కాంపాక్ట్ ఎస్ యూ వీ సెగ్మెంట్ లో ఎక్కువ క్రేజ్ ఉన్న కార్లలో మారుతి సుజుకీ విటారా బ్రేజ్జా ఒకటి. స్టైలిష్ లుక్, స్టన్నింగ్ పెర్ఫామెన్స్, అట్రాక్టెడ్ ఫీచర్లు ఈ కార్ సొంతం. అందుకే ఇండియాలో ఎక్కువగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటిగా ఉంది. తాజాగా న్యూ బ్రేజ్జా 2022ను గురువారం లాంచ్ చేసింది మారుతి సుజుకీ కంపెనీ. గతంలో కన్నా మరిన్నిఫీచర్లు, స్పోర్టివ్ లుక్, మరింత ఆకర్షణీయంగా కొత్త బ్రేజ్జా మార్కెట్లోకి వచ్చింది. గతంలో ఉన్న ‘విటారా’ పేరును తొలగించి కేవలం బ్రేజ్జాగానే ఉంచింది.
కొత్త బ్రేజ్జా 2022 ప్రారంభం ధర రూ. 7.99 లక్షల నుంచి రూ. 13.96 లక్షలు( ఎక్స్ షోరూం)గా ఉంది. కొత్తగా క్రోమ్ గ్రిల్, ర్యాప్ రౌండ్ టెయిల్ లైట్లు, టెయిల్ గేట్, కొత్త బంపర్ తో న్యూ బ్రేజా వచ్చింది. డ్యుయల్ టోన్ క్యాబిన్ ఇంటీరియర్ మరింత అట్రాక్టివ్ గా కనిపిస్తోంది. హెడ్ అప్ డిస్ ప్లే, మల్టీ ఫంక్షన్ ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ తో పాటు, స్మార్ట్ ప్లే ప్రో ప్లస్ కార్ టెక్నాలజీ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ప్లోటింగ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే కొత్త బ్రేజాలో ఉన్నాయి. మొత్తం తొమ్మిది రంగుల్లో ఈ కార్ అందుబాటులో ఉండనుంది.
1.5 లీటర్ కే సిరీస్ డ్యుయల్ జెట్ పెట్రోల్ ఇంజన్ 102 బీ హెచ్ పీ పవర్ 135 న్యూటన్ మీటర్ టార్క్ జెనరేట్ చేస్తుంది. ఈ ఇంజన్ మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్ తో వస్తోంది. 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్, 6 స్పీడవ్ టాక్క్ కన్వర్టర్ ప్యాడల్ షిఫ్టర్ ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. సబ్ కాంపాక్ట్ ఎస్ యూ వీ సెగ్మెంట్ లో కొత్త బ్రేజ్జా 2022, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, రెనాల్ట్ కిగర్, మహీంద్రా ఎక్స్ యూ వీ 300, నిస్సాన్ మాగ్నైట్, టాటా నెక్సాన్ వంటి కార్లకు పోటీ ఇవ్వనుంది.
Here’s the full price list for the new Maruti Suzuki Brezza, launched at Rs 7.99 lakh. #AllNewBrezza @MSArenaOfficial pic.twitter.com/lg44qWCfFO
— Autocar India (@autocarindiamag) June 30, 2022