LORA: ఆపరేషన్ సిందూర్ సమయంలో ‘‘బ్రహ్మోస్ క్షిపణి’’ పనితనానికి పాకిస్తాన్‌తో పాటు ప్రపంచమే అదిరిపడింది. అయితే, ఇప్పుడు భారత్ మరో ప్రమాదకరమైన క్షిపణిని కొనుగోలు చేయాలని భావిస్తోంది. పాకిస్తాన్, చైనాలకు వణుకు పుట్టేలా ‘‘లోరా(LORA)’’ ఆయుధాన్ని ఇజ్రాయిల్ నుంచి కొనుగోలు చేయాలని భావిస్తోంది. దీనిని సుఖోయ్-30 MKI వంటి విమానాలలో అనుసంధానించాలని చూస్తోంది. లాంగ్ రేంజ్ ఆర్టిలరీ(లోరా) అనేది ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ (IAI) అభివృద్ధి చేసిన సూపర్‌సోనిక్ సెమీ-బాలిస్టిక్ క్షిపణి. దీనిని గాలి నుంచి ప్రయోగించే సామర్థ్యం కలిగి ఉంది. ఇది 400-430 కి.మీ దూరంలోని లక్ష్యాలపై కూడా దాడి చేయగలదు.
సుఖోయ్-30 MKI వంటి యుద్ధ విమానాల నుండి ప్రయోగించబడేలా LORA రూపొందించబడింది. దీని వేగం కారణంగా, శత్రు దేశాలు లోరాను అడ్డగించడం చాలా కష్టం. ‘‘లాంచ్ అండ్ ఫర్గెట్’’ వ్యవస్థను ఇది కలిగి ఉంది. నిర్దేశించిన టార్గెట్‌ని సొంతగా చేధించగలదు.
Read Also: Mohammed Siraj: డిఎస్పి మహ్మద్ సిరాజ్‌కు ఐసీసీ షాక్.. భారీ జరిమానా.. అంతేకాదండోయ్..!
LORA ప్రత్యేకతలు ఏమిటి..?
దీని పరిధి 400-430 కి.మీ వరకు ఉంటుంది. ఇది పాకిస్తాన్, చైనాలోని పలు ప్రాంతాలను టార్గెట్ చేయగలదు. దీని వేగం గంటకు 6,147 కి.మీ. 10 మీటర్ల అటూ ఇటూగా అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించగలదు. శత్రు దేశాల కమాండ్ సెంటర్లు, రాడార్ వ్యవస్థల్ని లక్ష్యంగా చేసుకునేందుకు దీనిని రూపొందించారు. ఈ క్షిపణి పొడవు 5.2 మీటర్లు, దీని బరువు 1600 కిలోలు.
లక్ష్యాన్ని కనుగొనడానికి ఈ క్షిపణికి GPS, ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్ (INS) రెండు సిస్టమ్స్‌ని కలిగి ఉంటుంది. ఇది యాంటీ-జామింగ్ వ్యవస్థని కలిగి ఉంది. శత్రు దేశాలు జామింగ్ నుంచి తప్పించుకోగలదు. బంకర్లు, ఎయిర్ బేస్‌లు, నావల్ బేస్‌లు, కమాండ్ సెంటర్లను లక్ష్యంగా చేసుకునే సామర్థ్యం ఉంది. సుఖోయ్-30 MKI ఫైటర్ జెట్ నాలుగు LORA క్షిపణులను మోయగలదు. ఒకే ఫైటర్ జెట్ నుంచి నాలుగు లక్ష్యాలను టార్గెట్ చేసే సత్తా లోరా క్షిపణికి ఉంది.
Read Also: Dengue Vaccine : భారతదేశంలో తొలి స్వదేశీ డెంగ్యూ వ్యాక్సిన్..!
భారత్‌కు ఆసక్తి ఎందుకు..?
భారత్ వద్ద ప్రస్తుతం, లాంగ్ రేంజ్, అత్యంత ఖచ్చితత్వంతో దాడులు చేసే క్షిపణులు ఉన్నాయి. వీటిలో బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి (300-500 కి.మీ పరిధి), రాఫెల్ జెట్‌లలో విలీనం చేయబడిన SCALP-EG క్షిపణి (500 కి.మీ పరిధి), ప్రలే షార్ట్-రేంజ్ బాలిస్టిక్ క్షిపణి (500 కి.మీ పరిధి), రాంపేజ్ ఎయిర్-టు-గ్రౌండ్ క్షిపణి ఉన్నాయి.
అయితే, భారత ఎయిర్ ఫోర్స్ తన వైమానిక దాడుల సత్తాను పెంచుకోవాలని అనుకుంటోంది. భారత్, ఇజ్రాయిల్ సహకారంతో దేశంలోనే లోరాను తయారు చేయాలనుకుంటోంది. బ్రహ్మోస్ తక్కువ ఎత్తులో అంటే, సముద్ర మట్టానికి దగ్గరగా ప్రయాణిస్తుంది. దీంతో ఏ వ్యవస్థ దీనిని ఆపలేదు. ఇది శత్రు దేశాల ఎయిర్ డిఫెన్స్‌లోకి చొచ్చుకెళ్లగలదు.
లోరా అనేది ఎత్తు నుంచి ప్రయోగించగలిగే క్వాసీ-బాలిస్టిక్ మిస్సైల్. దీనిని ప్రయోగించిన తర్వాత పైకి ప్రయాణిస్తుంది. ఇది శత్రు దేశాల రాడార్ల నుంచి తప్పించుకోవడంలో సహాయపడుతుంది. 430 కి.మీ పరిధిలోని లక్ష్యాన్ని ధ్వంసం చేస్తుంది. బ్రహ్మోస్‌ను భారతదేశం మరియు రష్యా సంయుక్తంగా తయారు చేశాయి. LORA తో పోలిస్తే ఇది ఖరీదైనది. బ్రహ్మోస్ యూనిట్ ధర దాదాపు రూ. 20 నుండి 30 కోట్లు, మరోవైపు, LORA చౌకైనది, ఎగుమతి చేయదగినది. లోరా ద్వారా భారత తన ఎగుమతి సామర్థ్యాన్ని కూడా పెంచుకోగలదు.