ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న, ప్రతిష్టాత్మకమై మహీంద్రా స్కార్పియో ఎన్ వచ్చేస్తోంది. బిగ్ డాడీ ఆఫ్ ఎస్ యూ వీస్ గా పిలిచే స్కార్పియో-ఎన్ సోమవారం సాయంత్రం 5.30 గంటలకు లాంచ్ కాబోతోంది. గతంలో ఉన్న మోడల్ కన్నా మరింత అధునాతనంగా, మరిన్ని ఫీచర్లలో స్కార్పియో ఎన్ రాబోతోంది. ఈ కార్ విడుదల కాకముందే చాలా మంది బుకింగ్ చేసుకున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న స్కార్పియో కన్నా స్కార్పియో ఎన్ ధర ఎక్కువగానే ఉంది. ఎస్ యూ వీ […]
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో ట్విస్టులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటు సీఎం ఉద్ధవ్ వర్గం, అటు రెబెల్ నేత ఏక్ నాథ్ షిండే వర్గాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు టూరిజం మంత్రి ఆదిత్య ఠాక్రే, రెబెల్ నేత ఏక్ నాథ్ షిండేపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మే 20న, ఉద్ధవ్ ఠాక్రే, ఏక్ నాథ్ షిండేకు ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేశారని.. అయితే ఆ సమయంలో షిండే డ్రామాలు చేశారని ఆదిత్య […]
హిందువులు ఎంతో పవిత్రంగా భావించే అమర్ నాథ్ యాత్ర మరికొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతోంది. మంచురూపంలో ఉన్న శివలింగాన్ని దర్శించుకునేందుకు దేశ నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. ఏకంగా ఇప్పటి వరకు సుమారుగా 3 లక్షల మంది వరకు రిజిస్ట్రేషన్లు చేసుకున్నట్లు శ్రీ అమర్ నాథ్ జీ పుణ్యక్షేత్ర బోర్డు( ఎస్ఏఎస్బీ) వెల్లడించింది. 43 రోజుల యాత్ర కోసం యాత్రికుల నమోదును ఏప్రిల్ 11న ప్రారంభించారు. దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకులకు చెందిన 566 […]
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం మలుపులు తిరుగుతోంది. తాజాగా ‘మహ’ పంచాయతీ సుప్రీం కోర్టుకు చేరింది. రెబెల్ వర్గం శివసేన ఎమ్మెల్యేలు 16 మందిపై అనర్హత వేటు వేయడాన్ని సవాల్ చేస్తూ ఏక్ నాథ్ షిండే వర్గం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీనిపై నేడు సుప్రీం కోర్టు విచారణ జరపనుంది. దీంతో పాటు సీఎం ఉద్ధవ్ ఠాక్రే శివసేన లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా అజయ్ చౌదరిని నియమించడాన్ని, డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ పై అవిశ్వాసాన్ని తిరస్కరించడాన్ని ఏక్ […]
ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీ గెలుపుపై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సమాజ్ వాదీ పార్టీని నిందించారు. యూపీలో బీజేపీ గెలుపుకు కారణం ఎవరని ప్రశ్నించారు. తాజాగా నిన్న జరిగిన ఉపఎన్నికల ఓట్ల లెక్కింపులో రాంపూర్, ఆజాంగఢ్ లోక్ సభ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. అయితే సమాజ్ వాదీ పార్టీ, బీజేపీని ఓడించలేదని.. వారికి నిజాయితీ లేదని విమర్శించారు. ఇటాంటి అసమర్థ పార్టీలకు మైనార్టీ కమ్యూనిటీ ఓట్లు వేయకూడదని ఆయన అన్నారు. బీజేపీ […]
హైదరాబాద్ ప్రతిష్ట పెంచేలా.. నగరం సిగలో మరో కలికితురాయి చేరబోతోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసి ‘టీ హబ్’ ను ఈ నెల 28న సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘‘ భవిష్యత్తును అంచనా వేయడానికి ఉత్తమ మార్గం దానిని సృష్టించడం’’ అనే అబ్రహం లింకన్ వ్యాఖ్యలను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు కేటీఆర్. హైదరాబాద్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ కు పెద్ద పీట వేస్తూ టీహబ్ కొత్త […]
భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లిలాంటిదని.. 47 ఏళ్ల క్రితం భారతీయుల డీఎన్ఏలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని అణచివేయాలని ప్రయత్నించారని.. ఎమర్జెన్సీ భారతదేశ ప్రజాస్వామ్యంలో నల్లని మచ్చ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సంస్కృతి, ఆహారం, దుస్తులు, సంగీతం మరియు సంప్రదాయాల వైవిధ్యం మన ప్రజాస్వామ్యాన్ని చైతన్యవంతం చేస్తుందని ఆయన అన్నారు. జీ-7 దేశాల సమావేశం కోసం జర్మనీ వెళ్లిన ప్రధాని అక్కడ మ్యూనిచ్ నగరంలో ప్రవాస భారతీయుల సమావేశంలో ప్రసంగించారు. సుస్థిర వాతావరణ పద్ధతులు భారతదేశ ప్రజల జీవితాల్లో […]
దక్షిణాఫ్రికాలో దారుణం చోటు చేసుకుంది. ఓ నైట్ క్లబ్ లో దాదాపుగా 20 మంది యంగ్ ఏజ్ యువకులు చనిపోయి పడి ఉన్నారు. ఈ వార్త దక్షిణాఫ్రికాలో సంచలన కలిగించింది. దక్షిణాఫ్రికాలోని దక్షిణ ప్రాంతంలోని ఈస్ట్ లండన్ నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నైట్ క్లబ్ లో పార్టీ చేసుకుంటున్న సందర్భంలో యువకులు మరణించినట్లు తెలుస్తోంది. చనిపోయినవారి అందరి వయసు 18-20 మధ్యే ఉందని అక్కడి పోలీస్ అధికారులు వెల్లడించారు. ఈస్టర్న్ కేప్ అథారిటీ ప్రతినిధి […]
తెలంగాణలో రాక్షస, నయా నిజాం పాలన సాగుతోందని విమర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. టీఆర్ఎస్ పార్టీ నుంచి సామ వెంకట్ రెడ్డి, నవతా రెడ్డి బీజేపీ పార్టీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉద్యమకారుల పార్టీగా చెప్పుకునే టీఆర్ఎస్ లో ఉద్యమకారులకు స్థానం లేదని.. ఉద్యమ ద్రోహులకు టీఆర్ఎస్ పార్టీలో, ప్రభుత్వంలో స్థానం కల్పించారని విమర్శించారు. ప్రభుత్వం మెడలు వంచడానికి బీజేపీ కృషి చేస్తోందని ఆయన అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలకు భిన్నంగా రాష్ట్ర ముఖ్యమంత్రి […]
బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ చేసి వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు భగ్గుమంటున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభం అయిందని.. కేసీఆర్ మరోసారి అధికారంలోకి రారని..వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అని తరుణ్ చుగ్ కామెంట్లు చేశాడు. అయితే ఈ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ప్రభుత్వ విప్ బాల్క సుమన్ బీజేపీ పార్టీపై నిప్పులు చెరిగారు. కౌంట్ డౌన్ ప్రారంభం అయింది టీఆర్ఎస్ కు కాదని.. బీజేపీకి అని విమర్శించారు. […]