అమెరికా టెక్సాస్ రాష్ట్రంలో ఘోరం జరిగింది. అమెరికాకు కంటైనర్ ట్రక్ లో వలస వస్తున్న వారు కంటైనర్ లోనే మరణించారు. ఊపిరి ఆడకపోవడం, విపరీతమైన వేడి కారణంగా అందులోనే చనిపోయారు. ఈ ఘటనలో మరణాల సంఖ్య 51కి చేరింది. టెక్సాస్ లోని శాన్ ఆంటోనియోలో మంగళవారం రోడ్డు పక్కన ఆపి ఉన్న ట్రక్ కంటైనర్ లో పెద్ద సంఖ్యలో శవాలను కనుక్కున్నారు. మరణించిన వారిలో 39 మంది పురుషులు ఉండగా..12 మంది మహిళలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. […]
ఉదయ్ పూర్ హత్య దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. రాజస్థాన్ లో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తతకు కారణం అయింది. ఇటీవల నుపుర్ శర్మ మహ్మద్ ప్రవక్తపై అనుచిత కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆమెకు మద్దతు ఇస్తూ పోస్ట్ చేసిన కన్హయ్య లాల్ అనే వ్యక్తిని ఇద్దరు మతోన్మాదులు రియాజ్ అక్తర్, గౌస్ మహ్మద్ అత్యంత పాశవికంగా తలను కోస్తూ చంపేశారు. చంపడమే కాకుండా ఈ సంఘటనలను వీడియో తీస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ […]
ఇప్పుడే దేశవ్యాప్తం ప్రజలు మహారాష్ట్ర రాజకీయ పరిణామాలను గమనిస్తున్నారు. తాజాగా గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ, ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం బలాన్ని నిరూపించుకోవాలని ఆదేశించారు. గురువారం సాయంత్రం వరకు డెడ్ లైన్ విధించారు. రేపు ఉదయం 11 గంటలకు ప్రత్యేక సెషన్ ఏర్పాటు చేయాలని అసెంబ్లీ కార్యదర్శికి లేఖ రాశారు. అసెంబ్లీ సమావేశ కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఆదేశించారు. సభ్యులు వారివారి సీట్లలో కూర్చున్న తరువాత ఓట్ల లెక్కింపు ఉండనుంది. ఏ కారణం చేతనైనా ప్రత్యేక […]
లాటిన్ అమెరికా దేశం కొలంబియాలో దారుణం చోటు చేసుకుంది. జైలు నుంచి ఖైదీలు తప్పించుకునే క్రమంలో ఏర్పడిన నిరసనల్లో మంటలు చెలరేగాయి. దీంతో ఏకంగా 51 మంది ఖైదీలు దుర్మరణం పాలయ్యారు. 24 మంది గాయపడ్డారు. మంగళవారం తెల్లవారుజామున పశ్చిమ కొలంబియాలోని టోలువాలోని ఒక జైలులో ఈ ఘటన చోటు చేసుకుంది. కొలంబియా న్యాయమంత్రి విల్సన్ రూయిజ్ చెప్పిన వివరాల ప్రకారం.. మంగళవారం తెల్లవారుజామున 2 గంటలకు ఖైదీల మధ్య గొడవ జరిగిందని.. ఘర్షణ జరుగుతున్న సమయంలో […]
మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ, సీఎం ఉద్ధవ్ ఠాక్రేను బల నిరూపన చేసుకోవాలని ఆదేశించడంతో రాజకీయం రసవత్తంగా మారాయి. ఇప్పటికే గౌహతిలో ఉన్న శివసేన రెబెల్స్ గోవాకు వెళ్లనున్నారు. గోవా లోని తాజ్ రిసార్ట్ కన్వెన్షన్ సెంటర్ లో రెబెల్ ఎమ్మెల్యేలకు 70 రూమ్ లు బుక్ చేసినట్లు సమాచారం. గురువారం ఫ్లోర్ టెస్ట్ ఉండటంతో గోవా నుంచి నేరుగా రెబెల్ ఎమ్మెల్యేలు ముంబైకు రానున్నారు. ఇదిలా ఉంటే గవర్నర్ […]
ఇండియాలో కరోనా కోరలు చాస్తోంది. గత కొన్ని రోజులుగా కేసుల సంఖ్య పెరిగింది. నెల క్రితం వరకు రోజూవారీ కేసుల సంఖ్య కేవలం 5 వేల లోపే ఉండేది. అయితే ఇప్పుడు మాత్రం పరిస్థితి మారింది. నెమ్మదిగా కేసుల సంఖ్య, యాక్టివ్ కేస్ లోడ్ పెరుగుతోంది. ఫోర్త్ వేవ్ ముంచుకొస్తుందా..? అని ప్రజలు భయపడుతున్నారు. ఇటీవల కాలంలో తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాల్లో కూడా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 14,506 […]
దేశవ్యాప్తంగా ఉదయ్ పూర్ హత్య కలకలం రేపింది. మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మకు మద్దతు తెలుపుతూ.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడని ఇద్దరు మతోన్మాదులు కన్హయ్య లాల్ అనే టైలర్ ను దారుణంగా తల కోసి చంపారు. ఈ ఘటన ఉదయ్ పూర్ లో జరిగింది. దీంతో రాష్ట్రం మొత్తం ఉద్రిక్తత ఏర్పడింది. ఇంటర్నెట్ షట్ డౌన్ చేయడంతో పాటు ఉదయ్ పూర్ తో పాటు అన్ని జిల్లాల్లో 144 సెక్షన్ విధించారు. […]
మహారాష్ట్రలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం నేపథ్యంలో గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ కీలక నిర్ణయం తీసుకున్నారు. జూన్ 30న బలపరీక్షకు ఆదేశించారు. సీఎం ఉద్ధవ్ ఠాక్రే తన మెజారీటీని నిరూపించుకోవాల్సి ఉంది. అయితే ఇప్పటికే శివసేన నుంచి 39 మంది ఎమ్మెల్యేలు రెబెల్ నేత ఏక్ నాథ్ షిండే క్యాంపులో ఉండటంతో బలపరీక్ష కీలకంగా మారింది. మంగళవారం గవర్నర్ ను కలిసిన మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్, ఉద్దవ్ ఠాక్రే తన మెజారిటీ కోల్పోయాడని […]
అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. దేశంలోకి ఎదోవిధంగా డ్రగ్స్ వస్తూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో దేశంలోని పలు విమానాశ్రయాల్లో డ్రగ్స్ తరలిస్తూ పట్టుబడుతున్నారు స్మగ్లర్లు. విదేశాల నుంచి అక్రమంగా ఇండియాలోకి డ్రగ్స్ ను తీసుకువస్తున్నారు. తాజాగా ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. వెస్ట్ ఆఫ్రికా నుంచి ఇండియాకు వచ్చిన యువతి వద్ద నుంచి అధికారులు డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. వెస్ట్ ఆఫ్రికా నుంచి ఇండియాకు వచ్చిన యువతి వద్ద 13.26 కోట్ల […]
మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే శివసేనకు చెందిన 39 మంది ఎమ్మెల్యేలు మహా వికాస్ అఘాడీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నామని చెబుతున్నారు. వీరంతా శివసేన రెబెల్ నేత ఏక్ నాథ్ షిండే ఆధ్వర్యంలో గౌహతిలో ఉన్నారు. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ నెమ్మదిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే బీజేపీ నేత, మాజీ సీఏం దేవేంద్ర ఫడ్నవీస్, రెబెల్ నేత ఏక్ నాథ్ షిండే రహస్యంగా సమావేశం అయినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో రానున్న రోజుల్లో […]