PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు
- ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు
- మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు
- 24 గంటల్లోగా మల్లికార్జున్ ఖర్గే వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘం కోరింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ‘ఉగ్రవాది’ అని వ్యాఖ్యానించిన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేపై అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, కిరణ్ రిజిజు, అర్జున్ రామ్ మేఘ్వాల్, పలువురు ఇతర బీజేపీ నాయకులతో కూడిన ప్రతినిధి బృందం ఎన్నికల సంఘం పూర్తి ధర్మాసనానికి ఫిర్యాదు చేసింది. తన వ్యాఖ్యలకు బహిరంగంగా క్షమాపణ చెప్పేలా కాంగ్రెస్ అధ్యక్షుడిని ఆదేశించాలని బీజేపీ ఎన్నికల సంఘాన్ని కోరింది.
మోడీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలను భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) తీవ్రంగా పరిగణించింది. మోడీపై ‘ఉగ్రవాది’ వ్యాఖ్యలు చేసినందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు భారత ఎన్నికల సంఘం బుధవారం నోటీసులు జారీ చేసింది. ఈ వ్యాఖ్య ఎన్నికల నిబంధనల ఉల్లంఘన అయ్యే అవకాశం ఉందని పేర్కొంటూ, 24 గంటల్లోగా మల్లికార్జున్ ఖర్గే వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘం కోరింది.
Also Read
- Abhijeet Dipke: అభిజీత్ దీప్కే అరెస్ట్..? ‘చాయ్ తాగుదాం రండి’ అంటూ..
- FASTag నిబంధనల్లో కీలక మార్పులు.. వారికి గుడ్‌న్యూస్..
- Lal Bahadur Shastri Jayanti: నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం.. 'జై జవాన్ జై కిసాన్' రూపశిల్పి శాస్త్రి జీ..
- Sugar Stock Limit: షుగర్ వ్యాపారులకు షాక్.. నిల్వలపై కేంద్రం కొత్త నిబంధనలు
కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులు ఫిర్యాదు చేసిన కొన్ని గంటలకే, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలపై 24 గంటల్లోగా స్పందన తెలియజేయాలని కోరుతూ ఎన్నికల సంఘం ఆయనకు నోటీసు జారీ చేసింది. ఇటీవల చెన్నైలో జరిగిన విలేకరుల సమావేశంలో ఖర్గే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ‘ఉగ్రవాది’ అని అభివర్ణించారు. మోదీ ప్రజలను, రాజకీయ పార్టీలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఖర్గే తెలిపారు.
కమిషన్‌కు సమర్పించిన మెమోరాండంలో, ఖర్గే చేసిన వ్యాఖ్యలకు గాను భారత శిక్షా స్మృతి (ఐపీసీ)లోని వివిధ సెక్షన్ల కింద తగిన శిక్షాత్మక, నియంత్రణ చర్యలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఖర్గేను విమర్శిస్తూ, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ, కాంగ్రెస్ అధ్యక్షుడి వ్యాఖ్యలు అవమానకరమైనవి మాత్రమే కాకుండా, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రమాదకరమైన దాడి అని మండిపడ్డారు.
తాజావార్తలు
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే అరెస్ట్..? ‘చాయ్ తాగుదాం రండి’ అంటూ..
-
RC17 : రామ్ చరణ్ – సుకుమార్ సినిమా షూటింగ్, రిలీజ్‌కు పక్కా ప్లాన్
-
Dhoni-Rohit: ధోనీని చూసి భయపడ్డా.. రోహిత్ సూపర్.. టీమిండియా కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Samsung Galaxy A08: సామ్ సంగ్ Galaxy A08 భారత్‌లో లాంచ్.. 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Gandhi Jayanti: బాపూఘాట్లో మహాత్ముడికి సీఎం రేవంత్, గవర్నర్ ఘన నివాళులు..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?