SpiceJet Flight: 5 వేల అడుగుల ఎత్తులో విమానం..క్యాబిన్ లో పొగలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్పైస్ జెట్ విమానానికి ప్రమాదం తప్పింది. గాలిలో ఉండగా క్యాబిన్ లోకి పొగలు వ్యాపించడంతో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు పైలెట్లు. ఢిల్లీ నుంచి మధ్య ప్రదేశ్ జబల్ పూర్ కు వెళ్తున్న స్పైస్ జెట్ విమానంలో అకాస్మత్తుగా పొగలు వచ్చాయి. క్యాబిన్ మొత్తం పొగతో నిండిపోయింది. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. పొగ కారణంగా ప్రయాణికులు ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. శనివారం ఉదయం ఢిల్లీ నుంచి బయలుదేరిన విమానం 5000 అడుగుల ఎత్తులోకి చేరుకోగానే పొగలు వ్యాపించాయి. దీంతో అత్యవసరంగా ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండింగ్ చేశారు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నట్లు స్పైస్ జెట్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు.
Also Read
Read Also:SpiceJet Flight: ఇంజిన్ లో మంటలు.. పాట్నాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
స్పైస్ జెట్ విమానం ఇలా ప్రమాదాన్ని ఎదుర్కొనడం 15 రోజుల్లో ఇది రెండో సారి. ఇటీవల బీహార్ రాజధాని పాట్నా నుంచి ఢిల్లీకి బయలుదేరిన విమానం పక్షిని ఢీకొట్టడంతో ఎడమ ఇంజిన్ కు మంటలు వ్యాపించాయి. పైలెట్లు సేఫ్ గా ల్యాండింగ్ చేయడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఎడమ ఇంజిన్ మంటలు వ్యాపించడంతో ఇంజిన్ కు వెళ్లే ఇంధనాన్ని నిలిపివేసి పెద్ద ప్రమాదాన్ని తప్పించారు పైలెట్లు. టేకాఫ్ అయిన వెంటనే, పాట్నా ఎయిర్ పోర్టుకు సమీపంలో ఈ ఘటన జరిగింది. గాల్లో విమానం ఉండగానే ఎడమ ఇంజిన్ కు మంటలు అంటుకున్నాయి. ఒకే ఇంజిన్ తో ఫ్లైట్ ను ల్యాండ్ చేశారు.
Jabalpur-bound SpiceJet flight returns to Delhi after smoke detected in plane
Read @ANI Story | https://t.co/ecqBkfdfwX#SpiceJetFlight #DelhiAirport #Jabalpur pic.twitter.com/3M2tRLQZ4V
— ANI Digital (@ani_digital) July 2, 2022
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు