Air India crash: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదంపై ప్రాథమిక రిపోర్టు వచ్చింది. ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) ప్రాథమిక నివేదిక ‘‘ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్’’పై అనుమానాలను వ్యక్తం చేసింది. ఈ నివేదిక ప్రకారం ఇంధన స్విచ్‌లు రన్ నుంచి కటాఫ్‌కు మారినట్లు నిర్ధారణ అయింది. దీంతోనే ఇంజన్లకు ఇంధనం నిలిచిపోయినట్లు తేలింది. అయితే, ఇలా ఎందుకు జరిగిందనే దానిపై లోతైన విచారణ జరుగుతోంది.
Indian Army: భారతదేశానికి వ్యతిరేకంగా వేర్పాటువాద ఉద్యమం చేస్తున్న నిషేధిత "యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం (ఇండిపెండెంట్)" లేదా "ఉల్ఫా" ఉగ్రవాదుల స్థావరాలపై డ్రోన్లు, మిస్సైళ్లతో దాడులు జరిగాయి. మయన్మార్‌లోని సాగైయాంగ్ ప్రాంతంలో జరిగిన ఈ దాడుల్లో కీలకమైన ఉల్ఫా ఉగ్రవాదులు మరణించారు. అయితే, ఈ దాడులను భారత సైన్యం జరిపిందని, ఆదివారం ఉగ్రవాద సంస్థ ప్రకటన విడుదల చేసింది. ఇదిలా ఉంటే, ఈ దాడులతో తమకు సంబంధం లేదని భారత సైన్యం ఖండించింది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ రాష్ట్ర…
Shubhanshu Shukla: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ISS) నుంచి డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ భూమి పైకి ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆక్సియం-4 మిషన్ ద్వారా నలుగురు వ్యోమగాములు 18 రోజులు ఐఎస్ఎస్ లో ఉన్న తర్వాత భూమికి తిరిగి ప్రయాణాన్ని ప్రారంభించారు. ఈ నలుగురిలో భారతదేశానికి చెందిన శుభాన్షు శుక్లా కూడా ఉన్నారు. 22 గంటల ప్రయాణం తర్వాత ఆయన భూమికి చేరుతారు.
LORA: ఆపరేషన్ సిందూర్ సమయంలో ‘‘బ్రహ్మోస్ క్షిపణి’’ పనితనానికి పాకిస్తాన్‌తో పాటు ప్రపంచమే అదిరిపడింది. అయితే, ఇప్పుడు భారత్ మరో ప్రమాదకరమైన క్షిపణిని కొనుగోలు చేయాలని భావిస్తోంది. పాకిస్తాన్, చైనాలకు వణుకు పుట్టేలా ‘‘లోరా(LORA)’’ ఆయుధాన్ని ఇజ్రాయిల్ నుంచి కొనుగోలు చేయాలని భావిస్తోంది. దీనిని సుఖోయ్-30 MKI వంటి విమానాలలో అనుసంధానించాలని చూస్తోంది. లాంగ్ రేంజ్ ఆర్టిలరీ(లోరా) అనేది ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ (IAI) అభివృద్ధి చేసిన సూపర్సోనిక్ సెమీ-బాలిస్టిక్ క్షిపణి. దీనిని గాలి నుంచి ప్రయోగించే […]
Health News: ఆరోగ్యంపై ప్రజలకు మరింత అవగాహన పెంచడానికి భారత ప్రభుత్వం కీలక చర్యకు ఉపక్రమించింది. ఎలా అయితే, "సిగరేట్" తాగితే ఆరోగ్యానికి హానికరం అనే హెచ్చరిక ఉంటుందో, అదే తరహాలో సమోసా, జిలేబీలు, పకోడీ, వడా పావ్, చాయ్ బిస్కెట్స్ వంటి స్నాక్స్‌కు కూడా ఆరోగ్య హెచ్చరికల్ని ప్రారంభించనుంది. ఈ వార్నింగ్స్ ఆహార పదార్థాల్లోని అధిక స్థాయిలో ఉండే నూనె, చక్కెర, ట్రాన్స్ ఫ్యాట్స్‌ని హైలెట్ చేస్తాయి. ఇవి అన్నీ కూడా జీవనశైలి వ్యాధులతో దగ్గరి సంబంధం కలిగి ఉంటాయి.
