దేశ ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి. గురువారం నగరవ్యాప్తంగా కుండపోతగా వర్షం పడింది. నైరుతి రుతుపవన కాలంలో తొలిసారిగా నగరంలో భారీ వర్షాలు నమోదు అయ్యాయి. దీంతో నగరం అంతటా వర్షపు నీరు నిలిచింది. ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముంబై దక్షిణ ప్రాంతంలో రోజంతా వర్షం కురసింది. బీఏ అంబేద్కర్ రోడ్, బ్రీచ్ క్యాండీ, జేజే ఫ్లై ఓవర్, వర్లీ, కమలా మిల్స్ కాంపౌండ్, అంధేరి, మాతుంగా, కుర్లా, శాంతాక్రూజ్ ప్రాంతాల్లో భారీ వర్షం నమోదు అయింది. దక్షిణ ముంబైలోని చాలా సబ్ వేలు నీటితో నిండిపోయాయి.
ఐఎండీ ప్రకారం గురువారం తొమ్మిది గంటల్లో దక్షిణ ముంబైలో 125.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. నగర వ్యాప్తంగా 52.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. ఇదిలా ఉంటే ముంబైలో మరో 48 గంటల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఐఎండీ ముంబై నగరానికి ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. జూలై 1,2 తేదీల్లో ముంబైలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ముంబైతో పాటు చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది.
వర్షాల కారణంగా ముంబైలోని చాలా ప్రాంతాల్లో రోడ్లు జలమయం అయ్యాయి. దీంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. చాలా చోట్ల సబ్ వేలు నీటితో నిండిపోయాయి. వర్షాల కారణంగా ముంబైకర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్ని చోట్ల భవనాలు కూలిపోవడంతో పాటు చెట్లు విరిగిపడ్దాయి. గురువారం సాయంత్ర సియోన్, కల్బాదేవీలోని రెండు భవనాలు కూలిపోయాయి. అయితే ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. బృహన్‌ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సహాయక చర్యలను ప్రారంభించారు.
#WATCH | Rain continues to lash parts of Mumbai. Visuals from near Hindmata, Dadar area pic.twitter.com/oSB7zd9NEr
— ANI (@ANI) July 1, 2022