Operation Sindoor: పహల్గాం ఉగ్రవాద ఘటన తర్వాత, భారత్ పాకిస్తాన్‌పై ‘‘ఆపరేషన్ సిందూర్’’తో విరుచుకుపడింది. పాకిస్తాన్, పీఓకేలోని 9 ఉగ్రవాద స్థావరాలపై దాడులు నిర్వహించింది. ఇందులో లష్కరే తోయిబా, జైషే మహ్మద్ హెడ్‌క్వార్టర్స్ అయిని మురిడ్కే, బహవల్పూర్ కూడా ఉన్నాయి. 100 మందికిపైగా టెర్రరిస్టులు ఈ దాడుల్లో హతమయ్యారు. అయితే, ఈ దాడుల తర్వాత పాకిస్తాన్ సైన్యం భారత్‌పైకి దాడులు ప్రారంభించింది. ఈ దాడులను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది.
S*ex Scandal: థాయ్‌లాండ్ బుద్ధిజాన్ని అనుసరించే ఒక దేశం, ఆ దేశంలో బౌద్ధ సన్యాసులకు ఎంతో గౌరవం ఉంటుంది. రాజకీయంగా, సామాజికంగా వీరి ప్రభావం ఎక్కువ. అయితే, ఇప్పుడు వారి ప్రతిష్ట మసకబారేలా కొందరు బౌద్ధ సన్యాసులు ప్రవర్తించడం ఆ దేశాన్ని కుదిపేస్తుంది. లైంగిక దోపిడీ కుంభకోణం బౌద్ధమాధికారుల గౌరవాన్ని దిగజార్చింది. వారి భక్తుల, వారిని విశ్వాసించే వారు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు.
Dowry Harassment: అత్తింటి వారి వరకట్న దాహానికి మరో అమ్మాయి బలైంది. ఈ వారం ప్రారంభంలో ఉత్తర్ ప్రదేశ్ బాగ్‌పత్‌లో అత్తమామాల నుంచి కట్నం వేధింపులు తట్టుకోలేక 28 ఏళ్ల మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఆమె తాను అనుభవించిన బాధల్ని తన శరీరంపై సూసైడ్ నోట్‌గా రాసుకుంది. మంగళవారం రాత్రి మనీషా అనే మహిళ విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఆమె భర్త కుందన్, అతడి కుటుంబ సభ్యుల వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వెల్లడించింది.
Chhangur Baba: ఉత్తర్ ప్రదేశ్‌తో పాటు దేశవ్యాప్తంగా జమాలుద్దీన్ అలియాస్ ఛంగూర్ బాబా అరాచకాలు సంచలనంగా మారాయి. ఆధ్యాత్మకవేత్త ముసుగులో పెద్ద ఎత్తున మతమార్పిడులకు పాల్పడున్న రాకెట్ బయటపడింది. ఈ రాకెట్ దేశవ్యాప్తంగా విస్తరించి ఉండటం అధికారులను నివ్వెరపరుస్తోంది. ‘‘లవ్ జిహాద్’’ని ఆయుధంగా చేసుకుని పలువురు ముస్లిం యువకులు, హిందూ అమ్మాయిలను ప్రేమించి, పెళ్లి చేసుకుని, మతం మారుస్తున్న విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Dowry abuse: యూఏఈ షార్జాలో వరకట్న వేధింపులకు గురైన కేరళకు చెందిన మహిళ, తన బిడ్డను చంపి, తాను ఆత్మహత్యకు పాల్పడింది. మహిళ తల్లి దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు. కొల్లంలోని కుందార పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ ప్రకారం.. జూలై 8న షార్జాలోని అల్ నవ్దాలో 32 ఏళ్ల విపంజిక మణి తన ఒకటిన్నర ఏళ్ల కుమార్తె వైభవితో చంపి, తాను తనువు చాలించింది.
S Jaishankar: 2020లో భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన గల్వాన్ ఘర్షణల తర్వాత తొలిసారిగా భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ను మంగళవారం కలిశారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) విదేశాంగ మంత్రుల సమావేశానికి హాజరయ్యేందుకు ఆయన డ్రాగన్ కంట్రీకి వెళ్లారు. ఇరు దేశాల సంబంధాలను సాధారణ స్థాయికి తెచ్చేందుకు రెండు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతిని చైనా అధ్యక్షుడికి వివరించినట్లు ఆయన చెప్పారు. Read Also: Lokesh : నాగ్ […]
Tesla Model Y: భారతదేశంలోకి ఎలాన్ మస్క్‌కు చెందిన ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లా ఎంట్రీ ఇచ్చింది. ఈ రోజు ముంబైలో తన తొలి షోరూంను ఓపెన్ చేసింది. టెస్లా ముందుగా తన మోడల్ Y కారును విక్రయించబోతోంది. ప్రపంచవ్యాప్తంగా టెస్లా అమ్మకాల్లో ఈ కారే అధికంగా అమ్ముడైంది. ఈ బ్రాండ్ భారతదేశంలో RWD (రియర్-వీల్ డ్రైవ్), లాంగ్-రేంజ్ RWD వేరియంట్లను అమ్మకానికి ఉంచుతుంది.
Patriot Missile System: రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా ఉక్రెయిన్‌కు ‘‘పేట్రియాట్’’ రక్షణ వ్యవస్థను పంపుతుందని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేసింది. ఈ పేట్రియాట్ సిస్టమ్స్ కోసం యూరోపియన్ యూనియన్ ఉక్రెయిన్ కోసం చెల్లిస్తాయని తెలుస్తోంది.
Pakistan: పాకిస్తాన్ లో విచిత్రం చోటుచేసుకుంది. కరాచీకి వెళ్దామని విమానం ఎక్కితే, ఏకంగా సదరు వ్యక్తి సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలో దిగాడు. పాకిస్తాన్ విమానయాన రంగం ఎంత నిర్లక్ష్యంగా ఉందనే దానికి ఇది ఒక ఉదాహరణ. ఒక దేశీయ ప్రయాణికుడి వద్ద వీసా, పాస్‌పోర్టు లేకుండా సౌదీ వెళ్లే విమానంలోకి ఎలా అనుమతించారనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది.