దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 17,070 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 23 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. కోవిడ్ నుంచి 14,413 మంది రికవరీ అయ్యారు. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,07,189గా ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 3.40 శాతంగా ఉంది.
గడిచిన రోజు దేశంలో మొత్తంగా 18 వేలకు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు 17,070 కేసులు నమోదు అయ్యాయి. అంటే స్వల్పంగా కేసుల సంఖ్య తగ్గింది. దేశంలో కరోనా గణాంకాలను పరిశీలిస్తే ఇప్పటి వరకు ఇండియాలో 4,34,69,234 కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 4,28,36,906 మంది కోలుకోగా.. 5,25,139 మంది మరణించారు. ప్రస్తుతం ఇండియాలో రికవరీ రేటు 98.55 శాతంగా ఉంది. డెత్ రేట్ 1.21 శాతంగా ఉంది.
Read Also:Love Failure: మైనర్ల లవ్‌కు మందలింపు.. ఎంతపని చేశార్రా..!
ఇండియాలో కోవిడ్ వ్యాక్సినేషన్ కారణంగా చాలా వరకు కేసులను, మరణాలను అడ్డుకోగలుగుతున్నాం. ఇప్పటికే దాదాపుగా 80 శాతం ప్రజలకు కోవిడ్ వ్యాక్సినేషన్ అందించింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటి వరకు 197,74,71,041 డోసులను అర్హులైన ప్రజలకు అందించారు. గడిచిన 24 గంటల్లో 11,67,503 మందికి వ్యాక్సినేషన్ చేశారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 55,26,48,933కు చేరింది. మరణాల సంఖ్య 63,57,973కు చేరింది.