Uttar Pardesh: ఉత్తర్ ప్రదేశ్‌లో పోలీసులు జరిపిన ఎన్కౌంటర్లో ముక్తార్ అన్సారీ, సంజీవ్ జీవా ముఠాలతో సంబంధం ఉన్న మోస్ట్ వాంటెడ్ వ్యక్తి, షార్ప్ షూటర్ షారూఖ్ పఠాన్ హతమయ్యాడు. అనేక హత్యల కేసుల్లో ఇతను వాంటెడ్‌గా ఉన్నాడు. బెయిల్ తర్వాత పరారీలో ఉన్నాడు. ఆదివారం ముజఫర్ నగర్లో ఉత్తర్ ప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF)తో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందాడని అధికారులు తెలిపారు.
Supreme Court: వైవాహిక వివాద కేసులో జీవిత భాగస్వామి టెలిఫోన్ సంభాషణల్ని రహస్యంగా రికార్డ్ చేయడం ఆమోదయోగ్యమైన సాక్ష్యమని సుప్రీంకోర్టు సోమవారం ఓ కేసులో తీర్పు చెప్పింది. జీవిత భాగస్వామి టెలిఫోన్ సంభాషణల్ని రహస్యంగా రికార్డు చేయడం గోప్యత హక్కును ఉల్లంఘిస్తుందని, కుటుంబ కోర్టులో సాక్ష్యంగా అంగీకరించలేమని పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు ఇచ్చిన తీర్పున సుప్రీంకోర్టు పక్కన పెట్టింది.
Chicken: ఇటీవల కాలంలో ఆహార విషయంలో గొడవలు హత్యలకు కారణమవుతున్నాయి. పలు సందర్భాల్లో చిన్నపాటి వివాదాలు చంపుకునే స్థాయికి వెళ్తున్నాయి. తాజాగా, కర్ణాటకలో ఓ వివాహ వేడుకలో ఎక్స్ట్రా చికెన్ డిమాండ్ చేసినందుకు ఓ వ్యక్తి తన స్నేహితుడినే చంపేశాడు. ఈ ఘటన బెళగావి జిల్లాలో చోటు చేసుకుంది.
Delhi: ఆరు రోజుల క్రితం తప్పిపోయిన త్రిపురకు చెందిన చెందిన ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని స్నేహ దేబ్నాథ్ మృతదేహం లభ్యమైంది. 19 ఏళ్ల ఆమె డెడ్‌బాడీని దేశ రాజధానిలోని ఓ ఫ్లై ఓవర్ కింద పోలీసులు గుర్తించారు. ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. డెడ్‌బాడీని పోస్టుమార్టం కోసం తరలించారు. స్నేహ ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశ్యంతోనే సూసైట్ నోట్ రాసినట్లు పోలీసులు తెలిపారు.
Execution: యెమెన్ దేశంలో కేరళ నర్సు నిమిషా ప్రియాకు జూలై 16న ఉరిశిక్ష అమలు చేయబోతున్నారు. అయితే, ఈ శిక్ష నుంచి ఆమెను తప్పించేందుకు, షరియా చట్టాల ప్రకారం, బాధితుడి కుటుంబానికి ‘‘బ్లడ్ మనీ’’ కింద పరిహారం ఇచ్చేందుకు ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. జూలై 14న భారత సుప్రీంకోర్టు ముందుకు ఈ కేసు విచారణ రానుంది. యెమెన్ దేశస్తుడి నుంచి తన పాస్‌పోర్టు తీసుకునేందుకు, నిమిషా ప్రియా మత్తు మందు ఇచ్చింది. ఇది వికటించి అతను మరణించడంతో, ఆమెకు అక్కడి చట్టాలు ఉరిశిక్ష విధించాయి.