Madhya Pradesh Government’s key decision to stop Love Jihad: మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హిందూ యువతులు లవ్ జీహాద్ కోరల్లో చిక్కుకుంటున్నారని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా కొంతమంది హిందూ మహిళల్ని ప్రేమ పేరుతో వంచిస్తున్నారని బీజేపీ, హిందూ సంస్థల నాయకులు ఆరోపిస్తున్నారు. దీంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం దసరా ఉత్సవాల్లో జరిగే గర్బా డ్యాన్స్ ఉత్సవాలకు వెళ్లేవారిపై నిఘా పెట్టాలని భావిస్తోంది.
గర్భా ఉత్సవాలు జరిగే ప్రాంతంలోకి అనుమతించే ముందు వ్యక్తుల ఐడీ కార్డులను తప్పుకుండా తనికీ చేయాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం గర్భా నిర్వాహకులను కోరింది. ఇలాంటి ఉత్సవాలు ‘‘లవ్ జీహాద్’’కి సాధనంగా మారుతాయని రాష్ట్రమంత్రి ఒకరు పేర్కొన్నారు. నవరాత్రి, దుర్గా మాత ఆరాధన పండగ, మా విశ్వాసానికి ప్రతీక, అటువంటి పవిత్ర సందర్భంలో శాంతి,సామరస్యాలు కాపాడే ప్రయత్నంలో భాగంగానే ఐడీ కార్డులను తనిఖీ చేసిన తర్వాతే గర్బా ఈవెంట్ లోకి ప్రవేశం కల్పించాలని నిర్వహాకులను కోరినట్లు రాష్ట్ర హోం శాఖ మంత్రి నరోత్తమ్ మిశ్రా మంగళవారం మీడియాతో అన్నారు.
Read Also: Minister KTR: హిందూ-ముస్లిం అనగానే ఆగం కావొద్దు
గుజరాత్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో దసరా సందర్భంగా మహిళలు గర్బా నృత్యప్రదర్శనలు నిర్వహిస్తుంటారు. సోమవారం నుంచి దసరా నవరాత్రి కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. ఇలాంటి ఉత్సవాల్లో అసహ్యకరమైన పరిస్థితి ఉండకూడదని అందుకే ప్రజల గుర్తింపు కార్డులను తనిఖీ చేయాలని అధేశించినట్లు హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా అన్నారు. అమ్మవారి ప్రార్థనలకు ప్రతీ ఒక్కరూ రావచ్చని అన్నాను.
నవరాత్రి ఉత్సవాల్లో రాష్ట్రంలో గర్బా డ్యాన్స్ ఈవెంట్స్ లో ‘ లవ్ జీహాద్’ను నిరోధించేందుకు గుర్తింపు కార్డులను తనిఖీ చేసిన తర్వాతే అనుమతించాలని సాంస్కృతిక శాఖ మంత్రి ఉషా ఠాకూర్ సెప్టెంబర్ 8న సూచించారు. గర్బాకు వచ్చే వారు తప్పుకుండా గుర్తింపు కార్డులు తీసుకురావాలని.. కార్డులు లేకపోతే అనుమతించకూడదని ఆమె అన్నారు. హిందూ బాలికలను, యువతులను మైనారిటీకి చెందిన వ్యక్తులు ప్రలోభపెట్టి బలవంతంగా వివాహం చేసుకుంటున్నారని.. ఇది లవ్ జీహాద్ లో భాగంగా జరుగుతోందని హిందూ మితవాద నాయకులు పేర్కొంటున్నారు.