Jammu Kashmir: టెర్రరిస్టులను పట్టించిన కాశ్మీర్ గ్రామస్తులు.. సర్వత్రా ప్రశంసలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జమ్మూ కాశ్మీర్ లో నెమ్మనెమ్మదిగా పరిస్థితులు మారుతున్నాయి. గతంలో టెర్రరిస్టులకు గ్రామాల్లో ఆశ్రయం కల్పించే వారు అక్కడి ప్రజలు. గ్రామాల్లో షెల్టర్ తీసుకుంటూ సైన్యం, పోలీసులు, అమాయక ప్రజలపై దాడులు చేసేవారు. అయితే తాజాగా ఆదివారం రోజు కాశ్మీర్ లోని ఓ గ్రామం ప్రజలు ఇద్దరు లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాదులను భద్రతా బలగాలకు పట్టించారు. రియాసి జిల్లా తుక్సాన్ గ్రామ ప్రజలు ఆయుధాలతో ఉన్న ఇద్దరు ఎల్ఈటీ ఉగ్రవాదులను పట్టుకున్నారు. వీరి దగ్గర నుంచి రెండు ఏకే రైఫిళ్లు, 7 గ్రానెడ్లు, ఒక పిస్టల్ స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఉగ్రవాదులను ఫైజల్ అహ్మద్ దార్, తాలిబ్ హుస్సేన్‌లుగా గుర్తించారు.
Read Also:Godhra Riots: గోద్రా అల్లర్ల కేసులో నిందితుడికి జీవిత ఖైదు
Also Read
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
- CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
- CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
- Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
ఇటీవల కాలంలో చినాబ్ లోయ, రాజౌరీ-పూంచ్ ప్రాంతంలో తీవ్రవాద కార్యకలాపాలను మళ్లీ ప్రారంభించడానికి ఎల్ఈటీ తీవ్రవాదులు ప్రయత్నిస్తున్నట్లు గమనించామని.. ఇందులో భాగంగానే కొంతమందిని తీవ్రవాదులుగా చేర్చుకుని రెండు టెర్రర్ మాడ్యుళ్లను ఏర్పాటు చేసుకున్నారని ఏడీజీపీ పోలీస్ అధికారి ముఖేష్ సింగ్ వెల్లడించారు. ఇందులో మొదటి మాడ్యుల్ నెలక్రితం ఉదంపూర్ లో జరిగిన బాంబు పేలుడుతో, రెండవది పదిరోజుల క్రితం రాజౌరిలో జరిగిన పేలుడుతో సంబంధాలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. అప్పటి నుంచి ప్రధాన ఉగ్రవాది తాలిబ్ హుస్సెన్ పరారీలో ఉన్నారని.. తాజాగా ఈ రోజు గ్రామస్తుల సాయంతో పట్టుకున్నట్లు వెల్లడించారు.
ఉగ్రవాదులను పట్టుకున్న గ్రామస్తులకు ప్రశంసలు దక్కుతున్నాయి. గ్రామస్తుల ధైర్యాన్ని అంతా మెచ్చుకుంటున్నారు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తుక్సాన్ గ్రామ ప్రజలకు రూ. 5 లక్షల రివారడ్ ప్రకటించారు. ఇదే విధంగా జమ్మూ కాశ్మీర్ పోలీసుల తరుపున డీజీపీ రూ. 2 లక్షల రివార్డు ప్రకటించారు.
తాజావార్తలు
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!