Ustaad Bhagat Singh OTT Rights: ఉస్తాద్ భగత్ సింగ్ ఓటీటీ హక్కులు ఫిక్స్.. నెట్‌ఫ్లిక్స్‌లోకి పవన్ మాస్ ఎంట్రీ..!
- ఉస్తాద్ భగత్ సింగ్ ఓటీటీ హక్కులు ఫిక్స్..
- ఐదు భాషల్లో విడుదల కానున్న ఉస్తాద్ భగత్ సింగ్..
- థియేటర్లలో విడుదలైన తర్వాత ఈ మూవీని నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం చేయనున్నట్టు ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ustaad Bhagat Singh OTT Rights: డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న మాస్ ఎంటర్టైనర్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకున్నాయి. గబ్బర్ సింగ్ కాంబినేషన్‌లో చాలా కాలం తర్వాత వస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. పవన్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నా కథానాయికలుగా నటిస్తుండటం మూవీపై మరింత క్రేజ్‌ను తీసుకొచ్చింది. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో.. ఈ సినిమా అన్ని పనులను శరవేగంగా పూర్తి చేసుకుంటుంది. థియేట్రికల్ రిలీజ్‌కు ముందు నుంచే బిజినెస్ పరంగా స్ట్రాంగ్ డీల్ చేసుకుంటున్న ఉస్తాద్ భగత్ సింగ్ తాజాగా ఓటీటీ హక్కులపై బిగ్ అప్‌డేట్ ఇచ్చింది.
Read Also: Snapdragon 8 Gen 5, 200MP కెమెరా, 7600mAh బ్యాటరీతో iQOO Z11 Turbo లాంచ్.. ధర ఎంతంటే..?
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
అయితే, థియేటర్లలో విడుదలైన తర్వాత ఈ మూవీని నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. నెట్‌ఫ్లిక్స్ తాజాగా పండుగ సీజన్ సందర్భంగా తెలుగు సినిమాల లిస్ట్ ను ప్రకటించగా, ఆ లిస్ట్‌లో మొదటి సినిమాగా ఉస్తాద్ భగత్ సింగ్ పేరు నిలిచింది. ఇది పవన్ కళ్యాణ్ అభిమానులకు నిజంగా సంక్రాంతి పండుగ లాంటి వార్త అని చెప్పాలి. ముఖ్యంగా ఈ చిత్రాన్ని కేవలం తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్‌కు తీసుకురావాలని నెట్‌ఫ్లిక్స్ ప్లాన్ చేస్తుంది. దీంతో దేశవ్యాప్తంగా పవన్ మాస్ ఇమేజ్ మరింత విస్తరిస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
Read Also: NTR- Neel Dragon Movie: ఇట్స్ అఫీషియల్.. డ్రాగన్ సినీమాలో బాలీవుడ్ సీనియర్ యాక్టర్
ఇక, సినిమా విషయానికి వస్తే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గతంలో ఎప్పుడూ చూడని లుక్, పవర్‌ఫుల్ డైలాగ్స్, హరీష్ శంకర్ మార్క్ మాస్ ట్రీట్ ఇందులో హైలెట్ గా నిలవనుంది. దీనికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందజేయగా, ఇప్పటికే విడుదలైన అప్డేట్స్, పోస్టర్లు, పాటలు ప్రేక్షకుల్లో భారీ రెస్పాన్స్ వచ్చింది. మొత్తంగా చూస్తే, థియేటర్లలో భారీ ఓపెనింగ్స్‌తో రచ్చ చేయడానికి ఉస్తాద్ భగత్ సింగ్ రెడీ అవుతుంది. విడుదల తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో పాన్ ఇండియా ఆడియెన్స్‌ను అలరించనుందని స్పష్టం చేసింది. పవర్ స్టార్ మాస్ మ్యాజిక్ మరోసారి బాక్సాఫీస్‌తో పాటు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ను కూడా షేక్ చేస్తుందని అభిమానులు పేర్కొంటున్నారు.
Justice doesn't wait for permission. Neither does he 😎🔥
Ustaad Bhagat Singh, is coming to Netflix after its theatrical release in Telugu, Tamil, Hindi, Malayalam and Kannada#NetflixPandaga pic.twitter.com/MgXGlVN5Bb— Netflix India (@NetflixIndia) January 16, 2026
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?