Renault Filante: ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ (Renault) కొత్తగా ఫ్లాగ్‌షిప్ SUV కారు రెనాల్ట్ ఫిలాంటే (Renault Filante)ను అధికారికంగా లాంచ్ చేసింది. రెనాల్ట్ ఫిలాంటే బోల్డ్ క్రాస్‌ఓవర్ డిజైన్‌తో SUV స్టైల్‌ను కూపే తరహా లుక్‌తో మెప్పిస్తుంది. ముందు భాగంలో ఇల్ల్యూమినేటెడ్ డైమండ్ ప్యాటర్న్ గ్రిల్, ఫ్లష్ ఫిట్ LED హెడ్‌ల్యాంప్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. వెనుక భాగంలో అల్ట్రా-స్లిమ్ LED లైట్లు, సస్పెండెడ్ స్పాయిలర్ స్పోర్టీ లుక్‌ను ఇస్తాయి. 19 లేదా 20 అంగుళాల వీల్స్, స్మూత్ రూఫ్‌లైన్ ఈ ప్రీమియం డిజైన్‌ను పూర్తిచేస్తాయి.
ఈ రోజు నుంచే Mahindra XEV 9S బుకింగ్స్ ప్రారంభం.. ధర, ఫీచర్ల వివరాలు ఇవే!
ఫిలాంటే ఇంటీరియర్‌ను లౌంజ్ తరహా అనుభూతిని ఇచ్చేలా రూపొందించారు. డ్యాష్‌బోర్డ్‌పై మూడు 12.3 అంగుళాల స్క్రీన్లు (డ్రైవర్ డిస్‌ప్లే, సెంట్రల్ టచ్‌స్క్రీన్, ప్యాసింజర్ స్క్రీన్ తో పాటు 25.6 అంగుళాల AR హెడ్-అప్ డిస్‌ప్లే ఉంది. టెక్నో, ఐకానిక్, ఎస్ప్రిట్ ఆల్పైన్ వంటి వేరియంట్లలో విభిన్న కలర్ థీమ్‌లు అందుబాటులో ఉన్నాయి. ట్రై-జోన్ క్లైమేట్ కంట్రోల్, 1.1 చ.మీ ఫిక్స్డ్ ప్యానోరమిక్ సన్‌రూఫ్, కంఫర్ట్ లౌంజ్ సీట్లు ప్రధాన హైలైట్స్. వెనుక సీట్లో ప్రయాణికులకు 886 మి.మీ హెడ్ రూమ్, 320 మి.మీ నీ రూమ్ లభిస్తుంది.

ఆడియో కోసం ఆర్కమైస్ సిస్టమ్ నుంచి బోస్ ప్రీమియం సౌండ్ సిస్టమ్ వరకు ఎంపికలు ఉన్నాయి. కనెక్టివిటీ పరంగా ఆండ్రాయిడ్ ఆటోమోటివ్ OS, 5G, వైర్‌లెస్ ఛార్జింగ్, వై-ఫై, నాలుగు USB-C పోర్ట్స్ అందుబాటులో ఉన్నాయి. భద్రత కోసం 30కి పైగా ADAS ఫీచర్లు, ఎమర్జెన్సీ స్టీరింగ్ అసిస్టు, స్మార్ట్ రియర్‌వ్యూ మిర్రర్, చైల్డ్ ప్రెజెన్స్ డిటెక్షన్ వంటి ఆధునిక టెక్నాలజీలు ఉన్నాయి.
Kite Festival: ఆకాశంలో రంగుల హరివిల్లు.. పరేడ్ గ్రౌండ్‌లో కన్నుల పండుగగా అంతర్జాతీయ పతంగుల పండుగ..!
రెనాల్ట్ ఫిలాంటే లో అప్‌గ్రేడ్ చేసిన E-టెక్ ఫుల్ హైబ్రిడ్ సిస్టమ్ అందుబాటులో ఉంది. ఇది మొత్తం 250 Hp శక్తి, 565 nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ (150 Hp)తో పాటు రెండు ఎలక్ట్రిక్ మోటర్లు, 1.64 kWh బ్యాటరీతో ఈ సెటప్ పనిచేస్తుంది. 3-స్పీడ్ మల్టీమోడ్ ఆటో గేర్‌బాక్స్‌తో జతచేశారు. నగరంలో 75 శాతం వరకు ఎలక్ట్రిక్ మోడ్‌లో నడుస్తుందని రెనాల్ట్ చెబుతోంది. CO₂ ఉద్గారాలు కేవలం 106 g/km మాత్రమే. మొత్తంగా ఈ రెనాల్ట్ ఫిలాంటే స్టైల్, టెక్నాలజీ, హైబ్రిడ్ పనితీరుతో రెనాల్ట్ బ్రాండ్‌కు గ్లోబల్ మార్కెట్లో హాట్ టాపిక్ గా నిలవనుంది.
