Srilanka Crisis- Gotabaya Rajapaksa: శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్సకు ఊరట లభించింది. మరో రెండు వారాల పాటు సింగపూర్ లో ఉండేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం గొటబాయ రాజపక్స సింగపూర్ లో టూరిస్ట్ వీసాపై నివాసం ఉంటున్నాడు. ఇటీవల శ్రీలంక క్యాబినెట్ అధికార ప్రతినిధి బంధుల గుణవర్థన మాట్లాడుతూ.. గొటబాయ రాజపక్స ఎన్నో రోజులు సింగపూర్ లో ఉండలేడని.. త్వరలోనే శ్రీలంకకు వస్తారని అన్నారు.
Bloomberg survey On Recession: కోవిడ్ 19, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచ ఆర్థిక రంగాన్ని అస్థిర పరిచాయి. ఈ నేపథ్యంలో పలు దేశాల ఆర్థిక పరిస్థితులు దారుణం దెబ్బతినే అవకాశం కనిపిస్తోంది. ప్రపంచ దేశాాలను ఆర్థిక మాంద్య భయాలు వెంటాడుతున్నాయి. అయితే తాజాగా ఆర్థిక మాంద్యంపై బ్లూమ్ బర్గ్ ఓ నివేదికను వెల్లడించింది. ప్రపంచంలో రానున్నటువంటి ఆర్థికమాంద్యం గురించి బ్లూమ్ బర్గ్ నివేదిక వెల్లడించింది. వీటిలో ఆసియా దేశాలతో పాటు యూరప్, అమెరికా దేశాల గురించి ప్రస్తావించారు.
COVID 19 Cases In India: ఇండియాలో కరోనా కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతోంది. రోజూవారీ కేసుల సంఖ్య 15 వేలకు పైగా కొనసాగుతోంది. కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరగుతోంది. ముఖ్యంగా కేరళ, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. మరో వైపు వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతోంది. ఇప్పటికే ఇండియాలో కోవిడ్ వ్యాక్సినేషన్ డోసుల సంఖ్య 200 కోట్లను దాటింది.
దేశంలో మరో టెర్రర్ మాడ్యూల్ బయటపడింది. ఆల్ ఖైదాతో పాటు గ్లోబల్ టెర్రర్ సంస్థలతో సంబంధం ఉన్న ఆరోపణపై అస్సాంలో 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా అన్సరుల్లా బంగ్లా టీమ్ తో సంబంధాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల బీహార్ లో పీఎఫ్ఐ ఉగ్రకుట్ర బయటపడిన నేపథ్యంలో అస్సాంలో మరో ఉగ్రవాద కుట్ర వెలుగులోకి రావడం కలవరానికి గురిచేస్తోంది. ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్న 11 మందిలో ఒకరు రాష్ట్రంలోని మదర్సా టీచర్ కూడా ఉన్నాడు.
Another youth killed in karnataka: కర్ణాటక వరస హత్యలతో అట్టుడుకుతోంది. వరసగా రోజుల వ్యవధిలో ఇరు వర్గాలకు చెందిన ఇద్దరు యువకులను దుండగులు దారుణంగా హత్య చేశారు. దీంతో కర్ణాటక వ్యాప్తంగా ఒక్కసారిగా ఉద్రిక్తపరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికే బెల్లారే ప్రాంతంలో బీజేపీ యువమోర్చా కార్యకర్త ప్రవీణ్ నెట్టార్ హత్య రాష్ట్రంలో కలకలం రేపింది.
Joe biden - Xi Jinping phone talks On Taiwan Issue: తైవాన్ వివాదం అమెరికా, చైనాల మధ్య మాటల యుద్ధానికి కారణం అవుతోంది. తాజాగా గురువారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు జి జిన్ పింగ్ దాదాపుగా 2 గంటల 17 నిమిషాల పాటు టెలిఫోన్ లో చర్చించారు. ఇద్దరు నేతల మధ్య తైవాన్ అంశమే ప్రధాన ఎజెండాగా ఉంది.
First Hindu Woman In Pak To Become A Senior police officer: పాకిస్తాన్ వంటి ముస్లిం దేశంలో హిందువుల భవితే ప్రశ్నార్థకం అవుతోంది. ప్రస్తుతం పాక్ సమాజంలో హిందువులను చిన్నచూపు చూస్తుంటారు. ఒకప్పుడు గణనీయంగా ఉండే హిందువులు ప్రస్తుతం 2 శాతానికి పడిపోయారు. నిత్యం కిడ్నాపులు, మతమార్పిడిలు, పెళ్లిళ్లతో హిందువులను వేధిస్తుంటుంది అక్కడి సమాజం. అయితే ఓ హిందూ మహిళ మాత్రం పాకిస్తాన్ లో రికార్డ్ సృష్టించింది. పోలీస్ శాఖలో ఉన్నతంగా భావించే డిప్యూటీ సూపరింటెండెంట్ పదవిని అందుకుంది. పాకిస్తాన్ హిందూ…
Women's Panel Issues Notice To Adhir Ranjan Chowdhury: కాంగ్రెస్ పార్టీ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశంలో రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. పార్లమెంట్ సమావేశాల్లో బీజేపీని టార్గెట్ చేద్ధాం అని చూసిన కాంగ్రెస్ పార్టీ.. అధీర్ రంజన్ చౌదరి, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై చేసిన అనుచిత వ్యాఖ్యలతో ఢిపెన్స్ లో పడింది. బీజేపీ కాంగ్రెస్ పార్టీని తీవ్రస్థాయిలో విమర్శిస్తోంది. ఎంపీ అధీర్ రంజన్ చౌదరి, రాష్ట్రపతి ముర్మును ‘రాష్ట్రపత్ని’గా వ్యాఖ్యానించడంతో దుమారం మొదలైంది
Madhya Pradesh Janpad Panchayat Polls, BJP Big Win: మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కమలం వికసించింది. జన్ పద్ పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంది. అధికార పార్టీకి ఇది భారీ విజయం. 2023 ఎన్నికలకు ముందు బీజేపీ ఈ విజయం సాధించడం పట్ల శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం ఫుల్ ఖుష్ అవుతోంది. మధ్యప్రదేశ్ లోన 312 జన్ పద్ పంచాయతీలలో 226 స్థానాల్లో బీజేపీ మద్దతు
UK PM Race- Rishi Sunak: యూకే ప్రధాని రేసులో భారత సంతతి వ్యక్తి రిషి సునక్ దూసుకుపోతున్నారు. ఎన్నికల్ ప్రచారంలో ఆకట్టుకునే ప్రచారం చేస్తున్నారు. ఇటీవల చైనాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సునక్ మరోసారి బ్రిటన్ మహిళలకు, పిల్లలకు అండగా నిలుస్తానంటూ వాగ్ధానం చేశారు. దేశంలో హద్దులు మీరుతున్న గ్రూమింగ్ ముఠాల నిర్మూలిస్తానని..గ్రూమింగ్ ముఠాకు చెందిన వారికి జీవిత ఖైదు ఎదుర్కొంటారని..ప్రజలకు హామీ ఇచ్చారు