టీఆర్ఎస్ పార్టీ నేతలు బీజేపీ, కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. కేంద్రం ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఎండగడుతున్నారు. ఇటీవల 10 లక్షల ఉద్యోగాలపై టీఆర్ఎస్ విమర్శలు గుప్పించింది. ఇది ఎన్నికల స్టంట్ గా అభివర్ణించింది. దీనిపై ప్రధాని మోదీని విమర్శిస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. అయితే 10 లక్షల ఉద్యోగాలను స్వాగతిస్తున్నాం అంటూనే గతంలో బీజేపీ పార్టీ ఇచ్చిన హామీలను విస్మరించిందని.. ప్రస్తుతం ఉద్యోగాల భర్తీని నమ్మలేమని వ్యాఖ్యానించారు. దీంతో పాటు దేశంలో ఆర్థిక పరిస్థితి, ద్రవ్యోల్భనం, […]
‘‘ మోదీ మస్ట్ రిజైన్’’ హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో ట్రెండ్ అవుతోంది. ఇటీవల శ్రీలంకలోని ఓ పవర్ ప్రాజెక్ట్ ను అదానికి కట్టబెట్టాలని శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సపై మోదీ ఒత్తడి తీసుకువచ్చారనే వార్తల నేపథ్యంలో ఈ హాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఈ ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు, నాయకులతో పాటు వేలాది మంది నెటిజెన్లు మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతం నుంచి ట్విట్టర్ […]
బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు జరుగుతూనే ఉన్నాయి. బీజేపీ పార్టీపై, కేంద్ర ప్రభుత్వం విధానాలపై టీఆర్ఎస్ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. తాజాగా మంత్రి కేటీఆర్ మరోసారి కేంద్రంపై ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఇటీవల కేంద్రం 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించింది. దీనిపై ట్విట్టర్ లో విమర్శలు గుప్పించారు కేటీఆర్. ప్రతపక్ష పార్టీలు, దేశంలోని నిరుద్యోగ యువత కేంద్రంపై భారీ ఒత్తిడి తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు కేటీఆర్. […]
ఏ మాత్రం అటూ ఇటూ అయిన రెండు విమానాలు ఆకాశంలోనే ఢీకొట్టేవి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తప్పుగా ఆదేశాలు ఇచ్చినా.. ఫైలెట్ల నైపుణ్యంతో ప్రపంచంలోనే అత్యంత దారుణమైన ప్రమాదం తప్పింది. ఈ ఘటన జూన్ 13న టర్కీ గగనతలంలో జరిగింది. లండన్ నుంచి కొలంబో వెళ్తున్న శ్రీలంక ఎయిర్ లైన్స్ ఫ్లైట్ యూఎల్ 504 ప్రయాణిస్తున్న సందర్భంలో బ్రిటిష్ ఎయిర్ వేస్ విమానం ప్రయాణిస్తోంది. ఈ రెండు విమానాలు కూడా 15 మైళ్ల దూరంతో ఉన్న సమయంలో […]
ప్రజలకు వ్యవస్థ పట్ల భాధ్యత లేనంత కాలం, కళ్ల ముందు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించలేనంత కాలం ఎన్ని సంస్కరణలు చేసినా ప్రయోజనం లేదని సుప్రీం కోర్ట్ విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అభిప్రాయపడ్డారు. దేశంలో పోలీస్ సంస్కరణలపై మాజీ డీజీపీ ప్రకాశ్ సింగ్ రాసిన ‘స్ట్రగుల్ ఫర్ పోలీస్ రాఫామ్స్’ పుస్తకంపై ఓయూ దూర విద్యా కేంద్రంలో చర్చా కార్యక్రమం జరిగింది. దీంట్లో జస్టిస్ చలమేశ్వర్ పాల్గొన్నారు. దేశంలో అనేక చట్టాలు ఉన్నప్పటికీ.. 40 ఏళ్లుగా […]
