ఈజిప్టులో దారుణం జరిగింది. సరదాగా సముద్రంలో ఈత కొడుతున్న ఇద్దరు మహిళలపై షార్క్ దాడి చేసి చంపేశాయి. చనిపోయిన ఇద్దరు మహిళలు ఈజిప్టుకు టూరిస్టులుగా వచ్చిన వారు. ఈ విషయాన్ని ఈజిప్టు మంత్రిత్వ శాఖలు ధ్రువీకరించాయి. ఎర్ర సముద్రానికి దక్షిణ భాగంలో ఎన్న సహాల్ హషీఫ్ ప్రాంతంలో జరిగింది. ఇద్దరు మహిళలు సముద్రంలో స్మిమ్మింగ్ చేస్తున్న సమయంలో వారిపై షార్క్ అటాక్ చేసింది. చనిపోయిన ఇద్దరు మహిళల్లో ఒకరు ఆస్ట్రేలియాకు చెందిన వారు కాగా.. మరొకరు రొమేనియాకు చెందిన వారిగా గుర్తించారు.
షార్క్ దాడిలో ఆస్ట్రేలియన్ మహిల ఎడమ చేయి పూర్తిగా తెగిపోయిందని.. రెడ్ సీ గవర్నర్ అమర్ హనాఫీ తెలిపారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలోని అన్ని బీచులను మూసేసింది ప్రభుత్వం. కాగా దాడికి కారణం అయిన శాస్త్రీయ ఆధారాలను, షార్క్ ల ప్రవర్తనను గుర్తించడానికి టాస్క్ ఫోర్స్ పనిచేస్తుందని ఈజిప్టు గవర్నమెంట్ వెల్లడించిది. అయితే షార్క్ లు చాలా అరుదుగా మాత్రమే మనుషులపై అటాక్ చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
Read Also: IND Vs ENG: రెండో ఇన్నింగ్స్‌లోనూ కోహ్లీ విఫలం.. పుజారా హాఫ్ సెంచరీ
ఈజిప్టు ఎక్కువగా టూరిజంపై ఆధారపడుతుంది. ఏటా కొన్ని లక్షల మంది టూరిస్టులు రెడ్ సీ, గిజా పిరమిడ్స్ చూసేందుకు ఈజిప్టుకు వస్తుంటారు. ముఖ్యంగా యూరోపియన్ దేశాల నుంచి టూరిస్టులు ఎక్కువగా వస్తుంటారు. పెరుగుతున్న ద్రవ్యోల్భనం.. కరెన్సీ క్షీణతతో ఈజిప్టు ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటోంది. దేశం ఎక్కువగా ఎర్ర సముద్రానికి వచ్చే టూరిస్టుల పర్యాటక ఆదాయంపైనే ఆధారపడుతోంది.
అయితే గతంలో కూడా షార్క్ అటాక్స్ లో పలువురు మరణించారు.2018లో ఇదే రెడ్ సీలో షార్క్ దాడిలో ఓ టూరిస్ట్ మరణించారు. 2015లో ఇదే తరహా దాడిలో ఓ జర్మన్ టూరిస్ట్ మరణించాడు. 2010లో టూరిస్ట్ హాట్ స్పాట్ అయిన షర్మ్-ఎల్-షేక్ తీరంలో వరసగా ఐదు రోజుల్లో ఐదు షార్క్ దాడులు జరిగాయి. ఇందులో ఒకరు మరణించగా.. నలుగురు గాయపడ్డారు.