దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 17,070 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 23 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. కోవిడ్ నుంచి 14,413 మంది రికవరీ అయ్యారు. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,07,189గా ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 3.40 శాతంగా ఉంది. గడిచిన రోజు దేశంలో మొత్తంగా 18 వేలకు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. గురువారం నుంచి […]
రాజస్థాన్ ఉదయ్ పూర్ లో టైలర్ కన్హయ్య లాల్ హత్య దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేపింది. రాజస్థాన్ లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఇంటర్నెట్ బంద్ చేశారు. ఉదయ్ పూర్ లో కర్ఫ్యూ విధించారు. ప్రజలంతా సంయమనంతో ఉండాలని సీఎం అశోక్ గెహ్లాట్ కోరారు. మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలకు మద్దతు ఇచ్చాడనే నెపంతో ఇద్దరు మతోన్మాదులు రియాజ్ అఖ్తరీ, గౌస్ మహ్మద్ లు […]
గత కొంత కాలంగా పెరుగుతూ పోతున్న సిలిండర్ ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. కమర్షియల్ సిలిండర్ తో పాటు డోమెస్టిక్ సిలిండర్ పై ధర పెరుగుతూనే ఉంది. తాజాగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సిలిండర్ ధరను తగ్గించాయి. శుక్రవారం, జూలై 1 నుంచి 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో వినియోగదారుడికి కాస్త ఉపశమనం లభించినట్లు అయింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నెలకు రెండుసార్లు ఎల్ పీ జీ ధరలనున ప్రకటిస్తాయి. నెల […]
పూరి జగన్నాథుడి రథయాత్రం నేటి నుంచి ప్రారంభం కానుంది. కోవిడ్ మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా జగన్నాథుడి రథయాత్రకు భక్తులు హాజరు కాలేకపోయారు. ఈ సారి మాత్రం జగన్నాథుడిని దర్శించుకునేందుకు దేశ, విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పూరికి చేరుకుంటున్నారు. దాదాపుగా 10 లక్షల మంది భక్తలు వస్తారని ఒడిశా అధికారులు అంచనా వేస్తున్నారు. https://youtu.be/9Bpv0H56giY జగన్నాథుడి రథయాత్రలో జగన్నాథుడు, దేవీ సుభద్ర, బలభద్ర భగవానుడిని మూడు రథాల ద్వారా లాగుతారు. భక్తులు పెద్ద సంఖ్యలో […]
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి ఎండ్ కార్డ్ పడింది. శివసేన నేత ఏక్ నాథ్ షిండే తన వర్గం ఎమ్మెల్యేలతో గౌహతిలో క్యాంప్ పెట్టినప్పటి నుంచి సినిమాను తలపించే ట్విస్టులతో రాజకీయం రసవత్తంగా సాగింది. ఓ వైపు ఉద్ధవ్ ఠాక్రే, శరత్ పవార్, మరో వైపు ఫడ్నవీస్, ఏక్ నాథ్ షిండే ఇలా రెండు వర్గాల మధ్య ఎత్తులు పైఎత్తుల మధ్య అధికారం దోబూచులాడింది. చివరకు రెబెల్ నేత ఏక్ నాథ్ షిండే, బీజేపీ మద్దతుతో సీఎం పీఠాన్ని […]
దేశ ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి. గురువారం నగరవ్యాప్తంగా కుండపోతగా వర్షం పడింది. నైరుతి రుతుపవన కాలంలో తొలిసారిగా నగరంలో భారీ వర్షాలు నమోదు అయ్యాయి. దీంతో నగరం అంతటా వర్షపు నీరు నిలిచింది. ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముంబై దక్షిణ ప్రాంతంలో రోజంతా వర్షం కురసింది. బీఏ అంబేద్కర్ రోడ్, బ్రీచ్ క్యాండీ, జేజే ఫ్లై ఓవర్, వర్లీ, కమలా మిల్స్ కాంపౌండ్, అంధేరి, మాతుంగా, కుర్లా, శాంతాక్రూజ్ ప్రాంతాల్లో భారీ […]
దాయాది దేశం పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతోంది. దేశంలోని విదేశీ మారక నిల్వలు అడుగంటిపోయాయి. దీంతో పాటు విపరీతమైన అప్పుల కారణంగా పాకిస్తాన్, మరో శ్రీలంకగా మారబోతోంది. శ్రీలంక పరిస్థితి రావడం ఖాయం కానీ.. ఎన్ని రోజుల్లో అనేదే తేలాలి. పాకిస్తాన్ ఈ ఆర్థిక సంక్షోభం నుంచి కోలుకోవడానికి ఐఎంఎఫ్ సాయం కోరుతోంది. ఇదిలా ఉంటే పాకిస్తాన్ లో విద్యుత్ సంక్షోభం నెలకొంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా తీవ్రమైన విద్యుత్ కోతలు నెలకొన్నాయి. విద్యుత్ ఉత్పత్తి […]
కాంపాక్ట్ ఎస్ యూ వీ సెగ్మెంట్ లో ఎక్కువ క్రేజ్ ఉన్న కార్లలో మారుతి సుజుకీ విటారా బ్రేజ్జా ఒకటి. స్టైలిష్ లుక్, స్టన్నింగ్ పెర్ఫామెన్స్, అట్రాక్టెడ్ ఫీచర్లు ఈ కార్ సొంతం. అందుకే ఇండియాలో ఎక్కువగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటిగా ఉంది. తాజాగా న్యూ బ్రేజ్జా 2022ను గురువారం లాంచ్ చేసింది మారుతి సుజుకీ కంపెనీ. గతంలో కన్నా మరిన్నిఫీచర్లు, స్పోర్టివ్ లుక్, మరింత ఆకర్షణీయంగా కొత్త బ్రేజ్జా మార్కెట్లోకి వచ్చింది. గతంలో ఉన్న ‘విటారా’ […]
నథింగ్ ఫోన్ 1 మొబైల్ ఫోన్ క్రేజ్ మామూలుగా లేదు. నథింగ్ అంటూనే ఫీచర్లతో అదరగొడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా జూలై 12న ఈ ఫోన్ ను అమ్మకాలను ప్రారంభిస్తున్నారు. వన్ ప్లస్ మాజీ సహ వ్యవస్థాపకుడు కార్ల్ పీ సారథ్యంలో మొదటి ఫోన్ వస్తోంది. ఫీచర్ల విషయంలో మరే ఫోన్ కు తీసిపోని విధంగా నథింగ్ మొబైన్ ను రూపొందించారు. 120 హెర్జ్ అడాప్టిక్ రిఫ్రెస్ రేట్ డిస్ ప్లేతో పాటు ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్ […]
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో కాంగో హక్కుల కార్యకర్త చెప్పిన ఓ మహిళ ధీనగాథ అందరి చేత కంటతడి పెట్టించింది. కాంగోలో మానవహక్కులు ఏ విధంగా ఉన్నాయో తెలిపేందుకు సదరు హక్కుల కార్యకర్త, ఓ మహిళ పడిన కష్టాన్ని 15 దేశాల సభ్యులు ఉండే భద్రతా మండలిలో వివరించింది. కాంగోలో అంతర్యుద్ధం కారణంగా ప్రజలు పడుతున్న బాధలను తెలిపేలా, మిలిటెంట్ల రాక్షసత్వాన్ని తెలిపేలా ఈ ఘటన ఉంది. డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో మిలిటెంట్లు రెండు సార్లు […]