Kerala man built his own plane: ప్రతీ ఒక్కరూ కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. కుటుంబం కోసం, తనను నమ్ముకున్నవారి కోసం ఎంతైనా రిస్క్ చేస్తుంటారు. ముఖ్యంగా భార్య పిల్లల కోసం వారి కంఫర్ట్ కోసం చాలా మంది కష్టపడుతుంటారు. అయితే ఒకరు మాత్రం కుటుంబం కోసం ఏకంగా సొంతంగా విమానాన్నే నిర్మించాడు. లండన్ లో నివాసం ఉంటున్న కేరళకు చెందిన అశోక్ అలిసెరిల్ థమరాక్షన్ అనే వ్యక్తి తన కుటుంబం కోసం ఇంటి వద్దే ఓ ప్లేన్ ను నిర్మించాడు. నలుగురు ప్రయాణించేలా.. ఓ విమానాన్ని 18 నెలల్లో నిర్మించాడు.
నాలుగు సీట్లు ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ మోడల్ ‘‘ స్లింగ్ టీఎస్ఐ’’పేరును అతని చిన్న కుమార్తె పేరు వచ్చే విధంగా జి-దియాగా మార్చాడు. దియా అశోక్ చిన్న కుమార్తె పేరు. అశోక్ థమరాక్షన్ తన మాస్టర్స్ చేసేందుకు 2006లో యూకే వెళ్లారు. ప్రస్తుతం ఫోర్డ్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆయనకు పైలెట్ లైసెన్స్ ఉంది. తన అవసరాల కోసం అప్పుడప్పుడు రెండు సీట్లు ఉన్న విమానాలను అద్దెకు తీసుకుని నడిపేవాడు. అయితే తన భార్య పిల్లల కోసం నాలుగు సీట్లు అవసరం ఉన్న విమానం కావాల్సి వచ్చింది. అయితే నాలుగు సీట్లున్నీ విమానాలు అత్యంత అరుదుగా లభిస్తాయి.
Read Also: Business Headlines: బ్యాంకుల్లో మూలుగుతున్న 48,262 కోట్ల రూపాయలు ఎవరివో?
దీంత థమరాక్షన్ సొంతంగా ఓ నాలుగు సీట్లున్న విమానాన్ని నిర్మించాలని అనుకున్నాడు. అందు కోసం హోం బిల్డ్ విమానాల గురించి రిసెర్చ్ చేశారు. సొంత విమానాన్ని నిర్మించేందుకు ఓ సారి జోహనెస్ బర్గ్ కు చెందిన స్లింగ్ ఎయిర్ క్రాఫ్ట్ ఫ్యాక్టరీని సందర్శించి.. విమానం నిర్మించేందుకు కిట్ ఆర్డర్ చేశాడు. లాక్ డౌన్ లో సేవ్ అయిన డబ్బులతో ఈ విమానాన్ని నిర్మించినట్లు థమరాక్షన్ భార్య అభిలాష వెల్లడించారు. ఈ విమానం నిర్మించేందుకు రూ. 1.8 కోట్లు ఖర్చు అయినట్లు వెల్లడించారు. ప్రస్తుతం తను నిర్మించి విమానంలో తన భార్య పిల్లలతో కలిసి జర్మనీ, చెక్ రిపబ్లిక్, ఆస్ట్రియా వంటి దేశాలను సందర్శిస్తున్నారు అశోక్ అలిసెరిల్ థమరాక్షన్.