Mexico: ప్రధాని మోదీ రష్యా- ఉక్రెయిన్ మధ్య శాంతిని నెలకొల్పగలరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi can bring peace between Russia and Ukraine: రష్యా, ఉక్రెయిన్ మధ్య శాశ్వత శాంతిని నెలకొల్పేందుకు భారత ప్రధాని నరేంద్రమోదీ మధ్యవర్తిత్వం వహించాలని కోరారు మెక్సికో విదేశాంగ మంత్రి మార్సెలో లూయిస్ ఎబ్రార్డ్ కాసౌబోన్. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న ఆయన రష్యా,ఉక్రెయిన్ మధ్య శాంతి నెలకొల్పేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
భారత ప్రధాని నరేంద్రమోదీ, పోప్ ప్రాన్సిస్, యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ లతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని లూయిస్ ఎబ్రార్డ్ యూఎన్ లో ప్రతిపాదించారు. ఉజ్బెకిస్తాన్‌లోని సమర్‌కండ్‌లో షాంఘై సహకార సంస్థ శికరాగ్ర సమావేశంలో భారత ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ఇది యుద్ధాల యుగం కాదని చెప్పిన తర్వాత.. మెక్సికో విదేశాంగ మంత్రి నుంచి ఈ ప్రకటన వచ్చింది. భారత ప్రధాని వ్యాఖ్యలను అమెరికా, కెనడా, ప్రాన్స్, యూకేతో పాటు వెస్ట్రన్ దేశాలు స్వాగతించాయి.
Also Read
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
- Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
- Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
Read Also: National Herald Case: తెలంగాణకు తాకిన నేషనల్ హెరాల్డ్ కేసు.. టీకాంగ్ నేతలకు నోటీసులు..
అంతర్జాతీయ సమాజం శాంతిని సాధించేందుకు ప్రయత్నించాలని మెక్సికో కోరుకుంటోందని లూయిస్ ఎబ్రార్డ్ అన్నారు. ఉద్రిక్తతలను తగ్గించేందుకు, శాంతిని కాపాడేందుకు కమిటీని ఏర్పాటు చేయాలనే మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యయోల్ లోపెజ్ ఒబ్రాడోర్ ప్రతిపాదనను మీతో పంచుకుంటున్నానని భద్రతా మండలిలో లూయిస్ ఎబ్రార్డ్ తెలియజేశారు. చర్చలు, దౌత్యమార్గాల్లో సమస్యను పరిష్కరించుకోవాలని ఇరు దేశాలను ఆయన కోరారు.
గురువారం జరిగిన యూఎస్ సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కూడా రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, పుతిన్ తో అన్న మాటలను మరోసారి గుర్తి చేశారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు, ప్రస్తుత ప్రపంచీకరణ పరిస్థితుల్లో ఇతర ప్రాంతాల్లో కూడా ప్రభావాన్ని చూపిస్తున్నాయని అన్నారు. భారత్ కూడా ఆహార కొరత, ఎరువులు కొరతకు సంబంధించి ఇబ్బందులను ఎదుర్కొంటోందని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
-
Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్‌ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
-
Rashmika Mandanna : మరోసారి పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి కాంబో ఆకట్టుకోబోతుందా..?
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!