్ రగడపై మాజీ ఎమ్మెల్యేకు వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కుట్రలు, కుతంత్రాలు పక్కన పెట్టి పార్టీ బలోపేతం కోసం కృషి చేయాల్సిన సమయంలో, పిఠాపురంలో చోటుచేసుకున్న ప్రోటోకాల్ వివాదంపై తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో నేతల మధ్య సమన్వయం దెబ్బతింటే అది ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపుతుందని ఆయన స్పష్టం చేశారు.
చంద్రబాబు సీరియస్ వార్నింగ్..
Also Read
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
- Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
- YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
- Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ వ్యవహరించిన తీరుపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ప్రోటోకాల్ విషయంలో జరిగిన గొడవలు ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లడంతో.. ఆయన స్పందించారు. ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో మాట్లాడిన చంద్రబాబు, పార్టీ అంతర్గత క్రమశిక్షణపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు.
కూటమి ప్రభుత్వంలో నేతలంతా ఒకే తాటిపై ఉండాలని, చిన్న చిన్న ప్రోటోకాల్ విషయాల కోసం వీధి గొడవలకు దిగడం పార్టీ గౌరవాన్ని తగ్గిస్తుందని చంద్రబాబు హెచ్చరించారు. సీనియర్ నేతగా ఉన్న వర్మ ఇలాంటి వివాదాలకు కారణం కావడం సరికాదని, ఏదైనా పొరపాటు జరిగితే పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావాలి తప్ప, ఘర్షణలకు దిగడం తగదని చంద్రబాబు క్లాస్ పీకారు. అగ్ర నాయకులు ఇలా ప్రవర్తిస్తే క్షేత్రస్థాయిలోని కార్యకర్తలకు తప్పుడు సందేశం వెళ్తుందని, ఇది భవిష్యత్తులో పార్టీకి నష్టం కలిగిస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్ర అధ్యక్షుడికి ఆదేశాలు..
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పల్లా శ్రీనివాస్‌కు సీఎం సూచించారు. వివాదాలను అంతర్గతంగా పరిష్కరించుకోవాలి తప్ప, మీడియాలో గానీ, బహిరంగంగా గానీ పార్టీ పరువు తీయవద్దని స్పష్టం చేశారు. పిఠాపురం లాంటి కీలక నియోజకవర్గంలో నేతలు సంయమనం పాటించాలని ఆయన ఆదేశించారు. ఈ పరిణామం ఇప్పుడు టీడీపీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!