దేశవ్యాప్తంగా ఉదయ్ పూర్ టైలర్ హత్య కేసు సంచలనం రేపింది. అయితే దీని కన్నా ముందుగా మహారాష్ట్రలో ఇదే తరహా హత్య జరిగింది. నుపుర్ శర్మకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడని మహారాష్ట్రలోని అమరావతిలో ఉమేష్ కోల్హే అనే వ్యక్తిని కారాతకంగా చంపారు దుండగులు. అయితే ముందుగా ఈ కేసును దోపిడి కేసుగా చెప్పిన పోలీసులు ప్రస్తుతం నుపుర్ శర్మకు మద్దతు తెలిపినందుకే హత్య చేశారని గుర్తించారు. తాజాగా ఈ కేసుపై హోం మంత్రిత్వ శాఖ […]
దేశవ్యాప్తంగా ఇప్పుడు అందరి చూపు తెలంగాణ వైపే ఉంది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి ప్రధాని మోదీతో పాటు బీజేపీ కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, పార్టీ ప్రధాన నేతలు హైదరాబాద్ లో మకాం వేశారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బీజేపీపై విమర్శలను పెంచాయి. ఇదిలా ఉంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన ప్రకటన చేశారు. తాను రేపు(ఆదివారం) ఉదయం 9 గంటలకు చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మీ ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుంటానని వెల్లడించారు. బీజేపీ దేవుళ్ల పేరుతో […]
దేశంలో ఎక్కడో చోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. నిర్భయ, పోక్సో వంటి చట్టాలు తీసుకువచ్చినా.. కామాంధుల్లో మార్పు రావడం లేదు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ సహరాన్ పూర్ లో నలుగురు వ్యక్తులు ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తను గర్భం దాల్చాలని తెలిసి నలుగురు వ్యక్తులు దాడి చేసినట్లు మహిళ ఆరోపించింది. దీంతో తీవ్ర గర్భస్రావం అయింది. ఈ ఘటనపై 24 ఏళ్ల బాధిత మహిళ దియోబంధ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. […]
కుక్కలు ఎంత విశ్వాసంగా ఉంటాయో అందరికి తెలిసిందే. యజమాని చెప్పిన మాట వింటూ నమ్మకంగా ఉంటాయి. ఒక్కో సారి యజమాని కష్ట సమయాల్లో ఉన్నప్పుడు కాపాడిన కుక్కల గురించి చాలా కథలు విన్నాం. తాజాగా అలాంటి ఘటనే మరోసారి కోల్కతాలో జరిగింది. దొంగ బారి నుంచి కుటుంబాన్ని కాపాడటమే కాకుండా.. దొంగను పట్టించింది. దక్షిణ కోల్కతాలోని కాళీఘాట్ ప్రాంతంలోని జాదు భట్టాచార్య లైన్ లో ఓ ఇంట్లో దొంగ చొరబడ్డాడు. సదరు ఇళ్లు బెంగాల్ సీఎం ఇంటికి […]
ఆంధ్రప్రదేశ్ లో పండిన మామిడి పండ్లను ఉత్తర భారతదేశానికి తీసుకెళ్లేందుకు వీలుగా వాల్తేర్ రైల్వే డివిజన్ ‘ మ్యాంగో ఎక్స్ ప్రెస్’ని ప్రారంభించింది. అయితే ఈ సీజన్ లో మాత్రం మ్యాంగో ఎక్స్ ప్రెస్ లేనట్టే. స్థానిక మార్కెట్ లో మంచి ధర పలుకుతుండటంతో వ్యాపారులు కూడా తమకు ఇబ్బందులు లేవని చెబుతున్నారు. అయితే బొగ్గు తరలింపుకు ప్రాముఖ్యత ఇచ్చిన రైల్వే శాఖ విజయనగరం నుంచి న్యూ ఢిల్లీ వెళ్లే మ్యాంగో ఎక్స్ ప్రెస్ రైలు సర్వీస్ […]
తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ నువ్వా..నేనా..అన్న రీతిలో పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాదిన్నర కాలం ఉంది. అయినా ఇప్పటి నుంచే ఈ రెండు పార్టీల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా బీజేపీ జాతీయ కార్యవర్గం సమావేశం హైదరాబాద్ లో జరుగుతుండటం మళ్లీ రాజకీయంగా చర్చనీయాంశం అయింది. ఆపరేషన్ తెలంగాణలో భాగంగానే బీజేపీ తన అత్యున్నత సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిందని తెలుస్తోంది. దీనికి తగ్గట్లుగానే తెలంగాణ బీజేపీ నాయకులు ఎక్కడా తగ్గకుండా […]
కరోనా మహమ్మారి మళ్లీ తన ప్రభావాన్ని చూపిస్తోంది. వరసగా నమోదువుతున్న కేసులు దీనికి ఉదాహరణగా నిలుస్తున్నాయి. కొన్నాళ్లుగా పెరుగుతున్న కేసులు ఫోర్త్ వేవ్ కు దారి తీస్తాయా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఫిబ్రవరి చివరి నుంచి జూన్ వరకు రోజూవారీ కేసుల సంఖ్య కేవలం 5 వేలకు దిగువనే ఉండేది. కానీ ప్రస్తుతం కేసుల సంఖ్య 15 వేలు దాటుతోంది. తాజాగా శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు 24 గంటల్లో దేశంలో కొత్తగా 17,092 […]
స్పైస్ జెట్ విమానానికి ప్రమాదం తప్పింది. గాలిలో ఉండగా క్యాబిన్ లోకి పొగలు వ్యాపించడంతో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు పైలెట్లు. ఢిల్లీ నుంచి మధ్య ప్రదేశ్ జబల్ పూర్ కు వెళ్తున్న స్పైస్ జెట్ విమానంలో అకాస్మత్తుగా పొగలు వచ్చాయి. క్యాబిన్ మొత్తం పొగతో నిండిపోయింది. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. పొగ కారణంగా ప్రయాణికులు ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. శనివారం ఉదయం ఢిల్లీ నుంచి బయలుదేరిన విమానం 5000 అడుగుల ఎత్తులోకి చేరుకోగానే […]
ఎన్టీపీసీ మరో రికార్డ్ క్రియేట్ చేసింది. దేశంలోనే అతిపెద్దదైన తేలియాడే సోలార్ ప్లాంట్ ను నిర్మించింది. శుక్రవారం అర్థరాత్రి నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం అయింది. పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఈ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు. పివీ ప్రాజెక్ట్ లో భాగంగా చివరిదైన 20 మెగావాట్లను ఉత్పత్తి ప్రారంభం అయింది. దీంతో మొత్తం 100 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో పరిచేస్తోంది. ఈ ఘనత సాధించినందుకు రామగుండం టీమ్ ను ఎన్టీపీసీ […]
మణిపూర్ నోనీ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. బుధవారం రాత్రి నోని జిల్లాలోని టెరిటోరియల్ ఆర్మీ క్యాంప్ వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో జవాన్లతో పాటు ప్రజలు శిథిలాల కింద చిక్కుకుపోయారు. శనివారానికి మరణించిన వారి సంఖ్య 20కి చేరింది. మృతుల్లో 15 మంది జవాన్లు ఉన్నారు. ఇప్పటి వరకు ఆర్మీకి చెందిన 13 మంది సిబ్బందిని ఐదుగురు ప్రజలను రెస్క్యూ చేశారు. మరో 44 మంది కనిపించకుండా పోయారు. వీరంతా […]