Manohar Lal Khattar - Pak, Bangladesh, India Can Unite: హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ దేశంలో దాయాది దేశం పాకిస్తాన్, మరో పొరుగుదేశం బంగ్లాదేశ్ లు విలీనం అవుతాయిన వ్యాఖ్యానించారు. గురుగ్రామ్ లో మూడు రోజుల పాటు బీజేపీ జాతీయ మైనారిటీ మోర్చా శిక్షణా శిబిరంలో ప్రసంగించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మైనారిటీ మోర్చాలో ఆయన సోమవారం మాట్లాడారు.
Myanmar executes 4 democracy activists: మయన్మార్ లోని జుంటా ప్రభుత్వం దుశ్చర్యకు పాల్పడింది. నలుగురు రాజకీయ, ప్రజాస్వామ్య హక్కుల కార్యకర్తలను ఉరితీసింది. ఈ ఘటనపై అంతర్జాతీయంగా మయన్మార్ మిలిటరీ ప్రభుత్వం విమర్శలు ఎదర్కొంటోంది. ప్రజాస్వామ్య యుతంగా ఎన్నుకోబడిన ప్రజా ప్రభుత్వాన్ని కూల్చి 2020 ఫిబ్రవరిలో సైనికపాలన తీసుకువచ్చింది అక్కడి సైన్యం.
Taliban Urge Hindus, Sikhs To Return: ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్లిన మైనారిటీలైన హిందువులు, సిక్కులు తిరగి ఆప్ఘాన్ కు రావాలని తాలిబన్లు కోరుతున్నారు. దేశంలో భద్రతాపరమైన అంశాలు పరిష్కరించబడ్డాయని.. తమ మైనారిటీలు అయిన హిందువులు, సిక్కులు తిరిగి దేశానికి రావాలని కోరారు. తాలిబన్ రాష్ట్ర మంత్రి కార్యాలయం డైరెక్టర్ జనరల్ డాక్టర్ ముల్లా అబ్దుల్ వాసీ జూలై 24న ఆఫ్ఘనిస్తాన్ లోని హిందు, సిక్కు కౌన్సిల్ సభ్యులతో సమావేశమయ్యారు. భద్రతా కారణాల వల్ల దేశాన్ని వదిలి వెళ్లిన వారంతా ఇప్పుడు తిరిగా రావచ్చని…
2 Indian-origin men shot dead In canada: కెనడాలో మరోసారి కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు భారతీయ సంతతికి చెందిన వ్యక్తులు మరణించారు. పదిరోజుల క్రితం ఎయిరిండియా విమానం బాంబు దాడి కేసులు నిర్ధోషిగా విడుదలైన రిపుదమన్ సింగ్ మాలిక్ హత్య జరిగిన విషయం తెలిసిందే. అయితే సరిగ్గా అదే విధంగా మరో ఇద్దరు హత్యకు గురయ్యారు. కెనడా బ్రిటీష్ కొలంబియాలోని విస్లర్ లో ఆదివారం ఈ కాల్పులు జరిగాయి. మోనిందర్ ధాలివాల్, సతీండేరా గిల్ హత్యకు గురయ్యారు.
ఇస్లామిక్ దేశంలో నేరాలకు శిక్షలు ఎంత కఠినంగా ఉంటాయో అందరికీ తెలసిందే. కన్నుకు కన్ను.. చేయికి చేయి.. ప్రాణానికి ప్రాణం అన్న రీతిలో అక్కడ శిక్షా పద్దతులు ఉంటాయి. ఇప్పటీక ఇరాక్, ఇరాన్, సిరియా, సౌదీ, యూఏఈ వంటి దేశాల్లో బహిరంగంగానే మరణశిక్షలు అమలు చేయబడుతున్నాయి. వీటిపై అంతర్జాతీయ హక్కుల సంస్థలు ఎన్నిసార్లు గొంతెత్తినా.. ప్రయోజనం లేదు. మధ్యయుగం నాటి ఈ మరణ శిక్షా పద్దతులను విరమించుకోవాలని పలు హక్కుల సంస్థలు కోరుతున్నాయి.
అగ్నిపథ్ స్కీమ్ కింద ఇండియన్ ఎయిర్ ఫోర్స్(ఐఏఎఫ్) అగ్నివీరుల ఎగ్జామ్ ఈ రోజు దేశవ్యాప్తంగా ప్రారంభం అయింది. పరీక్షా కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏ1, బీ1, సీ1 షిఫ్టుల్లో పరీక్ష నిర్వహించనున్నారు. మొదటి షిఫ్టు పరీక్ష ఉదయం 7.30 గంటలకు ప్రారంభం కాగా.. రెండో షిఫ్టు 11.30 గంటలకు మూడో షిఫ్టు మధ్యాహ్నం 3.15 గంటలకు నిర్వహించనున్నారు. జూలై 24 నుంచి జూలై 31 వరకు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పరీక్షలను నిర్వహించనున్నారు.
ఇండియాను మంకీపాక్స్ కేసులు కలవరానికి గురి చేస్తున్నాయి. ఇప్పటికే మూడు కేసులు నమోదు కాగా.. తాజాగా నాలుగో కేసు నమోదు అయింది. శనివారం వరకు నమోదు అయిన మంకీపాక్స్ కేసులు కేరళ రాష్ట్రంలో వెలుగు చూడగా.. నాలుగో కేసు దేశ రాజధాని ఢిల్లీలో బయటపడింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య నాలుగుకు చేరింది. కేరళలో నమోదు అయిన మూడు కేసుల్లో బాధితులు ఇటీవల గల్ఫ్ దేశాల నుంచి ఇండియాకు వచ్చారు.
దేశ అత్యున్నత పదవి, రాజ్యంగ అత్యున్నత పదవిని స్వీకరించబోతున్నారు ద్రౌపది ముర్ము. భారతదేశానికి 15వ రాష్ట్రపతిగా సోమవారం పదవిని స్వీకరించనున్నారు. 21 గన్ సెల్యూల్స్ మధ్య పదవి బాధ్యతలను చేపట్టనున్నారు. సోమవారం ఉదయం 10.15 నిమిషాలకు పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఆమెతో రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయిస్తారని..
చత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్ లో జరిగింది. రాయ్ పూర్ లో ట్రాఫిక్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న నిలంబర్ సిన్హా తన నిజాయితీని చాటుకున్నారు. రూ.45 లక్షల బ్యాగ్ ను స్థానిక పోలీస్ స్టేషన్ లో అందించి చాలా మందికి ఆదర్శప్రాయంగా నిలిచాడు. తాను వేసుకున్న యూనిఫాం గౌరవాన్ని పెంచేలా ప్రవర్తించారు. నయా రాజయ్ పూర్ లోని కయాబంధ పోస్ట్ కు అనుబంధంగా ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ నిలంబర్ సిన్హా..
కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 20,279 కొత్త కేసులు నమోదు అయ్యాయి. 18,143 మంది వ్యాధిబారి నుంచి కోలుకున్నారు. గడిచిన ఒక రోజులో 36 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 1,52,200 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా మొదలైనప్పటి నుంచి గణాంకాలను పరిశీలిస్తే .. ఇప్పటి వరకు దేశంలో 4,38,88,775 కరోనా కేసులు నమోదు అవ్వగా.