Chhangur Baba: జమాలుద్దీన్ అలియాస్ ఛంగూర్ బాబా అరాచకాలు, దేశ వ్యతిరేక కార్యకలాపాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. హిందూ అమ్మాయిలు, మహిళలే టార్గెట్‌గా దేశవ్యాప్తంగా మతమార్పిడి నెట్వర్క్ని స్థాపించాడు. తనను తాను దేవుడిగా ప్రకటించుకుని, ఆ ముసుగులో అనేక అరాచకాలు చేస్తున్నాడు. ఈ కేసులో మతమార్పిడుల కోసం పలు ఇస్లామిక్ దేశాల నుంచి వందల కోట్లు నిధులను సేకరించాడు. పేద, బలహీన హిందువులను టార్గెట్ చేస్తూ, లవ్ జిహాద్ ద్వారా మత మార్పిడి చేసేందుకు వందల కోట్ల నిధుల్ని సంపాదించాడు. వీటిపై ఇప్పుడు యూపీ…
Bangladesh: బంగ్లాదేశ్ వ్యాప్తంగా హిందూ వ్యతిరేకత, భారత్‌పై ద్వేషం రోజురోజుకు పెరుగుతోంది. గతేడాది ఆగస్టులో షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చారో, అప్పటి నుంచి ఆ దేశంలో మైనారిటీలు, ముఖ్యంగా హిందువులను టార్గెట్ చేస్తున్నారు. మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం హిందువుల భద్రతను పట్టించుకోవడం లేదు. యూనస్ సర్కారులో మతోన్మాదులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ, హిందువుల ఆస్తులు, వ్యాపారాలు, గుడులపై దాడులు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్‌లో ఓ స్క్రాప్ […]
Bihar: మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగబోతున్న బీహార్ రాష్ట్రంలో వరసగా జరుగుతున్న కాల్పుల ఘటనలు కలకలం రేపుతున్నాయి. తాజాగా, ఆదివారం పాట్నాలోని పోలీస్ స్టేషన్ సమీపంలో, పట్టపగలు ఓ న్యాయవాదిని కాల్చి చంపారు. మరణించిన వ్యక్తిని జితేంద్ర కుమార్‌గా గుర్తించారు. అయితే, గత రెండేళ్లుగా ఇతను న్యాయవృత్తిలో చురుకుగా లేరని, ప్రాక్టీసింగ్ మానేనట్లు పోలీసులు తెలిపారు.
Jharkhand: జార్ఖండ్ ధన్బాద్లో మద్యం వ్యాపారులు తమ అవినీతిని పాపం ఎలుకలపై నెట్టేస్తున్నారు. ధన్బాద్లో ఇండియన్ మేడర్ ఫారిన్ లిక్కర్ నిల్వల్లో అవినీతినికి పాల్పడిన వ్యాపారులు, ఆ నెపాన్ని అమాయకపు ఎలుకలపై నెట్టేసే ప్రయత్నం చేశారు. నిల్వలు సరిగా లేవని వివరించలేదని వారు, దాదాపు 800 బాటిళ్ల మద్యాన్ని ఎలుకలు తాగుతున్నాయని ఆరోపించారు. సెప్టెంబర్ 01న జార్ఖండ్ కొత్త లిక్కర్ పాలసీ ప్రారంభించడానికి నెల రోజుల ముందు, ఎలుకలపై ఈ నేరాన్ని మోపారు. Read Also: Pakistan: […]
Pakistan: భారతదేశాన్ని ఇన్నాళ్లు పాకిస్తాన్ ‘‘అణు బెదిరింపులకు’’ పాల్పడేది. అయితే, ఆపరేషన్ సిందూర్‌తో ఈ పరిస్థితిని భారత్ మార్చేసింది. ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడుతూ.. ఉగ్రవాద దాడుల్ని దేశంపై యుద్ధంగానే చూస్తామని, ఇకపై అణు బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టంగా పాకిస్తాన్‌కు తెలియజేశాడు. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్, పాకిస్తాన్ అణ్వాయుధాలకు కేంద్రంగా ఉన్న పలు ఎయిర్ బేస్‌లపై దాడులు చేసింది.
US-China War: తైవాన్ విషయంలో చైనా దుందుడుకు చర్యల్ని ప్రారంభిస్తే, అమెరికా ఆ దేశంతో యుద్ధానికి సిద్ధమవుతోందా..? అనే అనుమానాలు కలుగుతున్నాయి. అమెరికా, చైనాతో యుద్ధానికి వెళ్తే.. జపాన్, ఆస్ట్రేలియా ఎలాంటి పాత్ర పోషిస్తాయని పెంటగాన్ ఒత్తిడి తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది.
Khalistani Terrorists: భారత్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు, జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్న పంజాబ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ పవిత్తర్ సింగ్ బటాలాను, మరో ఏడుగురు ఖలిస్తాన్ ఉగ్రవాదులను అమెరికాలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) కిడ్నాప్ కేసులో అరెస్టు చేసింది. బటాలా నిషేధిత ఉగ్రవాద సంస్థ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్‌తో సంబంధాలను కలిగి ఉన్నాడు. ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నందుకు భారతదేశం ఇతడిని కోరుతోంది.
Air India Crash: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ప్రాథమిక రిపోర్ట్ వెల్లడైంది. విమానం టేకాఫ్ అయిన తర్వాత 32 సెకన్ల లోపే ‘‘ఇంధన నియంత్రణ స్విచ్’’ల సమస్య తలెత్తినట్లు తెలిపింది. ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌లు ఆఫ్ కావడంతోనే ఇంజన్లకు ఇంధనం అందడం లేదని పేర్కొంది. ఈ సమయంలో కాక్‌పిట్‌లో పైలట్లు మాట్లాడుకుంటూ.. ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌లు ఎందుకు ఆఫ్ చేశామని ఒకరు ప్రశ్నించగా, మరొకరు నేను అలా చేయలేదని సమాధానం ఇచ్చారు. మొత్తంగా , ఇంధన నియంత్రణ స్విచ్‌లు వాటి అంతటా…
Chhangur Baba: జమాలుద్దీన్ అలియాస్ ఛంగూర్ బాబా కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఒక పద్ధతి ప్రకారం, లవ్ జీహాద్ నెట్వర్క్ దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నట్లు ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు విచారణలో తేలింది. హిందూ మహిళల్ని ఇస్లాంలోకి మార్చేందుకు పలువురు ముస్లిం యువకులు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్న విషయం వెల్లడైంది.
Radhika Yadav: టెన్నిస్ ప్లేయర్ రాధికా యాదవ్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమె తండ్రి దీపక్ యాదవ్ కాల్చి చంపాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే, ఈ విషయానికి సంబంధించి, రాధికా ప్రాణ స్నేహితురాలు హిమాన్షికా సింగ్ సంచలన విషయాలు బయటపెట్టింది. తన స్నేహితురాలు రాధిక తన కుటుంబం నుంచి అన్ని విషయాల్లో సమస్యల్ని ఎదుర్కొందని, ఆమె తన ఇంట్లోనే ఉక్కిరిబిక్కిరికి గురైందని చెప్పింది.