Niharika Konidela: వరుణ్ – లావణ్యల ‘సీక్రెట్’ లవ్ స్టోరీ.. అసలు విషయం బయటపెట్టిన నిహారిక!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Niharika Konidela: టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠిల ప్రేమకథ ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. వీరిద్దరూ ఏడేళ్ల పాటు అత్యంత రహస్యంగా ప్రేమించుకున్నారనే విషయాన్ని వరుణ్ సోదరి, నటి నిహారిక కొణిదెల తాజాగా ఎన్టీవీ పాడ్‌కాస్ట్‌లో వెల్లడించారు. తన అన్నయ్య ప్రేమ వ్యవహారం తెలిసి తను కూడా షాక్ అయ్యానని ఆమె పేర్కొన్నారు.
నాలుగేళ్ల వరకు ఎవరికీ తెలీదు..
ఈ సందర్భంగా నిహారిక మాట్లాడుతూ.. “అన్నయ్య (వరుణ్), లావణ్య వదిన ఏడేళ్లుగా ప్రేమలో ఉన్నారు. కానీ వారి ప్రేమ నాలుగో సంవత్సరంలో ఉన్నప్పుడు నాకు తెలిసింది. నిజానికి అన్నయ్యకు ఇండస్ట్రీలో ఎక్కువ మంది స్నేహితులు లేరు. నాకు తెలిసిన అన్నకు నితిన్ అన్న ఒక్కడే ఫ్రెండ్ అనుకుంటా ఇండస్ట్రీ నుంచి. అలాంటిది అన్నయ్య బర్త్ డే పార్టీలో వదినను చూశాక నాకు అర్థమైంది. అప్పటి నుంచి నేను, లావణ్య వదిన మంచి స్నేహితులమయ్యాం. వదిన చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. మా కుటుంబంతో ఆమె పర్‌ఫెక్ట్‌గా సెట్ అయిపోయింది” అని నిహారిక వివరించారు.
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మొదటిసారి 2017లో వచ్చిన ‘మిస్టర్’ సినిమా కోసం కలిసి పనిచేశారు. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే వీరి మధ్య స్నేహం మొదలై, అది కాస్తా ప్రేమగా మారింది. అప్పటి నుంచి వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ మీడియాలో ఎన్ని వార్తలు వచ్చినా, మెగా ఫ్యామిలీ ఎప్పుడూ అధికారికంగా స్పందించలేదు. చివరకు 2023లో ఇటలీలోని టస్కనీలో వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. 2023లో పెళ్లి చేసుకున్న ఈ జంటకు, 2025లో ఒక మగబిడ్డ జన్మించాడు. ఆ బాబుకు ‘వాయువ్ తేజ్ కొణిదెల’ అని పేరు పెట్టారు. మెగా వారసుడి రాకతో అటు మెగా ఫ్యామిలీలో, ఇటు అభిమానుల్లో సందడి నెలకొంది.
అన్నయ్య లవ్ స్టోరీ ఇలా బయటపడింది..పార్టీలో వదినను చూసి షాక్ అయ్యాను #KonidelaNiharika #VarunTej #LavanyaTripathi #NTVENT #NTVTelugu pic.twitter.com/RSPp6We21K
— Ntv Telugu Entertainment (@NtvTeluguEnt) April 22, 2026
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!