భారతదేశ చరిత్రలో మాయని మచ్చగా మిగిలాయి 2002లో గుజరాత్ లో జరిగిన గోద్రా అల్లర్లు. ఈ అల్లర్ల చుట్టూ రాజకీయం ఇన్నేళ్లయినా ఇంకా కొనసాగుతూనే ఉంది. అయోధ్య నుంచి వస్తున్న 59 మంది కరసేవకులను ఉన్న రైలు బోగీని కాల్చేయడంతో వారంత మరణించారు. ఈ ఘటన ఫిబ్రవరి, 2002లో చోటు చేసుకుంది. ఈ ఘటన అనంతరం గుజరాత్ వ్యాప్తంగా మతకలహాలు జరిగాయి.
తాజాగా గోద్రా అల్లర్ల కేసులో నిందితుడు రఫిక్ బతుక్ జీవిత ఖైదు విధించించారు పంచమహల్ లోని గోద్రా అదనపు సెషన్స్ న్యాయమూర్తి. తప్పించుకు తిరుగుతున్న బతుక్ ను ఫిబ్రవరి 2021లో పోలీసులు పట్టుకున్నారు. అరెస్ట్ అనంతరం రఫిక్ బతుక్ పై విచారణ ప్రారంభం అయింది. తాజాగా శనివారం జీవిత ఖైదు విధించింది కోర్టు.
Read Also: Dalitha Bandhu: ‘దళితబంధు’కి కౌంటర్‌గా బీజేపీ దళితాతిథ్యం?
ఫిబ్రవరి 27,2002లో కరసేవకులు ప్రయాణిస్తున్న రైలుకు నిప్పు పెట్టిన కేసులో రఫిక్ బతుక్ ప్రమేయం కూడా ఉందని కోర్ట్ విశ్వసించింది. ఇప్పటి వరకు రఫిక్ బతుక్ తో పాటు ఈ కేసులో 35 మందిని కోర్టు దోషులుగా నిర్థారించింది. గోద్రా అల్లర్ల తరువాత గుజరాత్ లో మతకల్లోలాలు చెలరేగాయి. ఈ అల్లర్లలో దాదాపుగా 1200 మంది మరణించారు.
గతంలో ఈ కేసులో 31 మందిని దోషులుగా నిర్థారించింది ప్రత్యేక సిట్ కోర్టు. మార్చి 1, 2011న కోర్టు 11 మందికి మరణశిక్ష విధించడంతో పాటు 20 మందికి జీవిత ఖైదు విధించింది. అయితే 2017లో గుజరాత్ హైకోర్ట్ 11 మందికి విధించిన మరణ శిక్షను యావజ్జీవ శిక్షగా మార్చింది. దీని తర్వాత మరో ముగ్గురు నిందితులకు కోర్టులు జీవిత ఖైదు విధించింది.