China's response to Rishi Sunak's comments: యూకే ప్రధానమంత్రి అభ్యర్థి రిషి సునక్ పై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. రిషి సునక్ చైనాపై చేసిన వ్యాఖ్యలు బాధ్యతారహిత్యమైనవిగా చైనా ఆరోపించింది. ప్రధాని మంత్రి రేసులో భాగంగా ఆయన చైనాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జావో లిజియాన్ స్పందింస్తూ... ‘‘ చైనా ముప్పు’’అని ప్రచారం చేసినంత మాత్రాన ఒకరి సొంత సమస్యలను పరిష్కరించలేమని ఆయన వ్యాఖ్యానించారు. ఇది కొంత మంది బ్రిటిష్ నాయకులు…
MP Rahul Gandhi detained during protest: నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో ఈ రోజు మరోసారి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని ఈడీ ప్రశ్నించనుంది. దీనికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎంపీలు, కీలక నాయకులు ఢిల్లీలో ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈడీ కేసుతో పాటు ధరలపెరుగుదల, జీఎస్టీపై కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్ ఆవరణ నుంచి విజయ్ చౌక్ వరకు పాదయాత్ర చేపట్టారు. దీంతో పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. పోలీసులు కాంగ్రెస్ మార్చ్ ను అడ్డుకోవడంతో నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
India strong warning to Pakistan and China: దాయాది దేశం పాకిస్తాన్, డ్రాగన్ దేశం చైనాకు భారత్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ గుండా వెళ్తున్న చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్(సీపీఈసీ)పై ఇండియా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్టులో చేరడానికి మూడో దేశాన్ని ప్రొత్సహించాలని చైనా, పాకిస్తాన్ చూస్తున్న తరుణంలో భారత్ ఘాటుగా బదులిచ్చింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అరిందమ్ బాగ్చీ భారత్ నిర్ణయాన్ని వెల్లడించారు.
Bihar Chief Minister Nitish Kumar tests positive for COVID19: బీహార్ సీఎం నితీష్ కుమార్ కు మరోసారి కరోనా సోకింది. ఇప్పటికే ఈ ఏడాది జనవరిలో ఓ సారి కరోనా పాజిటివ్ రాగా.. మళ్లీ తాజాగా కరోనా బారిన పడ్డట్లు సీఎం కార్యాయలం వెల్లడించింది. మంగళవారం తనకు కరోనా సోకినట్లు.. గత రెండు మూడు రోజులుగా తనను సంప్రదించిన వారు, సన్నిహితంగా ఉన్నవారు పరీక్షలు చేయించుకోవాలని సీఎం నితీష్ కుమార్ విజ్ఞప్తి చేశారు.
దేశవ్యాప్తంగా కార్గిల్ వీరులకు నివాళులు అర్పిస్తున్నారు. భారత భూభాగాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించిన పాకిస్తాన్ కు కార్గిల్ యుద్ధం ద్వారా ధీటైన జవాబు చెప్పింది ఇండియన్ ఆర్మీ. పాకిస్తాన్ పై 1999లో కార్గిల్ యుద్ధంలో గెలుపొందిన సందర్భంగా ప్రతీ ఏడాది జూలై 26న కార్గిల్ విజయ్ దివాస్ గా జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కార్గిల్ వీరులకు నివాళులు అర్పించారు.
దేశ రాజధానిలో ఎయిడ్స్ రోగులు తీవ్ర ఆందోళన చేస్తున్నారు. గత కొన్ని నెలులుగా ఎయిడ్స్ వ్యాధిని నిరోధించే యాంటీ రెట్రో వైరల్ మందులు కొరత ఉంది. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ఢిల్లీలోని నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. హెచ్ఐవీ రోగులకు అవసరమైన, వైరస్ బారి నుంచి కాపాడే మందులు గత 5 నెలలుగా ఢిల్లీతో పాటు పొరుగు రాష్ట్రాల్లో అందుబాటులో లేవు. దీంతో రోగులు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రప్రభుత్వానికి ఎన్ని
గుజరాత్ లో అక్రమ మద్యానికి ప్రజలు పిట్టల్లా రాతున్నారు. గుజరాత్ బోటాడ్ జిల్లాలో విషపూరితమైన మద్యం సేవించడం వల్ల చాలా మంది అస్వస్థతకు గురయ్యారు. ఇదిలా ఉంటే అక్రమ మద్యం వల్ల ఇప్పటి వరకు గుజరాత్ రాష్ట్రంలోమ 28 మంది మరణించారు. బోటాడ్ జిల్లాలో ఇప్పటి వరకు 16 మంది మరణించగా.. ఈ రోజు మృతుల సంఖ్య 28కి చేరినట్లు డీజీపీ ఆశిష్ భాటియా వెల్లడించారు. ఈ విషాదకర ఘటనపై బర్వాలా, రాన్పూర్ మరియు అహ్మదాబాద్ రూరల్లో […]
Covid 19 Updates:ఇండియాలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. గత కొన్ని రోజులుగా 15 వేలకు ఎక్కువగా నమోదవుతున్న కేసులు చాలా రోజుల తరువత 15 వేలకు దిగువన నమోదు అయ్యాయి. గత వారంలో అయితే రోజూవారీ కేసుల సంఖ్య 20 వేలను కూడా దాటింది. గడిచిన 24 గంటల్లో మాత్రం ఇండియాలో కేసులు, మరణాల సంఖ్య తగ్గింది.
Lumpy Skin Disease in gujarat: గుజరాత్ రాష్ట్రంలో వింత వ్యాధి కలవరపెడుతోంది. లంపీ స్కిన్ డిసీజ్ (ఎల్ఎస్డీ)గా పలిచే ఈ వ్యాధి అత్యంత వేగంగా పశువులకు వ్యాపిస్తోంది. ఇప్పటి వరకు ఈ వ్యాధి 33 వేల ఆవులు, గేదెలకు సోకినట్లుగా తెలుస్తోంది. వ్యాధి కారణంగా 1000కి పైగా పశువులు మృత్యువాత పడ్డాయి. మరో వైపు సరిహద్దు రాష్ట్రం రాజస్థాన్ లో కూడా ఈ వ్యాధి ఉన్నట్లు కేంద్ర మత్స్య, పశువర్థక శాఖ మంత్రి పురుషోత్తమ్ రూపాల వెల్లడించారు. ఈ వ్యాధిని నివారించేందుకు కేంద్రం…
Tamil nadu Honor killing, father killed daughter: తమిళనాడులో పరువు హత్యలు కలకలం రేపుతున్నాయి. పరువు హత్యలకు సంబంధించి ఇటీవల కాలంలో పలు సంఘటనలు చోటు చేసుకున్నాయి. తాజాగా మరో పరువు హత్య తమిళనాడులో చర్చనీయాంశంగా మారింది. తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని కూతురును, అల్లుడిని దారుణంగా హత్య చేశాడు ఓ తండ్రి. ఈ ఘటనల తూత్తుకూడి జిల్లాలో జరిగింది.