Chhangur Baba: ఉత్తర్ ప్రదేశ్‌లో జమాలుద్దీన్ అలియాస్ ఛంగూర్ బాబా అరాచకాలు రోజురోజుకు వెలుగులోకి వస్తు్న్నాయి. హిందూ అమ్మాయిలే లక్ష్యంగ మతమార్పిడి ముఠాను యూపీ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో చంగూర్ బాబాకు మతమార్పిడిల కోసం మిడిల్ ఈస్ట్‌లోని పలు ఇస్లాం దేశాల నుంచి నిధులు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఏకంగా మతమార్పిడిల కోసం వందల కోట్లు సేకరించినట్లు తేలింది.
Asim Munir: పాకిస్తాన్లో రాజకీయ అస్థిరత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా, ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ యాక్టివ్‌గా మారారు. పౌర ప్రభుత్వాన్ని కాదని ఆయనే అన్ని దేశాల పర్యటకు వెళ్తున్నారు. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అసలు నిజమైన పాలకుడా..? కాదా..? అనే సందేహాలు వస్తున్నాయి. ఇటీవల, షరీఫ్‌ని పక్కన పెట్టేందుకు మునీర్ ప్రయత్నిస్తు్న్నాడనే వాదనలు కూడా ఊపందుకున్నాయి. ఇదే జరిగితే, మరోసారి పాకిస్తాన్ సైనిక ప్రభుత్వ కిందకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది.
Gokarna: కర్ణాటకలోని గోకర్ణలోని రామతీర్థ కొండపై ఉన్న మారుమూల మరియు ప్రమాదకరమైన గుహలో నివసిస్తున్న ఒక రష్యన్ మహిళ, ఆమె ఇద్దరు చిన్న కుమార్తెలను పోలీసులు రక్షించారు. గోకర్ణ పోలీసులు గస్తీ తిరుగుతున్న సమయంలో, అడవిలో ఒక తాత్కాలిక నివాసంలో ఈ ముగ్గురిని కనుగొన్నారు. జూలై 9న గోకర్ణ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ ఎస్ఆర్ తన బృందంతో పర్యాటకుల భద్రత కోసం గస్తీ తిరుగుతున్న సమయంలో రామ తీర్థ కొండ ప్రాంతంలో, అడవిలోని ఒక గుహ వద్ద వీరు కనిపించారు.
Air India Crash: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం, భారతదేశ వైమానిక రంగంలోనే అత్యంత దారుణమైన దుర్ఘటనగా మిగిలిపోయింది. జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ కు వెళ్లే బోయింగ్ 787-8 డ్రీమ్‌లైన్ టేకాఫ్ అయిన 32 సెకన్లలోనే కుప్పకూలింది. విమానంలో ఉన్న ప్రయాణికులతో పాటు నేలపై ఉన్న పలువురితో కలిపి 270 మంది వరకు మరణించారు. అయితే, దీనిపై తాజాగా ప్రభుత్వం ప్రాథమిక నివేదిక విడుదల చేసింది. ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌ల తప్పిదంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. సుక్మా జిల్లాలో ఒకేసారి భారీగా మావోయిస్టులు లొంగిపోయారు. 23 మంది లొంగిపోవడంతో పోలీసులు అతిపెద్ద విజయం సాధించారని చెప్పవచ్చు. వీరందరిపై కలిపి రూ. 1.18 కోట్ల నజరానా ఉంది. శనివారం, వీరంతా సుక్మా జిల్లా పోలీసులు ముందు లొంగిపోయారు. దీనికి ఒక రోజు ముందు, సుక్మా సరిహద్దు జిల్లా అయిన నారాయణపూర్ జిల్లాలో 22 మంది మావోయిస్టులు తమ ఆయుధాలను విడిచిపెట్టారు. సుక్మా పోలీసులు, సీఆర్పీఎఫ్ సంయుక్త ప్రయత్నాల కారణంగా ఈ లొంగుబాటు జరిగింది.
COVID-19: ప్రమాదకరమైన కరోనా వైరస్ మళ్లీ తిరిగి వస్తుందా..? అనే భయాలు మొదలయ్యాయి. కొత్తగా ‘‘స్ట్రాటస్’’ అనే కోవిడ్-19 స్ట్రెయిన్ వెలుగులోకి వచ్చింది. పలువరు ఆరోగ్య నిపుణుల ప్రకారం, ఇది వ్యాక్సిన్ల ద్వారా వచ్చిన రోగనిరోధకశక్తిని కూడా తప్పించుకోగలదని, అన్ని వయసుల వారికి అక్రమించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
Extramarital Affair: ఢిల్లీలో ఒక రోడ్డుపై నడుస్తున్న వ్యక్తి ఫోన్‌ని ఇద్దరు దుండగులు ఎత్తుకెళ్లారు. కట్ చేస్తే, ఈ ఘటనే సదరు వ్యక్తి భార్య "వివాహేతర సంబంధాన్ని" బట్టబయలు చేసింది. తన భర్త ఫోన్‌ని దొంగలించేలా భార్యనే ఇద్దరు వ్యక్తులతో కలిసి ప్లాన్ చేసినట్లు తేలింది. మొదట సదరు వ్యక్తి మామూలుగానే దక్షిణ ఢిల్లీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కానీ, పోలీసు విచారణలో మాత్రం సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Air India crash: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా దుర్ఘటనపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) ప్రాథమిక నివేదికను వెల్లడించింది. ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌ల కారణంగానే ఇంజన్లకు ఇంధన సరఫరా నిలిచిపోయినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందనేది లోతైన విచారణలో తెలియాల్సి ఉంది. జూన్ 12న లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం 32 సెకన్లలోనే కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 270 మంది మరణించారు.
Nimisha priya Case: కేరళకు చెందిన నర్సు నిమిషా ప్రియా యెమెన్ దేశంలో ఉరికంబానికి దగ్గర అవుతున్నారు. ఆ దేశస్తుడైన తలాల్ అబ్దో మహదీని 2017లో హత్య చేసిన కారణంగా ఆమెను అక్కడి చట్టాల ప్రకారం ఉరిశిక్ష విధించబడింది. జూలై 16న ఆమెకు ఉరిశిక్ష అమలు చేయబోతున్నారు.
Balochistan: పాకిస్తాన్‌ను బలూచ్ లిబరేషన్ ఫ్రంట్(బీఎల్ఎఫ్) వణికిస్తోంది. కొత్తగా ‘‘ఆపరేషన్ బామ్’’ చేపట్టింది. దీంతో పాక్ సైన్యం, భద్రతా బలగాలు వణికిపోతున్నాయి. పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్‌కు విముక్తి కల్పించేందుకు బీఎల్ఎఫ్ పోరాడుతోంది. బుధవారం బలూచిస్తాన్‌లోని టర్బాట్లో జరిగిన గ్రెనేడ్ దాడిలో మహిళలు, పిల్లలు సహా కనీసం ఐదుగురు గాయపడ్డారు. దక్షిణ బలూచిస్తాన్‌లోని కెచ్ జిల్లాలో భాగమైన టర్బాట్‌లోని అబ్సర్ ప్రాంతంలోని ముహమ్మద్ యూనిస్ నివాసంపై మోటార్ సైకిళ్లపై వచ్చిన గుర్తు తెలియని దుండగులు హ్యాండ్ గ్రెనేడ్ విసిరారు.