Srilanka Crisis: శ్రీలంకలో ఉద్రిక్తత.. ఆందోళనకారులపైకి సైన్యం కాల్పులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srilanka Economic Crisis: తీవ్ర ఆర్థిక సంక్షోభంతో ద్వీప దేశం శ్రీలంక ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇప్పటికే ఆ దేశంలో ఆహార, మందులు, ఎరువులు, ఇంధన కొరత ఎక్కువైంది. ప్రజల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఇంధన సమస్యల కారణంగా శ్రీలంకలో రెండు వారాల పాటు స్కూళ్లు, ప్రభుత్వ కార్యాయాలు మూసేయాని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. పెట్రోల్ బంకుల వద్ద ఇంధనం కోసం ప్రజలు పడిగాపులుకాస్తున్నారు. ఇంధన దిగుమతి చేసుకుంటున్నా కూడా వాటికి కట్టేందుకు విదేశీ మారక నిల్వలు శ్రీలంక ప్రభుత్వం దగ్గర లేవు.
తాజాగా ఇంధన స్టేషన్ల వద్ద అల్లర్లను అదుపు చేసేందుకు శ్రీలంక సైన్యం కాల్పులు జరిపింది. దేశం అంతటా పెట్రోల్ , డిజిల్ కోసం పెద్ద ఎత్తున క్యూలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే కొలంబోకు 365 కిలోమీటర్ల దూరంలో ఉనన విశ్వమడులో శనివారం రాత్రి ఆందోళకారులపైకి కాల్పులు జరిపారు. ఆందోళనకారులు శ్రీలంక గార్డులపైకి రాళ్లురువ్వడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. దీంతో ఆర్మీ కాల్పులు జరపాల్సి వచ్చిందని సైన్యం ప్రతినిధి నీలంత ప్రేమరత్నే తెలిపారు.
Also Read
- Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
- Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
- Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
- Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
20 నుంచి 30 మంది వ్యక్తులు రాళ్లతో దాడి చేసి ఆర్మీ ట్రక్కును ధ్వంసం చేశారు. పరిస్థితిని అదుపు చేసేందుకు జరిపిన కాల్పుల్లో నలుగురు పౌరులు, ముగ్గురు ఆర్మీసైనికులు గాయపడ్డారు. పెట్రోల్ కోసం ఎదురుచూస్తున్న ప్రజలు పెట్రోల్ అయిపోవడంతో ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారి ఘర్షణకు దారితీసిందని పోలీసులు వెల్లడించారు. 1948లో బ్రిటీష్ నుంచి స్వాతంత్య్రం పొందిన తర్వాత శ్రీలంక ఇటీవంటి సంక్షోభాన్ని తొలిసారిగా ఎదుర్కొంటోంది. దేశంలోని 2.2 కోట్ల జనాభా తీవ్రమైన ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. శ్రీలంక ప్రజలు అధ్యక్షడు గోటబయ రాజపక్స రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!