Shubhanshu Shukla: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ISS) నుంచి డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ భూమి పైకి ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆక్సియం-4 మిషన్ ద్వారా నలుగురు వ్యోమగాములు 18 రోజులు ఐఎస్ఎస్ లో ఉన్న తర్వాత భూమికి తిరిగి ప్రయాణాన్ని ప్రారంభించారు. ఈ నలుగురిలో భారతదేశానికి చెందిన శుభాన్షు శుక్లా కూడా ఉన్నారు. 22 గంటల ప్రయాణం తర్వాత ఆయన భూమికి చేరుతారు.
మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు (IST) కాలిఫోర్నియా తీరంలో పసిఫిక్ మహాసముద్రంలో డ్రాగన్ క్యాప్సూల్ దిగనుంది. జూన్ 25న ఫాల్కన్-9 రాకెట్ ద్వారా ఫ్లోరిడా నుంచి డ్రాగన్ స్పేస్ క్యాప్సూల్ ఐఎస్ఎస్‌కు బయలుదేరింది. మిషన్ పైలట్ శుభాన్షు శుక్లాతో పాటు కమాండర్ పెగ్గీ విట్సన్, మిషన్ స్పెషలిస్ట్ స్లావోజ్ ఉజ్నాన్స్కీ-విస్నియెన్స్కీ, టిబోర్ కాపు అంతరిక్షానికి వెళ్లి తిరిగి వస్తున్నారు.
భూమిపై దిగిన తర్వాత, 7 రోజుల క్వారంటైన్ తర్వాత శుభాన్షు శుక్లా భారతదేశానికి తిరిగిరానున్నారు. నిర్ణయించిన సమయానికి కన్నా 10 నిమిషాలు ఆలస్యంగా డ్రాగన్ క్రూ ఐఎస్ఎస్ నుంచి అన్ డాకింగ్ అయింది. ఈ బృందం దాదాపు 18 రోజుల్లో 60 రకాల ప్రయోగాల్లో పాల్గొంది.
#WATCH | Axiom 4 Mission: The Dragon spacecraft successfully undocked from the International Space Station (ISS)
Group Captain Shubhanshu Shukla and the crew are expected to splash down tomorrow
(Video Source: Axiom Space/YouTube) pic.twitter.com/sozuwE9s7a
— ANI (@ANI) July 14, 2025