Central Government Jobs in 8 years: ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు జరగడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలపై కీలక ప్రకటన చేసింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పార్లమెంట్ లో మాట్లాడుతూ.. గడిచిన 8 ఏళ్లలో 7.22 లక్షల మందిని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లోకి తీసుకున్నామని వెల్లడించారు. 2014-2022 మధ్య ఈ రిక్రూట్మెంట్ జరిగినట్లు బుధవారం పార్లమెంట్ లో వెల్లడించారు. మొత్తం 7,22,311 మందిని వివిధ…
Central Government Clarity on Increase of Assembly Constituencies in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పెంపు ఇప్పట్లో లేనట్లే ఇక. విభజన చట్టం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాలు పెరుగుతాయని ఇటు రాజకీయ పార్టీలు భావించాయి. అయితే వీటన్నింటిపై కేంద్ర పార్లమెంట్ వేదికగా క్లారిటీ ఇచ్చింది. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్
RS MPs Protest..Slogans against Modi: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో టీఆర్ఎస్ ఎంపీలు దూకుడు పెంచారు. ప్రజా సమస్యలపై పార్లమెంట్ లో చర్చించాలని పట్టుబడుతున్నారు. నిత్యావసర వస్తువులపై జీఎస్టీ పెంపు, ధరల పెరుగుదల, ద్రవ్యోల్బనం, ఇతర ప్రజా సమస్యలపై తక్షణమే పార్లమెంట్ ఉభయసభల్లో ప్రత్యేక చర్చకు అనుమతించాలని డిమాండ్ చేశారు టీఆర్ఎస్ ఎంపీలు. టీఆర్ఎస్ పార్లమెంటరీ నేత కే. కేశవరావు, టీఆర్ఎస్ లోక్ సభా పక్షనేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు
బీజేపీ మాజీ అదికార ప్రతినిధి నుపుర్ శర్మ మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం దేశవ్యాప్తంగా తీవ్ర రచ్చకు దారి తీసింది. అయితే నుపుర్ శర్మకు మద్దతు తెలిపిన కారణంగా మహారాష్ట్ర అమరావతిలో ఉమేష్ కోల్హే అనే వ్యక్తిని అత్యంత దారుణంగా హత్య చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జూన్ 21న తన దుకాణాన్ని మూసేసి ఇంటికి వస్తున్న సమయంలో ఉమేష్ కోల్హేని కత్తితో పొడిచి హత్య చేశారు.
Russian President is seriously ill: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గత శనివారం తెల్లవారుజామున పుతిన్ తీవ్రంగా వాంతులతో బాధపడినట్లు రష్యన్ టెలిగ్రామ్ ఛానెల్ జనరల్ ఎస్వీఆర్ చెప్పింది. వెంటనే పుతిన్ అత్యవసర వైద్య బృందం హుటాహుటీన అధ్యక్ష కార్యాలయాని చేరుకుని చికిత్స అందించినట్లు వార్తలను వెల్లడించింది.
Kishan Reddy's comments on TRS over smart cities: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కుటుంబంపై ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే స్మార్ట్ సిటీ నిధులపై కేసీఆర్ కుటుంబం అబద్ధాలు చెబుతోందని విమర్శించారు. స్మార్ట్ సిటీ మిషన్ కార్యక్రమం క్రింద తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన రు. 1000 కోట్ల నిధులలో, ఇప్పటి వరకు రు. 392 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిందని ఆయన వెల్లడించారు. వరంగల్, కరీంనగర్
Supreme Court key judgment on Anti-Money Laundering Cases: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు మద్దతు ఇస్తూ సుప్రీం కోర్టు కీలక తీర్పును బుధవారం వెలువరించింది. ఈడీ అరెస్ట్ చేసే అధికారంలో పాటు ఈడీకి వ్యతిరేకంగా లేవనెత్తిన అన్ని అభ్యంతరాలను సుప్రీంకోర్టు తిరస్కరించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం( పీఎంఎల్ఏ)లోని నేర పరిశోధన, అరెస్ట్ అధికారం, ఆస్తుల అటాచ్మెంట్ మొదలైన నిబంధనలను సుప్రీంకోర్టు సమర్థించింది. మనీలాండరింగ్ అరెస్టులు ‘‘ఏకపక్షం’’ కానది సంచలన ఉత్తర్వుల ఇచ్చింది.
Kerala man built his own plane: ప్రతీ ఒక్కరూ కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. కుటుంబం కోసం, తనను నమ్ముకున్నవారి కోసం ఎంతైనా రిస్క్ చేస్తుంటారు. ముఖ్యంగా భార్య పిల్లల కోసం వారి కంఫర్ట్ కోసం చాలా మంది కష్టపడుతుంటారు. అయితే ఒకరు మాత్రం కుటుంబం కోసం ఏకంగా సొంతంగా విమానాన్నే నిర్మించాడు.
COVID 19 Updates: ఇండియాలో కరోనా కేసులు సంఖ్య స్థిరంగా కొనసాగుతోంది. నిన్న మొన్నటి వరకు 20 వేలకు పైగా రోజూవారీ కేసులు వచ్చాయి. అయితే గత రెండు మూడు రోజుల నుంచి 20 వేల కన్నా దిగువనే కేసుల సంఖ్య నమోదు అవుతోంది. మంగళవారంతో పోలిస్తే బుధవారం కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. అయితే మరణాల సంఖ్య మాత్రం ఎక్కువ అయింది. ప్రస్తుతం దేశంలో మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు ఎక్కువ అవుతున్నాయి.
BJP Worker Killed in karnataka: కర్ణాటకలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. బీజేపీ యువమోర్చా కార్యకర్త దారుణహత్యతో అట్టుడికిపోతోంది. దక్షిణ కన్నడ జిల్లాలో పోలీసులు బందోబస్త్ ను పెంచారు. మంగళవారం సాయంత్రం జిల్లాలోని బెల్లారే ప్రాంతంలో బీజేపీ యువ మోర్చా ఆఫీస్ బేరర్ ప్రవీణ్ నెట్టారును దుండగులు దారుణంగా హత్య చేశారు.