Earthquake: గుజరాత్‌లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Earthquake: గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాలో బుధవారం సాయంత్రం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.4గా నమోదైందని భూకంప పరిశోధనా సంస్థ (ISR) వెల్లడించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. గాంధీనగర్‌లోని భూకంప పరిశోధనా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం సాయంత్రం 4:35 గంటలకు భూమి కంపించింది. ఈ భూకంప కేంద్రం ఆనంద్ జిల్లాకు ఉత్తర-ఈశాన్య దిశలో సుమారు 36 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
అధికారులు ఏమన్నారంటే..
ఈ ఘటనపై విపత్తు నిర్వహణ అధికారి (మామ్లత్దార్) జయకిషన్ సాధూ మాట్లాడుతూ.. “భూకంపం సంభవించిన వెంటనే జిల్లాలోని అన్ని తాలూకా అభివృద్ధి అధికారులు, మామ్లత్దార్లు, ఇతర ముఖ్య అధికారులను అప్రమత్తం చేశాం. క్షేత్రస్థాయిలో ఎక్కడైనా నష్టం వాటిల్లిందా అనే కోణంలో నివేదికలు కోరాం” అని తెలిపారు. అదృష్టవశాత్తూ ఈ భూకంపం వల్ల ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణ నష్టం గానీ, ఆస్తి నష్టం గానీ జరిగినట్లు సమాచారం లేదని అధికారులు స్పష్టం చేశారు. స్వల్ప తీవ్రత కావడంతో పెద్దగా ప్రమాదం జరగలేదని, అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Also Read
- Rakesh Mehta: మాజీ ఢిల్లీ సీఎస్ రాకేష్ మెహతా ఆత్మహత్య.. ఇంట్లో సూసైడ్ నోట్ లభ్యం..
- Ujjain: 170 ఏళ్ల హనుమంతుడి విగ్రహం.. రెండు రోజులు ప్రయత్నించినా అంగుళం కూడా కదల్లేదు!
- Assam Murder Case: ఫ్రిజ్‌లో తల, వేళ్లు నరికిన భర్త.. పెంపుడు కుక్కకు మృతదేహాన్ని తినిపించే ప్లాన్?
- PM Modi: UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచమంతా విస్తరించాలన్న మోడీ
తాజావార్తలు
-
Fauji vs Spirit: రిలీజ్‌కు ముందే క్లాష్.. ప్రభాస్ అభిమానులకు టెన్షన్!
-
Free Electricity: గుడ్‌న్యూస్.. ఉచిత విద్యుత్ ప్రకటించిన మంత్రి నారా లోకేష్!
-
Duleep Trophy Final: దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ భారీ ఆధిక్యం.. 336 పరుగులకే సౌత్ జోన్ ఆలౌట్!
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఐటీ రంగాన్ని ఊపేస్తున్న GPT-6 Astra.. బీటెక్ ఫ్రెషర్లకు ఏఐ బిగ్ అలర్ట్..
ట్రెండింగ్
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!
-
2.5K డిస్ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
నేడే Apple Surprise and Shine Event.. ఫోల్డబుల్ iPhoneతో పాటు iPhone 18 Pro, కొత్త Apple Watchలు.. ఇంకా ఏం రాబోతున్నాయంటే?
-
IPL Team Owners: ఆస్ట్రేలియా క్రికెట్లో కీలక పరిణామం.. ఐపీఎల్ టీమ్ ఓనర్లకు పండగే ఇగ!