Supreme Court: ఈడీని సమర్థిస్తూ సుప్రీం కోర్టు కీలక తీర్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court key judgment on Anti-Money Laundering Cases: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు మద్దతు ఇస్తూ సుప్రీం కోర్టు కీలక తీర్పును బుధవారం వెలువరించింది. ఈడీ అరెస్ట్ చేసే అధికారంలో పాటు ఈడీకి వ్యతిరేకంగా లేవనెత్తిన అన్ని అభ్యంతరాలను సుప్రీంకోర్టు తిరస్కరించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం( పీఎంఎల్ఏ)లోని నేర పరిశోధన, అరెస్ట్ అధికారం, ఆస్తుల అటాచ్మెంట్ మొదలైన నిబంధనలను సుప్రీంకోర్టు సమర్థించింది. మనీలాండరింగ్ అరెస్టులు ‘‘ఏకపక్షం’’ కానది సంచలన ఉత్తర్వుల ఇచ్చింది.
అరెస్టుకు గల కారణాలను, సాక్షాధారాలను తమకు తెలియకుండా నిందితులను అరెస్ట్ చేసే అధికారం రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ల వాదించారు. విచారణ సమయంలో నిందితుడి నుంచి ఈడీ దోహపూరిత వాంగ్మూలాన్ని నమోదు చేయడం కూడా చట్టవ్యతిరేకం అని పిటిషనర్ల తరుపున వాదనలు వినిపించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఇసిఐఆర్)ని ఎఫ్‌ఐఆర్‌తో పోల్చలేమని.. ఇసిఐఆర్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అంతర్గత పత్రమని సుప్రీంకోర్టు పేర్కొంది. నిందితులకు ఇసిఐఆర్ ఇవ్వడం తప్పనిసరి కాదని.. అరెస్టు సమయంలో కారణాలను మాత్రమే బహిర్గతం చేస్తే సరిపోతుందని సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read
- Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
- Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
కేంద్రం తరుపున వాదనలు వినిపించిన సోలిసిటర్ జనరల్ తుషార్ మెహాతా మనీలాండరింగ్ నేరాల తీవ్రతను సుప్రీంకోర్టుకు తెలిపారు. మనీలాండరింగ్ నిరంతర నేరమని ఆయన కోర్టుకు వివరించారు. ఇటీవల మనీలాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ)లో కొన్ని నిబంధనలను సవాల్ చేస్తూ కార్తీ చిదంబరం, జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీతో పాటు మరికొంత మంది పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈరోజు సుప్రీంకోర్టు ఈడీకి అనుకూలంగా కీలక తీర్పును వెల్లడించింది. మనీలాండరింగ్ కేవలం విజయ్ మాల్యా, నీరవ్ మోదీ వంటి అవినీతి వ్యాపారుల ద్వారానే కాకుండా ఉగ్రవాద గ్రూపుల ద్వారా కూడా నిర్వహించబడుతోందని.. మనీలాండరింగ్ దేశ సమగ్రతకే కాకుండా సార్వభౌమాత్వానికి ముప్పు కలిగిస్తుందని పీఎంఎల్ఏ నిబంధనలను సమర్థించింది.
తాజావార్తలు
-
Rupee vs Dollar: RBI 4 కీలక నిర్ణయాలు.. డాలర్‌తో పోలిస్తే 97 పైసలు బలపడిన రూపాయి!
-
CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
-
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
-
Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
ట్రెండింగ్
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!