భారత్, ఇజ్రాయిల్, యూఎస్ఏ, యూఏఈ దేశాల కూటమి ఐ2యూ2 తొలి శిఖరాగ్ర సమావేశాలను యూఎస్ఏ నిర్వహించనుంది. ఈ భేటీ నాలుగు దేశాల అధ్యక్షులు పాల్గొననున్నారు. ఐ2యూ2 ఏర్పడిన తర్వాత జరగబోయే తొలి శిఖరాగ్ర సమావేశం ఇదే. ఇండియా, ఇజ్రాయిల్ దేశాల మొదటి అక్షరాలను కలిపి ఐ 2గా, యూఎస్ఏ, యూఏఈని కలిపి యూ 2 గా వ్యవహరిస్తారు. ఈ గ్రూప్ ను పశ్చిమాసియా క్వాడ్ గా కూడా అభివర్ణిస్తారు. భారత ప్రధాని నరేంద్రమోదీ, ఇజ్రాయిల్ ప్రధాని నఫ్తాలీ […]
నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో రాహుల్ గాంధీని మూడు రోజులుగా ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ( ఈడీ) విచారిస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలుపుతున్నాయి. ఢిల్లీలో ఈడీ ఆఫీస్ ముందే కాంగ్రెస్ అగ్రనేతలు నిరసన, ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా కూడా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన, ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. తాజాగా రాహుల్ గాంధీ ఈడీ విచారణపై తెలంగాణ కాంగ్రెస్ రాజ్ భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది. గురువారం […]
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హామీ ఇచ్చారు. బాసర ట్రిపుల్ ఐటీ ప్రతిష్టను దెబ్బతీయవద్దని ఆమె విద్యార్థులను కోరారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే వీసీకి సమాచారం అందించాలని తెలిపారు. రెండేళ్ల నుంచి యూనివర్సిటీ, స్కూళ్లు సరిగా నడవలేదని.. రెండేళ్ల నుంచి కరోనా వల్ల ఇబ్బందులు తలెత్తాయని..త్వరలోనే ట్రిపుల్ ఐటీలో సమస్యలన్నింటిని పరిష్కరిస్తామని అన్నారు. విద్యార్థులు పెట్టిన 12 డిమాండ్లు సిల్లీగా ఉన్నాయని..చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి అవన్నీ ప్రభుత్వం […]
ఎనిమిదేళ్ల కాలంలో కేంద్రంలో మోదీ నాయకత్వంలోని సంక్షేమ పథకాలు, అభివృద్ధి భేష్ అని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. మోదీ 8 ఏళ్ల పాలన గురించి మెదక్ లో జరిగిన సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 2014 కు ముందు కేసీఆర్ ఏం మాట్లాడాడు.. అధికారంలోకి వచ్చిన తరువాత ఏం చేస్తున్నాడో చెప్పాలి అని ప్రశ్నించాడు. కేసీఆర్ మాటలు, చేతలకు పొంతన ఉండదని అన్నారు. కష్టపడితే తెలంగాణలో అధికారం బీజేపీదే అని ఆయన అన్నారు. […]
దశాబ్ధం క్రితం పోలియో వైరస్ నుంచి దేశం నుంచి తరిమేశాం. దేశంలోని పోలియో పట్ల అవగాహన కల్పించడంతో విధిగా చిన్న పిల్లలకు చుక్కల మందు వేయిస్తున్నారు. దీంతో పోలియో సోకే వారి సంఖ్య క్రమంగా తగ్గింది. దీంతో పోలియో ఫ్రీ కంట్రీగా ఇండియా తయారైంది. 2011లో వెస్ట్ బెంగాల్ హౌరాకు చెందిన 12 ఏళ్ల బాలికకు చివరిసారిగా పోలియో సోకింది. భారత దేశం మార్చి 27, 2014న పోలియో రహిత దేశంగా గుర్తింపు పొందింది. ఇదిలా ఉంటే […]