Supreme Court: వైవాహిక వివాద కేసులో జీవిత భాగస్వామి టెలిఫోన్ సంభాషణల్ని రహస్యంగా రికార్డ్ చేయడం ఆమోదయోగ్యమైన సాక్ష్యమని సుప్రీంకోర్టు సోమవారం ఓ కేసులో తీర్పు చెప్పింది. జీవిత భాగస్వామి టెలిఫోన్ సంభాషణల్ని రహస్యంగా రికార్డు చేయడం గోప్యత హక్కును ఉల్లంఘిస్తుందని, కుటుంబ కోర్టులో సాక్ష్యంగా అంగీకరించలేమని పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు ఇచ్చిన తీర్పున సుప్రీంకోర్టు పక్కన పెట్టింది.
జస్టిస్ బి.వి. నాగరత్న మాట్లాడుతూ.. అలాంటి సంభాషణల్ని సాక్ష్యంగా అనుమతించడం వల్ల గృహ సామరస్యాన్ని, వైవాహిక సంబంధాలను హాని కలిగిస్తుందని, జీవిత భాగస్వాములపై నిఘా పెట్టడాన్ని ప్రోత్సహిస్తుందని కోన్ని వాదనలు ఉన్నాయని అననారు. అయితే, అలాంటి వాదనలు సమర్థనీయమని మేము భావించడం లేదని, వివఆమం భార్యాభర్తలు ఒకరిపై ఒకరు నిఘా పెట్టుకునే దశకు చేరుకుంటే, ఆ సంబంధం విచ్ఛిన్నమైన సంబంధానికి లక్షణమని, వారి మధ్య నమ్మకం లేకపోవడాన్ని సూచిస్తుందని జస్టిస్ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర వర్మతో కూడిన ధర్మాసనం తన తీర్పులో చెప్పింది.
Read Also: Ahmedabad Plane Crash: పరిహారం కాదు.. జవాబుదారీతనం కావాలి.. నివేదికపై బాధిత కుటుంబాలు ఆందోళన
కేసు ఏమిటి..?
మొదటగా భటిండా కుటుంబ కోర్టులో వచ్చిన ఈ కేసులో హిందూ వివాహ చట్టం, 1955 లోని 13 కింద విడాకులు మంజూరు చేసింది. భార్య తనపై క్రూరత్వం చూపించిందని భరత్ ఆరోపించారు. తన వాదనలకు సాక్ష్యాలుగా అతను రికార్డ్ చేసిన ఫోన్ సంభాషణల్ని కోర్టు ముందు పెట్టాడు. ఫ్యామిలీ కోర్టు వీటిని సాక్ష్యాలుగా అనుమతించింది. అయితే, తన అనుమతి లేకుండా కాల్స్ రికార్డ్ చేయబడ్డాయని, వాటిని సాక్ష్యంగా తీసుకోవడం వల్ల తన ప్రాథమిక గోప్యత హక్కు ఉల్లంఘించబడిందని వాదిస్తూ భార్య హైకోర్టును ఆశ్రయించింది.
భార్య నిర్ణయంతో హైకోర్టు ఏకీభవిస్తూ ఫ్యామిలీ కోర్టు ఆదేశాలు పక్కన పెట్టింది. కాల్స్ ఏ పరిస్థితుల్లో రికార్డ్ చేయబడ్డాయో నిర్ధారించలేమని హైకోర్టు పేర్కొంది. అయితే, దీనిపై భర్త సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో, అతడికి అనుకూలంగా తీర్పు వచ్చింది.