Umesh Kolhe Case: బీజేపీ మాజీ అదికార ప్రతినిధి నుపుర్ శర్మ మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం దేశవ్యాప్తంగా తీవ్ర రచ్చకు దారి తీసింది. అయితే నుపుర్ శర్మకు మద్దతు తెలిపిన కారణంగా మహారాష్ట్ర అమరావతిలో ఉమేష్ కోల్హే అనే వ్యక్తిని అత్యంత దారుణంగా హత్య చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జూన్ 21న తన దుకాణాన్ని మూసేసి ఇంటికి వస్తున్న సమయంలో ఉమేష్ కోల్హేని కత్తితో పొడిచి హత్య చేశారు. నుపుర్ శర్మకు మద్దతుగా కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు షేర్ చేయడంతోనే ఈ హత్య జరిగిందని తెలుస్తోంది. అదే సమయంలో రాజస్థాన్ ఉదయ్ పూర్ లో కన్హయ్య లాల్ హత్య జరగడం దేశవ్యాప్తంగా ఉద్రిక్తతలకు తావిచ్చిన సంగతి తెలిసిందే.
Read Also: Supreme Court: ఈడీని సమర్థిస్తూ సుప్రీం కోర్టు కీలక తీర్పు
ఇదిలా ఉంటే ఉమేష్ కోల్హే హత్యలో ప్రమేయం ఉన్నవారిని ఏడుగురిని ఉగ్రవాద జాతీయ దర్యాప్తు సంస్థ( ఎన్ఐఏ) అరెస్ట్ చేసింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న షారూక్ పఠాన్ ను ఆర్థర్ రోడ్ జైలులో ఉంచారు. ఆర్థర్ రోడ్ జైలులో కొందరు ఖైదీలు షారూక్ పఠాన్ పై దాడి చేవారు. ప్రస్తుతం ఈ కేసులో నిందితులందరూ ఆర్థర్ రోడ్డు జైలులోనే ఉన్నారు. ఈ కేసులో షేక్ ఇర్ఫాన్ షేక్ రహీమ్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో ఉగ్రకోణం ఉందని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. దీంతోనే ఎన్ఐఏ ప్రత్యక్షంగ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసుతో పాటు కన్హయ్యలాల్ కేసును కూడా ఎన్ఐఏనే చూస్తోంది.